ఉత్తరాయణం

‘ఋ’ని మరచిపోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల 21 నాటి సాహితిలో మృత్యుపత్రం మీద కవిత బాగుంది. బతుకు చేజారి బజారు పాలైన రైతు జీవితం గురించి చక్కగా చెప్పారు రచయత మల్లారెడ్డి గారు. అ యతే రుతువు వెళ్లిపోయాక రాలిన బంతిపూలు అన్న ప్పుడు ‘ఋతువు’ అని రాసుంటే బాగుండేది. ఈమధ్యన చాలామంది రచయతలు, పత్రికలవారు, టీవీ వారు కూడా ‘ఋ’ అక్షరాన్ని వాడటం లేదు. శబ్ద రత్నాకరం పరిశీలిస్తే ‘ఋ’తో వచ్చే పదాలు 28 ఉన్నాయ. అందులో మనం మామూలుగా వాడే పదాలు తొమ్మిది. అవి ఋక్కు, ఋతువు, ఋణము, ఋతము, ఋతుమతి, ఋతువు, ఋత్విజుడు, ఋషభము (వృషభము అని కూడా రాయవచ్చు), ఋషి. అందరూ ఈ పదాలను ఋతోనే వాడడం మంచిది. భాష పరిపుష్టం కావాలను కున్నప్పుడు అన్ని అక్షరాలను వాడటమే శరణ్యం.
ఇంగ్లీషు రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వుంటాం. వ్యాకరణ సూత్రాలను పాటిస్తాం. కానీ తెలుగు వరకు వచ్చేసరికి ఎలా రాసినా ఫరవాలేదు అనే ధోరణి కనిపిస్తోంది. ఈ ధోరణి భాషా వికాసానికి గొడ్డలిపెట్టు వంటిది. అందుచేత యటు రచయతలను, అటు పత్రికలవారిని, టీవీ వారిని తప్పనిసరిగా ‘ఋ’ అక్షరాన్ని వాడాలని కోరుతున్నాను. చివరగా, కకార అకారములు కా అన్నట్టుగా, కకార అరుకారములు కృ అని చెప్పాలి కదా. మరి ‘ఋ’ని తీసెయ్యలేం కదా!
- జి.వి. నరసింహమూర్తి, హైదరాబాదు
(సెల్: 9704867867)
చరిత్రను తిరగరాయాలి
దేశ చరిత్రను తిరగరాయాలంటూ ఈనెల 22న ముది గొండ శివప్రసాద్ గారు ఆవేదనతో రాసిన వ్యాసంలో సంగతలు మనసును కదిలించి వేశాయ. చరిత్రకారుల గ్రంథాలు అచ్చయ బయటకు వచ్చేదాకా వారేం రాసారో తెలియదు. మరి వారికి సరైన ఆధారాలు దొరకలేదా? లేక వీరు కూడా ప్రలోభాలకు లొంగి చరిత్రను వక్రీకరించి రాసారా? ఎమయనా ప్రస్తుతమున్న చరిత్ర పాఠాలు జనాల్లో వేళ్లూనుకొని పోయాయ. వీటిని మార్చడం అసంభవమైనా శివప్రసాద్ గారు, భూమి సంపాదకులైన ఎంవిఆర్ శాస్ర్తిగారు వంటి చరిత్ర పరిశోధకులు నడుం బిగించి యత్నిస్తే మార్పు అసంభవమూ కాదు. వీరు రాసి నవి అన్ని భారతీయ భాషలలోకి అనువాదం జరగాలి.
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్

హెల్మెట్ ధారణ ఐచ్ఛికం చేయాలి
గతంలోనే కొంతమంది మేధావులు హెల్మెట్ ధారణను నిర్బంధం చేయవద్దు, ఐచ్ఛికం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చారు. కారణం హెల్మెట్ వుంటే తల, ముఖం మీద దెబ్బలు తగలకుండా ప్రాణం పోకుండా కాపాడుతుంది. కానీ హెల్మెట్ ధారణ వల్ల మెడలు నెప్పులు పుట్టడం, అటూ, ఇటూ తల తిప్పాలన్నా ఇబ్బందికరంగా ఉండటం సర్వసాధారణం. అందరినీ ఇబ్బందులకు గురిచేసే హెల్మెట్ ధారణను ఐచ్ఛికం చేస్తే బాగుంటుంది.అదీకాకుండా హెల్మెట్లు బరువు ఎక్కువ. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్మెట్ నిబంధనను సడలించాలి.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ
పార్లమెంట్‌ను సాగనివ్వని కాంగ్రెస్
అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచి కూల్చివేసేందుకు గవర్నర్‌ను భాజపా ఉపయోగించుకుంటున్నదని గవర్న ర్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించేటట్టు చూడాలని రాహుల్, సోనియాలు రాష్టప్రతిని కోరడం విచిత్రం. ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నది కాంగ్రెస్ కాదా? ఒక కీలుబొమ్మను కుర్చీలో కూర్చోబెట్టి ప్రధాని అధికారాలన్నింటిని తెరవెనుకనుంచి చెలాయంచింది సోనియా కాదూ? ఇది దయ్యాలు వేదాలు వల్లించి నట్లుం ది. నిజానికి పార్లమెంట్‌ను సజావుగా సాగేటట్లు చూడమని రాష్టప్రతే సోనియాకు సలహా ఇవ్వాలి.
- మరుదకాశి, కరప, తూ.గో. జిల్లా
కాంగ్రెస్ కుచ్ఛిత రాజకీయాలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోంది. 2012లో వేసిన కేసు అప్పటినుంచి వాయదాలు పడుతూ వచ్చింది. మరి కేసు వేసినప్పుడు భాజపా అధికారంలో లేదు కదా. మరి మోదీ కుట్రపూరితంగా తమను వేధిస్తున్నారనడం కాంగ్రెస్‌కు ఎంతవరకు సబబు? వాస్తవాన్ని విస్మరించరాదు.
- వేదుల జనార్ధన రావు, వంకావారి గూడెం
సెటప్ బాక్సుల ధరలపై అదుపు ఉండాలి
సెటప్ బాక్సులను పెట్టుకోమని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వమే. తొలుత ఆపరేటర్లు దీన్ని వ్యతిరేకించినా, తర్వాత అంగీకరించి వినియోగదారులకు నాసిరకం బాక్స్‌లు అంటగడుతున్నారు. అందువుల్ల బాక్స్ నాణ్యత, ధరమీద ప్రభుత్వం అదుపు ఉండాలి.
- లక్ష్మీ ప్రసన్న, పేర్రాజుపేట