లోకాభిరామం

అదొక సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషలో విషయం ఉంటే చాలదు. దానికొక గమ్యం కూడా ఉండాలి - రెనీ డౌమాల్
* * *
ఎందుకయ్యా దండగా, అనవసరంగా టైం వేస్ట్. నేను కూడా నేర్చుకున్నాను. ఒక జ్ఞాపకం లేదు. ఎందుకూ పనికి రాలేదు, అన్నారు గురువుగారు రామచంద్రరావు గారు. హాస్టల్లో ఉంటాము. ఉదయం లేచింది మొదలు ల్యాబ్‌కు వెళ్లేదాకా పని ఏమీ ఉండదు. కనీసం అందుకు ఏదో ఒక పని పెట్టుకోవాలి. కానీ ఆ భాష నేర్చుకోవడం నా విషయంలో అట్లా జరగలేదు. నాకు మొదటి నుండి భాషల మీద ఎంతో ప్రేమ. ఉర్దూ నేర్చుకున్న విశేషాలు చాలాసార్లు చెప్పాను. కన్నడ, తమిళంతో కూడా పరిజయాలు పెంచుకున్నాను. ఇక ఈ జెర్మన్ మాత్రం పద్ధతిగా విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నాను.
ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర దాక క్లాసులు ఉండేవి. కనుక కొంచెం ముందు తయారైతే హాయిగా వెళ్లిపోవచ్చు. నిజానికి కోర్స్ మొదలైనప్పుడు క్లాసులో కూడా చాలామంది ఉన్నారు. రానురాను చాలామంది జారిపోయారు. పది మంది బహుశా మిగిలారేమో. అయినా ఒక కొత్త భాష నేర్చుకోవడం చాలా ఆసక్తికరంగా ఉండేది. డిపార్ట్‌మెంట్‌లో ఒకే ఒక ఉపాధ్యాయుడు. ఆయన డాక్టర్ సత్యనారాయణ గారు. చాలా మంచి మనిషి. అంత భారీ విగ్రహం కూడా ఆత్మీయంగా ఉండేవారు. చదువు చెప్పడంలో కూడా ఎంతో మెత్తదనం కనిపించింది.
ఒక సంవత్సరం గడిచింది. సీనియర్ డిప్లొమా అన్నారు. బాగానే ఉంది అనుకుని అందులో కూడా ముందుకు సాగాను. జర్మన్ మాట పద్ధతి నేర్చుకోవడానికి అక్కడ మంచి ఫిల్ములు చూపించేవారు. అట్లాగే కొన్ని క్యాసెట్లు వినిపించేవారు. మొత్తానికి కొత్త భాష తలకెక్కింది. కలలో కూడా ఆ మాటలు రావడం మొదలైంది. ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే అక్కడక్కడ కొత్త భాషలో మాటలు అడ్డు రావడం మొదలైంది. పదజాలం బాగా నేర్చుకున్నాను. ప్రయత్నం కూడా బాగా నేర్చుకున్నాను. క్లాసులో అందరి కంటే ముందు ఉన్నారు అని చెప్పుకుంటే గొప్ప ఏమీ కాదు. సీనియర్ డిప్లొమా కూడా మంచి మార్కులతో పాసయ్యాను. ఇంతకు ఈ భాష నేర్చుకుని ఏం చేయాలి, అన్నది ప్రశ్న. నిజానికి పిహెచ్.డి. తరువాత జర్మనీ వెళ్లడానికి అవకాశం వచ్చింది. ధర్మపాల్ అగర్వాల్ అనే ఒక పరిశోధకుడు బ్రేమెన్ మా రంగంలోనే మంచి కృషి చేస్తున్నాడు. ఆయన ఒకసారి యూనివర్సిటీలో మా ల్యాబ్‌కు వచ్చాడు. నీవు వస్తానంటే అవకాశం ఇస్తాను అన్నాడు. ఆ కాలంలో బ్యాంకుల వాళ్లు అప్పులు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. ఇంట్లో నన్ను విదేశాలకు పంపించిన వెసులుబాటు లేదు. నిజానికి అమెరికా, హాలెండ్ వెళ్లడానికి కూడా అవకాశాలు వచ్చాయి. అది వేరే విషయం. రెండు సంవత్సరాలు చదువుకునేందుకు జర్మన్ భాష మీద, ఆ దేశపు చరిత్ర, సంస్కృతి మీద వింతగా అభిమానం పెరిగింది. అప్పట్లో హైదరాబాద్‌లో మాక్స్ ముల్లర్ భవన్ అని పశ్చిమ జర్మనీ వారి సాంస్కృతిక సంస్థ ఒకటి ఉండేది. అక్కడికి వెళ్లడం అలవాటయింది. అక్కడ పుస్తకాలు తెచ్చుకుని చదవడం కూడా అలవాటైంది. మొత్తానికి జర్మన్ అంటే అదేదో మరది అన్న భావం మొదలైంది.
