క్రీడాభూమి

అమీర్‌కు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, డిసెంబర్ 29: స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో నిషేధానికి గురయిన ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ అమీర్‌కు జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కల్పించడానికి వ్యతిరేకంగా దాఖలయిన ఒక పిటిషన్‌ను పాక్ హైకోర్టు మంగళవారం కొట్టివేయడంతో అయిదేళ్ల నిషేధం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి రావడానికి అమీర్‌కున్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయినట్లయింది. 2010లో ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా నోబాల్స్ వేసేలా ఏజంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణల కింద నిషేధానికి గురయిన ముగ్గురు పాక్ ఆటగాళ్లలో అమీర్ ఒకడు. మిగతా ఇద్దరు అప్పటి పాక్ టెస్ట్ జట్టు కెప్టెన్ సల్మాన్‌బట్, బౌలర్ మహమ్మద్ ఆసిఫ్, ఈ ముగ్గురూ మ్రిటన్‌లో ఆరునెలలు జైలుశిక్ష కూడా అనుభవించారు. అయితే నిషేధం పూర్తయిన తర్వాత ఈ ముగ్గురూ తిరిగి జాతీయ క్రికెట్ జట్టులోకి రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమీర్‌ను తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవడంపై స్టే విధించాలంటూ ఒక లాయరు లాహోర్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే న్యాయమూర్తి షాహిద్ బిలాల్ హసన్ ఈ పిటిషన్‌ను తోసిపుచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లీగల్ అడ్వైజర్ తఫాజుల్ రిజ్వీ చెప్పారు. పిసిబి తరఫున తాను వాదించానని అమీర్ తన నిషేధాన్ని పూర్తి చేసుకున్నాడని, దేశ రాజ్యాంగం ప్రకారం దేశం తరఫున క్రికెట్ ఆడడానికి అతనికి అన్ని విధాలా హక్కు ఉందనేది మా అభిప్రాయం అని రిజ్వీ చెప్పాడు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి మున్సిఫ్ అవాన్ అనే లాయరు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేశారని ఆయన తెలిపాడు. కాగా, వచ్చే నెల ప్రారంభం కానున్న న్యూజిలాండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేయడం కోసం ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్ క్యాంప్‌లో పిసిబి అమీర్‌కు కూడా స్థానం కల్పించింది. మూడు వన్‌డే మ్యాచ్‌లు, మరో మూడు టి-20 మ్యాచ్‌లకోసం జట్టును పిసిబి ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనుంది.