ఉత్తరాయణం

టిప్పు సుల్తాన్ ఒక టెర్రరిస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెక్యులరిస్టు అంటే హిందూ వ్యతిరేకమా? లేక, హిం దువులను హతమార్చడమా? సెక్యులరిజం అంటే అనిన మతాలను సమానంగా చూడటం కదా. అది అలా ఉం చితే, టిప్పు సుల్తాన్ నాటి టెర్రరిస్టు అని చెప్పక తప్పదు. ఎక్కువగా నంబూద్రి బ్రాహ్మణులను ఇస్లాంలోకి బల వంతంగా చేర్పించడం, మారని వేలాది మందిని హత మార్చడం జరిగింది. మలబార్ ప్రాంతంలో లక్షలాది మం ది హిందువులను బలవంతంగా మతం మార్చినట్టు తెలు స్తున్నది. ఆనాటు టిప్పు సుల్తాన్ ఘాతుకాలకు లక్షలాది మంది నాయర్లు, బ్రాహ్మణులు వారి ప్రాంతాలను వదలి పారిపోయయనట్లు తెలుస్తున్నది. చిన్నపిల్లలతో సహా పెద్దలను ఏనుగులతో తొక్కించిన ఇట్లాంటి నీచుడిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పెద్ద సెక్యులరిస్టు అని పేర్కొనడం, జాతీయ వీరుడిగా గుర్తించి, అతగాడి జయంతిని జరపాలనుకోవడం అన్యాయం. ఓట్లకోసం ఇటువంటి పనులకు పాల్పడటం దేశద్రోహమే. టిప్పు సుల్తాన్ నిజ స్వరూపాన్ని ‘ఉన్నమాట’ ద్వారా బయట పెట్టిన ఎంవిఆర్ శాస్ర్తీగారికి ధన్యవాదాలు.
- జి. శ్రీనివాసులు, అనంతపురం
సామాన్యుణ్ని చేరని సమాచార హక్కు చట్టం
ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రం సమాచార హక్కు చట్టం. పార్లమెంట్ ద్వారా ప్రజలకు దఖలు పడ్డ ఈ చట్టం నిజానికి విద్యావంతులను దాటి సామాన్యుని ఇంకా చేరలేదు. ఈ చట్టం ద్వారానే మాజీ రాష్టప్రతి ప్రతిభా పాటిల్ విదేశీ విహారాల వ్యవహారం బట్టబయలైంది. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఒక ఆచార్యుడిని కొన్ని అంశాలపై ఒక కక్షిదారు వివరణలను అడిగారు. ప్రభుత్వ ఉద్యోగి కుల, మత ఎంపిక వంటివి సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తాయ. కానీ సదరు ఆచార్యుడు తన వివ రాలు అడిగితే ‘అట్రాసిటీ’ కేసు పెడతానని బెదిరిం చడాన్ని సహ కమిషనర్ తప్పు పట్టారు. అనుసూచిత కులాల వారు కొందరు ఇలా చట్టాన్ని దుర్వినయోగం చేయడం వల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ బలపడే అవకాశముంది. వేరే మతంలోకి మారేవారికి కులం ఎలా వర్తిస్తుందో అర్థం కావడంలేదు. మతం మా రిన వెంటనే కులాన్ని కూడా రద్దు చేసుకోవాలి.
- పి.ఆర్.వి.ఎస్. ఆచార్యులు, విశాఖపట్టణం
రాజధాని రాజకీయం
ఉన్న రాజధానిని ఇచ్చేశాం
జపాన్ వెళ్లాం, సింగపూర్ చూశాం
ఇక కొత్త రాజధాని నిర్మించుకుందాం
హస్తిన నిధులకోసం అర్రులు చాచాం
మట్టి, నీరు నినాదం చేశాం
ఇసుక, సిమెంట్ మరచిపోయాం
ఒక్క ఇటుక తెమ్మని చెప్పాం
అమరావతి పేరును ఉంచేశాం
తుళ్లూరు పేరును తెంచివేశాం
గుంటూరును గుప్తంగా ఉంచాం
విజయవాడ పయనానికి ఆదేశించాం
ప్రమాణ స్వీకారానికి కోట్లు చూపాం
విదేశాలు తిరిగిన కోట్లు చెప్పలేం
అమరావతి పూజకు కోట్లు అంకురార్పణం.
