ఉత్తరాయణం

ఎక్కడైనా ప్రమాదాలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల 19న ‘చెన్నై పాఠాలు మనకు వినిపించవా’ అని అడుసుమిల్లి జయప్రకాశ్ గారు అమరావతిలో నిర్మిస్తున్న రాజధాని రాబోయే కాలంలో వరద ముంపుకు గురికా వచ్చునని రాశారు. మరెక్కడ నిర్మించాలి? విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణంలో ప్రస్తుతం ఉన్న భవనాలు, ప్రదేశాలు సరిపోవు. కాబట్టి విశాలమైన అమరావతి భూమిని ఎంచుకుని ముప్పయవేల ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు. అమరావతి కాకుం టే మరెక్కడ క్షేమంగా ఉంటుందో రచయత వివరించలేక పోయారు. సమస్య చెప్పినప్పుడు పరిష్కారాన్ని కూడా సూచించాలి కదా. ఎక్కడ నిర్మించినా భయాలు ఉండనే ఉంటాయ. నివారణకు ముందునుంచే చెట్లు పెంచడం, కృష్ణానది కాలుష్యానికి గురికాకుండా చూడడం, అధిక వాహనాలను అరికట్టడం లాంటి చర్యల ద్వారా వూహించే ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
స్వేచ్ఛ పేరుతో ఇబ్బంది కలిగించవద్దు
బీఫ్ తినడం, తినకపోవడం వారి వారి సంప్రదాయా లను బట్టి ఉంటుంది. కానీ అలాంటి బీఫ్ ఫెస్టివల్స్‌ను విశ్వవిద్యాలయాల్లో పెట్టడం సముచితం కాదు. ఈ సంప్రదాయం అనేకచోట్లకు పాకి, ఘర్షణలకు దారితీయ వచ్చు. ప్రభుత్వం అనుమతి నిరాకరించాలి. పండుగల్లో వేడుకల్లో, ఇంటివద్ద ఎవరి పద్ధతుల ప్రకారం వారు బీఫ్ పండుగను నిర్వహించుకోవచ్చు. కొందరి మనోభావా లను దెబ్బతీసేవిధంగా విశ్వవిద్యాలయాల్లో నిర్వహించ డం ఎంతమాత్రం తగదు. ఆదిలోనే దీన్ని నిరోధించాలి. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేవారు సైతం పునరాలోచించాలి. వివాదాస్పదం చేయకుండా చూడాలని విజ్ఞప్తి. భిన్న కులాలు, భిన్న సంస్కృతుల నిలయం అయన విశ్వవిద్యా లయం ఒకరి మనోభావం దెబ్బతినే విధంగా కయ్యాన్ని రెచ్చగొట్టే విధంగా చేసేవారిని కఠినంగా శిక్షించాల్సి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం పేరుతో ఇతరుకు కష్టం కలిగించడం తగదు.
- ఎ.ఆర్.ఆర్.ఆర్., ఖమ్మం
ధర్నాల అలవాటు మానుకోవాలి
రాష్ట్రంలో అంగన్‌వాడీలకు, వీఆర్‌ఏలకు ధర్నాలు చేయడం, ఒక అలవాటుగా మారిపోయంది. సమయం వచ్చినప్పుడు వీరి వేతనాలను, ప్రభుత్వం పెంచుతుంది. రాష్ట్రంలోని మహిళా నిరుద్యోగులు నోటిఫికేషన్లు లేక అల్లాడిపోతున్నారు. అంగన్‌వాడీలు, వీఆర్‌ఎలకు ఒక ఉద్యోగం అంటూ ఉంది. మహిళా నిరుద్యోగులకు ఏ ఉ ద్యోగం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, వేతనాల కోసం అంగన్‌వాడీలు, వీఆర్‌ఏలు ధర్నాలు చేయడం మంచిది కాదు. ఇలాగే ధర్నాలు చేస్తే, ప్రభుత్వానికి కోపం వచ్చి మహిళా నిరుద్యోగులకు అంగన్‌వాడీ పోస్టులు ఇస్తారు. పాతవారిని తొలగించే వీలుంది.
- జి. సుమత, గజరాంపల్లి, అనంతపురం జిల్లా
డి.ఎ. మంజూరుకు ఎందుకు జాప్యం?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 డిశంబరు నాటి ప్రభుత్వ ఉద్యోగుల (ఉపాధ్యాయ పింఛనుదార్లతో సహా)కు రెండు విడతల డీఏ వాయదాలు మంజూరు చేయవలసి ఉన్నది. డీఏ బకాయలు ఇవ్వకపోవడం వల్ల వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి. వెంటనే రెండు విడతల డీఏ బకాయలను విడుదల చేయాలి. డీఏ విడుదలకు ఏడాదికాలం ఎందుకు పట్టిందో అర్థం కావడం లేదు. రాష్ట్ర విభజన కారణమా? లేక ఆర్థిక దుస్థితి కారణమా? పోనీ రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేదను కుంటే ప్రభుత్వ అనవసర వ్యయం ఆగిపోలేదు. అనవ సర ఖర్చులు అదుపులేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది ప్రజల సొమ్ము. అనవసర వ్యయాలు కొన్ని చూడండి..
1. ముఖ్యమంత్రి ప్రతిరోజు నిద్ర లేవగానే కృష్ణానదిని చూసి పావనం కావడానికి విజయవాడ దగ్గర లింగమనేని ఎస్టేట్స్ (లేక్‌వ్యూ గెస్ట్ హవుజ్)కు మరమ్మతు ఖర్చు రూ. 60 కోట్లు.
2. ముఖ్యమంత్రిగారి సింగపూర్ ప్రయాణ ఖర్చులు కోట్లలోనే ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
3. అమరావతి శంకుస్థాపన ఖర్చు రూ. 400 కోట్లు.
4. ప్రతి రోజూ ఢిల్లీ టూరు ఖర్చు.. కోట్లలో..
ఈ ఖర్చు ప్రభావం ఉద్యోగుల డీఏ మీద పడింది. దీని మంజూరుకు డబ్బులు లేవు. ఈ మధ్య ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆదాయంలో ఉద్యోగుల జీతాల ఖర్చు 23 శాతం అని. కాని ఖర్చులో ఆయనగారి జీతం కూడ కనిపిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు, రాయతీ భోజనం, భత్యాలు, ఉచిత వసతి ఖర్చు, ఫోన్ బిల్లులు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చులో కలిసి ఉన్నది. కాబట్టి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ జీతం అవసరమా? వీరి వద్ద కోట్లు మూలుగుతున్నాయ. అందువల్ల వీరు తమ జీతాలను త్యాగం చెయ్యాలి. ప్రభుత్వ ఖర్చును మిగల్చాలి. పదవీ విరమణ చేసిన వారికి డీఏ ఇప్పిం చండి.
- డి. దశరథయ్య, కొత్తగూడెం
‘సాక్షరభారతి’ నిధుల దుర్వినియోగం
గ్రామాల్లో సాక్షర భారతి నిధులు దుర్వినియోగం అవు తున్నాయ. కాగితాల్లో పథకం అమలును చూపి నిధులు మింగుతున్నారు. వలంటీర్లు చదువు చెప్పకుండా జీతాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయ. ప్రభుత్వం తక్షణమే స్పందించి పథకం అమలు తీరుపై విచారణ జరపాలి.
-నవనీత రాజ్, మద్నూర్, నిజామాబాద్ జిల్లా