సీనియర్ డిప్లొమా పరీక్ష నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉంది. రాత పరీక్ష బాగా రాశాను. కానీ ఒక మాట ఈ పరీక్ష అంటుంది. పరీక్షకుడిగా మాక్స్ ముల్లర్ భవన్ ఉపాధ్యాయుడు రాజన్‌గారు వచ్చారు. ఆయనకు నా గురించి తెలుసు. కానీ ఎందుకో ఆ రోజు నాకే నా గురించి తెలియలేదు. జర్మన్ భాషలో టైం ఎలా అడుగుతారు చెప్పు అని ఆయన అడిగారు. నాకు తెలియక కాదు గానీ ఆ రోజు మాత్రం ఎందుకో గుర్తుకు రాలేదు. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నారు. మరేమో కొన్ని ప్రశ్నలు అడిగి మంచి మార్కులే ఇచ్చినట్టు ఉన్నారు. మంచి మార్కులతో పాసయ్యాను.
ఇక తరువాత అడ్వాన్స్డ్ డిప్లొమా అని ఒకటి ఉంటుంది. అది గ్రాడ్యుయేషన్‌తో సమానం అంటారు. అందులోకి ఐదుగురు ప్రవేశించాం. శారదామణి అని ఇంగ్లీష్ ఎం.ఏ. చదువుకున్న ఒక అమ్మాయి. విశాఖలో నాలాగే పరిశోధన చేస్తున్నారు. రాధా అనే ఇంకొక చిన్న అమ్మాయి. చంద్రశేఖర్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అయిదవ వాడిని నేను. సత్యనారాయణ గారికి ఒక వింత ఆలోచన వచ్చింది. మూడవ సంవత్సరం కూడా తామే చదువు చెబితే అంత బాగుండదు అనుకున్నట్లు ఉన్నారు. ఏకంగా మాక్స్ ముల్లర్ భవన్ డైరెక్టర్ అయిన జర్మన్ పండితుడిని మాకు పాఠం చెప్పమని పిలిచారు. ఆయన నూటికి నూరుపాళ్లూ జర్మనీ వాడు. పేరు పీటర్ సేవిట్జ్. ఆయన ఎక్కడో బంజారాహిల్స్‌లో కాపురం ఉండేవాడు. పొద్దున ఎనిమిదికల్లా మా కోసం ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. క్లాసు అవ్వగానే ఇంటికి వెళ్లాలి. మళ్లీ మధ్యాహ్నం రామ్‌కోట్‌లో ఉన్న తమ సంస్థకు రావాలి. నిజానికి ఎవరికైనా ఇది కొంచెం చికాకు. కనుక మేము ఒక కొత్త పద్ధతిని ప్రతిపాదించాము. ఐదుగురు విద్యార్థులు క్లాస్ సమయానికి మాక్స్ ముల్లర్ భవన్‌కు వెళ్లిపోతాము. గురువుగారు అక్కడికి వస్తారు. క్లాస్ అయిన తర్వాత సాయంత్రం దాకా అక్కడే ఉండిపోతారు. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు ఆయన చేసుకోవాలి. ఈ పద్ధతి అందరికీ నచ్చింది. కనుక ఏ అనుభవం లేకుండా అమలులోకి వచ్చింది.