పూర్ణకుంభం, తెలుగుతల్లిని మరచాం
ఆంధ్ర ఆవతరణ దినోత్సవం చరిత్ర చెరిపేశాం.
ఆంధ్ర రాజధాని రాజకీయం అనుకుందాం.
- సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
‘టిప్పు’ పాచిక తప్పు
మైనార్టీ ఓట్లకోసం కర్ణాటక ముఖ్యమంత్రి ‘టిప్పు’ పాచికతో తప్పుడు ఎత్తు వేశారు. నేడు ‘టిప్పు’ అయంది. రేపు ఔరంగజేబును నెత్తికెక్కించుకున్నా ఆశ్చర్యపోవా ల్సిన అవసరం లేదు. ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి. ఆర్. శాస్ర్తీగారు శ్రమతో టిప్పు సుల్తాన్ దుశ్చర్యలను ఎండ గట్టారు. కశ్మీర్‌లో హిందువులపై పైశాచిక చర్యలను, దేశంలో పలుచోట్ల దేవాలయాల విధ్వంసానికి పాల్పడిన అసహన దమనకాండకు కారకులైన వారిని పాఠకులకు తెలియ జేయాలి. కర్ణాటక ముఖ్యమంత్రి టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించి ఘోరతప్పిదం చేశారు. పరిశోధనాత్మక రచన చేసిన శాస్ర్తీగారికి కృతజ్ఞతలు.
- దండు కృష్ణవర్మ, గౌతంనగర్, హైదరాబాద్
ధనవంతులకే ‘అమరావతి’
విజయవాడలో స్వంత ఇల్లు ఉంటే కోటీశ్వరుడే. కానీ పప్పులే కాదు, మిర్చి, చింతపండు కూడా కిలో రూ.100 దాటిపోయాయి. ఆరువేల జీతం తెచ్చుకునే కుర్రాళ్లు, భార్యాబిడ్డలతో బతుకు సాగించడం కష్టమని తలచి పెళ్లిళ్లే మానుకునే దుస్థితి ఏర్పడింది. అసలు అమ్మాయిలు చిన్న జీతగాళ్లను భర్తగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. బిటెక్‌లు చదివేస్తున్న అమ్మాయిలు, అరలక్ష సంపాదించే సాఫ్ట్‌వేర్లను తప్ప మరొకరిని కనె్నత్తి చూడటం లేదు. రైతుల ఆత్మహత్యలు షరా మామూలైపోయాయి. ఆమరావతి ఆనందమే కాని..ఈ ఆనందం కేవలం ధనవంతులకే పరిమితం. బీదలకు అది గగన కుసుమం.
- జ్యోతిర్మయి, విజయవాడ
పోలీసులకు నజరానా
ప్రోత్సాహకాలు, పదోన్నతులు, డబుల్‌బెడ్ రూం ఇళ్ళు, స్థలాలు, కాలుష్య ఎలవెన్సులు మొదలైన నజరానాలు పోలీసులకు కలుగచేయాలనే ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారి సంకల్పం అభినందనీయం. పోలీస్ అంటే ప్రజల భయాన్ని పోగొట్టేవాడని, రక్షణ కల్పించేవాడని, లంచగొండి కాడని, మర్యాదకు మారుపేరు గలవాడని ప్రజలకు పూర్తి నమ్మకం కలగాలి. కాని ప్రస్తుత పరిస్థితి వేరుగా ఉన్నదనే సంగతి విదితమే. పోలీసులకు ఎన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ వారంటే ప్రజల మనసులో పడిన ముద్రను చెరిపేసుకోవాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్