ఉత్తరాయణం

వారి కంఠస్వరం మనోహరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనాడు తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, జీడిగుంట రామచంద్ర, పన్యాల రంగనాథంగార్లు ఆకాశవాణి ద్వారా వార్తలను చదువుతుంటే శ్రోతలకు వీనులవిందుగా ఉండేది. వీరి కంఠం మృదు మధురంగా ఉండేది. కాని ఈనాడు వార్తలు చదువుతుంటే అపశ్రుతులు, కొన్ని అక్షరాలు పలుకక పోవడం అర్ధరహితముగా ఉండటం ఎంతో విచారకరం!
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
చారిత్రక కట్టడాన్ని కాపాడాలి
స్థానిక లక్‌డీకాపూల్ వద్దగల, టిపుఖాన్‌చే నిర్మించబడినట్లు చెప్పబడుతున్న ‘ఔట్‌లుక్’ అదృశ్యమై కేవలం చరిత్ర పుటలకే పరిమితం అవుతుందా. ఈ ప్రదేశం ప్రక్క ఆకర్షణగల శిలాసమూహం కూడా వుంది. శబాబ్దం చరిత్ర కలిగిన ఈ సుందర, చారిత్రక ప్రాధాన్యతా ప్రదేశాన్ని కాపాడాలి. దానిని పడగొట్టే ప్రయత్నం ఏ కారణాలవల్లనయినా చేయరాదు. గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఇటువంటి కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పూనుకోవాలి.
- ప్రొఫెసర్ కే.నాగరాజరావు, హైదరాబాద్
రెండో అసెస్‌మెంట్ నెంబరుతో తిప్పలు
గ్రేటర్ హైదరాబాద్‌లో ఒకే ఇంటి నెంబరు గల ఆస్తికి రెండో అసెస్‌మెంట్ నెంబరు ఇచ్చి పన్ను కట్టమంటూ నోటీసులు ఇస్తున్నారు. ఒక అసెస్‌మెంట్‌కు పన్ను చెల్లిస్తున్న గృహ యజమానులకు ఈ రెండో నెంబరు ఎలా వచ్చిందో తెలియదు. ఈ విషయమై అధికారులకు వినతిపత్రం సమర్పించగా, తగిన చర్యలు తీసుకొని రెండో నెంబరును రికార్డులనుంచి తొలగిస్తామని నోటి మాటగా చెబుతున్నారు. నోటిమాటగా చెబితే ఫలితం ఉండదు కదా. దాన్ని ఆచరణలో చూపాలి. కానీ ఆచరణ లో మాత్రం అధికార్లు శ్రద్ధ చూపడం లేదు సరికదా రెండో అసెస్‌మెంటు నెంబరుకు పన్ను కట్టమంటూ నోటీసులు యధాప్రకారం జారీ చేస్తున్నారు. ఇది అన్యాయమని మొరపెట్టుకున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది గృ హ యజమానులకు మానసిక క్షోభను కలిగిస్తున్నది. పెద్ద సమస్యలను పరిష్కరించే మున్సిపల్ శాఖా మాత్యులు కెటిఆర్ ఈ సమస్యపై అధికార్లకు తగిన ఆదేశాలు జారీ చెయ్యాలని మనవి.
-ఎస్.వి. రామారావు, హైదరాబాద్
పిల్లలపై ఒత్తిడి తేవద్దు
పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ విలువైన సమయాన్ని విద్యార్థులు దుర్వినియోగపరచుకోకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతో వుంది. ముఖ్యంగా తాము రోజూ చూసే డైలీ సీరియల్స్‌ను త్యా గంచేస్తూ టీ.వి కనెక్షన్లు తీసివెయ్యాలి. టి-20 ప్రపంచ కప్ విద్యార్థుల బలహీనతలను సొమ్ముచేసుకొని, వారి విలువైన సమయాన్ని హరించే ముప్పు పొంచి ఉన్నందున పిల్లలను క్రికెట్‌కు దూరంగా ఉంచాలి. మొబైల్స్, కంప్యూటర్ల జోలికి పోనివ్వవద్దు. మండు వేసవి ముందస్తుగా వచ్చినందున బయటకు వెళ్ళనివ్వద్దు. చలువ చేసే పళ్ళు, పళ్ళ రసాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగ వంటివి వడదెబ్బ బారినుంచి రక్షించడానికి అందివ్వాలి. పరీక్షల్లో ఎక్కువ మార్కులకై ఒత్తిడి చేయక స్వేచ్ఛగా చదువుకోనివ్వాలి.
- సిరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
కాలుష్య నగరం విశాఖ
ఇటీవల నేషనల్ సెంటర్ ఫర్ పొల్యూషన్ స్టడీస్ వారు విడుదల చేసిన వార్షిక నివేదికలో దేశంలో అత్యంత వేగంగా కాలుష్యం పెరుగుతున్న నగరాలలో విశాఖను చేర్చారు. స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేముందు ఈ కాలుష్యానికి పరిష్కారం కనిపెట్టాలని పర్యావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ కాలుష్యానికి ముఖ్య కారణం పోర్టునుండి రవాణా అవుతున్న రసాయనాలు, ముడిసరుకులు. పోర్టు సమీపంలోని 1వ టౌన్, జ్ఞానపురం, చావులమదం, ప్రసాద్‌గార్డెన్స్ తదితర ప్రాంతాల ప్రజలు కాలుష్య కారణంగా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇరన్‌ఓర్, యూరియా, ఇనుము, బొగ్గు, అమ్మోనియానైట్రేట్ వగైరా రసాయనాలను గాలి ద్వారా పీల్చడంవలన శ్వాసకోశ, మూత్ర పిండాల వ్యాధులతో పాటు కేన్సర్ కూడా సంక్రమించే ప్రమాదం వుంది. ఇళ్ళలో వుండే వంట సామగ్రి, ఆహార పదార్థాలు కూడా కాలుష్యం బారిన పడుతున్నా యి. ఇ.ఎఫ్.ఆర్. సమయంలో కాలుష్యం లేకుండా వుండేందుకు తీవ్ర యత్నాలు చేసిన యాజమాన్యం, మర్నాటినుండి షరామామూలే అన్నట్లు ప్రవర్తిస్తోంది.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
కొత్త చెట్లను పెంచాలి
రోడ్ల విస్తరణలో భాగంగా రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో చెట్లు కొట్టివేశారు. తిరిగిఆ చెట్లను నాటితే పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి చల్లదనానికి చాలా ఉపయోగం. ప్రజల ఆరోగ్యానికి అనేక విధాల ఉపయోగపడే ఆక్సిజన్‌ను వదులుతాయి. మరియు ఫ్యాక్టరీలు వదిలే కాలుష్యాన్ని ఇతర పర్యావరణ కాలుష్యాల్ని కూడ తొలగిస్తాయి.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