అప్పటికి నేను హాస్టల్‌లో లను. నల్లకుంటలో ఇల్లు తీసుకుని వంట చేసుకుని పరిశోధనలకు యూనివర్సిటీకి వెళుతున్నాను. కొంచెం ముందుగా లేచి వంట చేసుకుని డబ్బాలో పెట్టుకుని క్లాస్‌లో వెళ్లడం, అది అయిన తరువాత యూనివర్సిటీకి వెళ్లడం. కొత్త పద్ధతి మొదలైంది. కొంతకాలం మరొక చిన్న ప్రయోగం కూడా చేశాను. కాచిగూడ చౌరస్తాలో వైశ్య హాస్టల్ ఉంటుంది. అందులో ఉండేవాళ్లు ఎక్కడెక్కడో ఉండే కాలేజీలకు వెళతారు. కనుక అక్కడ పొద్దునే్న చక్కగా భోజనం పెట్టేవారు. ఆ భోజనం బయట వాళ్లు వచ్చి తినడానికి లేదు. ఏం చేశారో తెలియదు కానీ నేను అక్కడ తినడానికి అనుమతి సంపాదించుకున్నాను. రెండు రూపాయలకే కడుపునిండా కమ్మని భోజనం పెట్టేవారు. చిక్కటి పెరుగు ప్రత్యేక ఆకర్షణ. అందుకని అయినా అడ్వాన్స్డ్ డిప్లొమా క్లాస్‌కు వెళ్లడం నచ్చింది. చదువు కూడా బాగా సాగుతుంది. సంస్థ మొత్తంలో జర్మన్ వాతావరణం ఉంటుంది కాబట్టి, చదువు నువ్వు ప్రోత్సహించడానికి ఎనె్నన్నో అవకాశాలు అక్కడ కనిపించేవి. చిన్నదైనా చక్కని లైబ్రరీ అక్కడ ఉంది. మంచి పుస్తకాలు దొరుకుతాయి. వాటిని మాకు కూడా ఇచ్చే పద్ధతి పెట్టారు. బహుశా మెంబర్‌షిప్ తీసుకున్నారేమో గుర్తులేదు. వాళ్ల దగ్గర కవితా పఠనం గ్రామఫోన్ డిస్కులు ఉండేవి. వాటిని వినడం ఒక పెద్ద హాబీగా మారిపోయింది. అలాగే వాళ్ల దగ్గర ఎక్సర్‌సైజ్‌లు వినడానికి చాలా కాసెట్లు ఉండేవి.
లాంగ్వేజ్ లెర్నింగ్ అనే ప్రత్యేకమైన ప్లేయర్ గురించి చెప్పాలి. అది జర్మనీలో తయారైన చక్కని పెద్ద యంత్రం. అందులో కాసేపు పెట్టాలి. దాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ఉంటారు. తలకు హెడ్‌ఫోన్స్ పెట్టుకోవాలి. వింటూ ఉంటే చెవిలో ప్రశ్నలు వినపడతాయి. వాటిని ఎప్పటికప్పుడు జవాబులు చెప్పాలి. అవి క్యాసెట్లో రికార్డు అవుతాయి. మొత్తం పరీక్ష అయిన తర్వాత, వేసుకుని వింటే మనం జవాబులు చెప్పిన తీరు తెలుస్తుంది. అందులో ఎన్ని తప్పులు చేసింది కూడా మనమే గుర్తుంచుకోవచ్చు. అందుకు కావాల్సిన ‘కీ’ కూడా దొరుకుతుంది. గురువుగారు పీటర్‌గారు మాకు కనీసం నాకు అటువంటి టేప్‌రికార్డర్ ఒకటి ఇంటికి తీసుకు వెళ్లడానికి ఇచ్చేశారు. దానివల్ల జర్మన్ సంగతి పక్కనబెట్టి సంగీతం వినడానికి నాకు బాగా వీలు కలిగింది.
