సంజీవని

కాలేయాన్ని కాపాడుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీర్ణక్రియలో పిండి పదార్థాన్ని సగం వరకు గ్లైకోజిన్‌గా మార్చుకుని తనలో నిల్వ వుంచుకుంటుంది కాలేయము. మేగోయాసిడ్స్ మాంసకృతుల వినియోగంలో పనిచేసి మిగిలినవాటిని యూరియాగా బయటకు పంపేస్తుంది. లంఖణాలు చేసినపుడు ఈ నిలువల్లోనుంచి శక్తిని విడుదల చేస్తుంది. లిపిడ్ వ్యవస్థను క్రమపరుస్తుంది. బిలురుబిన్, బైల్ లవణాలను క్రమపరుస్తుంది. విటమిన్ ఎ, డి, బి12, కె, ఫాలిక్ యాసిడ్లను తనలో నిల్వ వుంచుకుంటుంది. రాగి, ఇనుము మొదలైన లోహాలను నిల్వ వుంచుకుంటుంది. దీనిలోని ఫాగోసైట్స్ శరీర రక్షణ వ్యవస్థని కాపాడతాయి. శరీర ఉష్ణోగ్రతని, శరీరంలో నీటి సమతుల్యతని, గుండె పనితీరుని, రక్తపోటు, రక్తంలోని చక్కెర నిల్వలను, రక్తం గడ్డకట్టే ఫాక్టర్స్‌ని కాలేయం సరిచూసుకుంటుంటుంది. ఇవి కాలేయం చేసే పనులు కొన్ని మాత్రమే.
ఇక కాలేయ వ్యాధులను చూస్తే, పిండి పదార్థాల జీర్ణక్రియ లోపం, ఎమినోయాసిడ్, ఎమీనియాల నిర్వహణాలోపం, శరీరంలోని విషపదార్థాల బహిష్కరణ, హార్మోన్ల తయారీ సమర్థతలో లోపంవల్ల కాలేయంలో వాపు రావచ్చు. కాలేయంలో కొవ్వు చేరవచ్చు. కాలేయం గడ్డిపడవచ్చు. కాలేయం చిన్నదికావచ్చు. కాలేయంలో గడ్డలు రావచ్చు.
నిర్వహణ లోపాలు
పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, ఖనిజ లవణాలు మొదలైనవాటిని సరిగ్గా నిల్వ ఉంచుకోలేకపోవడంవల్ల మధుమేహం అనే జీర్ణక్రియాలోపంచే కలుగుతుంది. మానోసైట్స్, ఫాగోసైట్స్‌లాంటి జీవకణాల లోపంవల్ల రక్షణ వ్యవస్థ సరిగ్గా వుండదు. బిలురుబిన్, బైల్ సాల్ట్స్ ప్రభావం జీర్ణక్రియమీద పడుతుంది. లివర్ పనితీరు పరీక్షలు, లివర్ బయాప్సిలాంటి పరీక్షలతో రోగ నిర్థారణ చేస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులా? లేక శస్తచ్రికిత్సా అనేది నిర్థారిస్తారు. కాలేయం చాలా పనులు చేస్తుంది కాబట్టి అది దెబ్బతినకుండా చూసుకోవాలి. అనారోగ్యాన్ని బట్టి అవసరమైతే కాలేయంలో కొంత భాగాన్ని తీసివేసినా కాలేయానికి పునరుత్పత్తి గుణం వుంది కాబట్టి రెండు మూడు నెలల్లో మామూలు పరిమాణానికి వస్తుంది. కాలేయం పూర్తిగా చెడిపోతే కాలేయ మార్పిడి ఇపుడు అందుబాటులో వుంది.

డా.రావుల ఫణికృష్ణ సర్జికల్ గాస్ట్రో ఎంటెరాలజిస్ట్ అండ్ ఒబెసిటీ సర్జన్ 9701025111