హైదరాబాద్

ఆఖరి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

4న జరిగే ఎన్నికల శిక్షణకు హాజరుకావల్సిందే!
లేని పక్షంలో క్రిమినల్ చర్యలు తప్పవు
హైదరాబాద్, జనవరి 1: ఎన్నికల విధులంటేనే వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది హడలిపోతున్నారు. ఒకప్పుడు ఎన్నికలంటే రిగ్గింగ్, రాజకీయ పార్టీ నేతల మధ్య గొడవలు, ఘర్షణ వంటివి చోటుచేసుకునేవి. నేటికి అవి మరిచిపోలేని ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులంటేనే భయపడిపోతున్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల విధుల కోసం 25వేల మందిని నియమించగా, వీరిలో 6511 మంది నేటి వరకు జరిగిన పలు దఫాల శిక్షణకు హాజరుకానేలేదు.
నెలరోజుల క్రితం కమిషనర్, ఎన్నికల అథారిటీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసినా సిబ్బంది హాజరుకాకపోవటం గమనార్హం. ఎన్నికలంటే ఎక్కడో వౌలిక వసతులు సక్రమంగా లేని పోలింగ్ స్టేషన్లలో రాత్రే వెళ్లి అక్కడే మకాం వేసి మరుసటి రోజు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోలింగ్ నిర్వహించి రావాలన్న అంశంపై ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తి చూపటం లేదు. ఇందుకు గాను విధుల నుంచి మినహాయింపు పొందేందుకు రకరకాల సాకులు వెతుకుతున్నారు. కొందరు మహిళ ఉద్యోగులు తమ వ్యక్తిగత కారణాలను చూపుతూ మినహాయింపు పొందేందుకు ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల విభాగానికి ప్రదక్షిణలు చేస్తుండగా, మరికొందరు మెడికల్ సర్ట్ఫికెట్లు సమర్పించి తప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ జిహెచ్‌ఎంసి ఎన్నికలకు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా 26వేల మంది పోలీసులు, 80వేల మంది ఇతర సిబ్బంది అవసరమని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే! అయితే ఇప్పటికే నియమితులైన 25వేల మంది సిబ్బందిలో నేటి వరకు 6511 మంది గైర్హాజరయ్యారంటే ఎన్నికల విధుల పట్ల సిబ్బంది ఎంత ఆసక్తి చూపుతున్నారో అంచనా వేసుకోవచ్చు. గైర్హాజరైన వారందరికి ఈ నెల 4వ తేదీన జరిగే శిక్షణ కార్యక్రమాన్ని డెడ్‌లైన్‌గా పెట్టిన కమిషనర్ ఆ తర్వాత క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వీలుగా పోలీసులకు లేఖలు రాయాలని భావిస్తున్నారు.గ్రేటర్‌లో ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి కూడా కమిషనర్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే పలు సార్లు సిబ్బందికి అల్టిమేటం జారీ చేసినా, గత నెల 28 నుంచి 30వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఏకంగా వేల సంఖ్యలో సిబ్బంది హాజరుకాలేదంటే, ఇక చిట్టచివరి అవకాశంగా ఈ నెల 4వ తేదీన నిర్వహించే కార్యక్రమానికైనా హజరుకావాలన్న ఆయన ఆదేశం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి!

డిసిఎం, బైక్ ఢీ ఒకరి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు
హైదరాబాద్/శామీర్‌పేట, జనవరి 1: రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతి వేగంగా వచ్చిన డిసిఎం వ్యాను ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శామీర్‌పేట పోలీసుల కథనం ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన రామ్‌బాబు(23), రాజశేఖర్(23) కలిసి తూముకుంట రాజీవ్ రహదారిపై సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వెళ్తుండగా డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో రామ్‌బాబు మృతిచెందగా, రాజేశేఖర్ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.