తెలంగాణ

అట్టడుగు వర్గాలకు రూ.800 కోట్ల రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జగదీష్ రెడ్డి శాసనమండలిలో శనివారం చెప్పారు. తెరాస సభ్యుడు పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు సబ్సిడీపై ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.800 కోట్లు రుణాలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ పరంగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు ఇస్తున్న రుణాలలో సబ్సీడీని 50 శాతం నుండి 80 శాతం వరకు పెంచామన్నారు. షెడ్యూల్డు కులాలకు సంబంధించి ఇప్పటి వరకు 34,663 మంది లబ్దిదారులకు గాను 23,762 మందికి రూ.236.88 కోట్ల సబ్సిడీని 23,762 మందికి మంజూరు చేశామన్నారు.
రూ.32 కోట్లతో సీడ్‌ఫార్మ్స్ అభివృద్ధి : పోచారం
తెలంగాణ రాష్ట్రంలో 2016-17 సంవత్సరానికి గాను ధృవీకరించిన వివిధ పంటలకు సంబంధించిన వితనాన్ని 8 లక్షల క్వింటాళ్లు ఉత్పత్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ యోచిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల సీడ్ ఫామ్స్, గోడౌన్‌లను రూ.32కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తామని ఆయన శాసన మండలిలో వెల్లడించారు.