రాష్ట్రీయం

రాజధానికి ఎల్‌ఇడి వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.500 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు
రెండువేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు మార్చి నుంచే ఉత్పత్తి ప్రారంభం ముందుకొచ్చిన యుఎస్ కంపెనీ 50 ఎకరాలు ఇచ్చేందుకు కెసిఆర్ ఓకే

హైదరాబాద్, నవంబర్ 30: హైదరాబాద్ నగరంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఎల్‌ఇడి విద్యుద్దీపాల తయారీ పరిశ్రమ స్థాపనకు అమెరికాకు చెందిన ప్రముఖ అడ్వాన్స్‌డ్ ఆప్ట్రానిక్ డివైసెస్ ఇంటర్నేషనల్ కంపెనీ ముందుకొచ్చింది. పరిశ్రమ స్థాపనకు అవసరమయ్యే భూమి కేటాయించడంతోపాటు ఇతర వౌలిక సదుపాయాలు వీలైనంత త్వరగా సమకూర్చుతామని సిఎం కె చంద్రశేఖర్‌రావు హామీఇచ్చారు. ప్రభుత్వ సహకారం ఉంటే వచ్చే మార్చినాటికల్లా తమ ఉత్పత్తులను ప్రారంభించి ప్రత్యేక్షంగా 2 వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి హామీఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం అడ్వాన్స్‌డ్ ఆప్ట్రానిక్ డివైసెస్ ఇంటర్నేషనల్‌తో (ఎఒడి) కలిసి భారత్‌కు చెందిన సిస్కా మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధులు సిఎం కెసిఆర్‌ను కలిశారు. ఎల్‌ఇడి దీపాల తయారీ యూనిట్ స్థాపనకు రూ.500 కోట్ల పెట్టుబడితో పాటు 50 ఎకరాల భూమి అవసరం అవుతుందని వివరించారు. పరిశ్రమ స్థాపనకు సరిపడా స్థలాన్ని వెంటనే సమకూరిస్తే వచ్చే మార్చికల్లా ఉత్పత్తి ప్రారంభించి 2 వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించగలమన్న ప్రతిపాదనను సిఎంకు అందించారు. సిఎం కెసిఆర్ స్పందిస్తూ 50 ఎకరాల భూమిసహా ఇతర వౌలిక సదుపాయాలు అతి తక్కువ వ్యవధిలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు. తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుగునిచ్చే ఎల్‌ఇడి దీపాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. ఎల్‌ఇడి దీపాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తే వీటికి డిమాండ్ పెరుగుతుందని సిఎం అన్నారు.
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ప్రవేశపెట్టిన టిఎస్‌ఐపాస్ విధానం సత్ఫలితాలు ఇస్తుందని, ఇప్పటికే 69 పరిశ్రమలకు అనుమతులను ఇచ్చామని సిఎం వెల్లడించారు. అవినీతికి ఆస్కారం లేకుండా ‘బిజినెస్ ఎట్ ఈజ్’ అనే పద్ధతిలో తెలంగాణ పారిశ్రామిక విధానం ఉందన్నారు. కంపెనీ ప్రతినిధులతోపాటు సిఎం అదనపు కార్యదర్శి శాంతకుమారి, టిఎస్‌ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశమైన ఎల్‌ఇడి కంపెనీ ప్రతినిధులు.