మేము వీలు దొరికినప్పుడల్లా భవన్‌కు వెళ్లిపోయేవాళ్లం. గురువుగారి స్వంత పిల్లల్లాగే ఆయనతో కలిసి ఆడుతూ ఉండేవాళ్లం. మంచి పుస్తకం పోస్టులో జర్మనీ నుంచి వచ్చింది. ఆయన పోస్ట్ అంతా చూస్తూ ఆ పుస్తకాన్ని కూడా చూచి వాళ్ల మీద పెట్టారు. దాన్ని అందుకుని ఆసక్తిగా చదవసాగాను. అందులో కొంత జర్మన్, కొంత ఇంగ్లీష్ ఉన్నట్టు ఉన్నది. నేను చదువుతున్న తీరు చూచి, ఆయన జర్మన్ భాషలో నీకు ఆ పుస్తకం కావాలా, అని అడిగారు. నేను అవును అన్నాను. తీసుకో. నీకు బహుమతిగా ఇస్తున్నాను అన్నారు గురువుగారు. పక్కనే నిలబడి ఉన్న లైబ్రేరియన్ ఖాన్‌కు అది ఏ మాత్రం నచ్చలేదు. ఆ పుస్తకం లైబ్రరీలో ఉంటే బాగుంటుందని బహుశా అతని అభిప్రాయం అయి ఉంటుంది. ఇలాగే అక్కడ మాకు ఎనె్నన్నో ప్రోత్సహకాలు దొరుకుతూ ఉండేవి. అక్కడ రకరకాల ప్రదర్శనలు పెట్టేవారు. అప్పట్లో గోవాకు సంబంధించిన గొప్ప కార్టూనిస్ట్ మారియో మిరాండా జర్మనీ వెళ్లి వచ్చాడు. అక్కడి అనుభవాలను చిత్రాలు గీశాడు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ అనే పత్రికలో కార్టూన్ల కారణంగా నేను అతనికి వీరాభిమానిని. కార్యక్రమానికి గాను ఒక అందమైన ఆహ్వాన పత్రిక వేశారు. హుజుర్ నీలం రంగు కాగితం మీద, స్క్రీన్ ప్రింటింగ్ పద్ధతిలో, తెల్లని ఇంకుతో అక్షరాలు మారియ గీసిన బొమ్మలు వేశారు. అంతకు ముందు ఒక పోస్టర్ల ప్రదర్శన జరిగింది. అందులో వాడటానికి పంపించిన పోస్టర్లను అవసరం లేదని రాయబార కార్యాలయం వారు చెప్పారట. కనుక వాటిని గురువుగారు మాకు చాలా కొన్ని ఇచ్చేశారు. అవి నా దగ్గర చాలాకాలం ఉండేది. కార్టూన్లు మాత్రం ఇవ్వలేదు. వాటిని మద్రాసులో ప్రదర్శన కోసం జాగ్రత్తగా పంపవలసి ఉంది. అయినప్పటికీ ఆ అందమైన ఆహ్వాన పత్రిక నా దగ్గర చాలా రోజులు ఉంది. దాన్ని నేను కాశ్మీర్ నుంచి వచ్చిన కలం పెట్టెలో అందంగా అలంకరించాను. బహుశా అది ఇంకా ఉందేమో ఒకసారి చూడాలి.
గురువుగారితో మా మైత్రి చాలా ముందుకు పోయింది. సంవత్సరం అయిపోతున్నది అనగా ఆయన ఒకసారి మమ్మల్ని తమ ఇంట్లో విందుకు పిలిచారు. సారాయంలో, ఏలకులు, లవంగాలు, దాల్చిని, అన్నీ వేసి మరిగించి ఇచ్చిన డ్రింక్ నాకు ఇవ్వాళ్టి వరకు గుర్తు ఉంది. బాగుంది కదా అని ఒకటి రెండు గ్లాసులు తాగినట్టు ఉన్నాము. ఇంటికి వెళ్లగలవా అని ఆయన అడగడం గుర్తుంది. హాయిగా బస్సులో ఇంటికి రావడం కూడా గుర్తుంది.
పీటర్ గారికి భారతీయ సంగీతం మీద ఎంతో ఆసక్తి ఉండేది. హిందుస్థానీ సంగీతం ఎల్‌పిలు ఎన్నో సేకరించి ఆయన వింటూ ఉండేవారు. మంచి వారి గురించి మంచి మాటలు చెప్పుకోవాలి. కానీ అప్పట్లో హైదరాబాద్ పేపర్లలో అతడిని హంతకుడిగా వర్ణించిన సందర్భం ఒకటి ఉంది. ఆయనగారి భార్య చనిపోవడం వాస్తవమే. ఆమెను పీటర్ చంపారని అభియోగం వచ్చింది. కానీ ఆయన లక్షణంగా పని చేసి, ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయి తమ దేశానికి వెళ్లిపోయారు. అంటే అభియోగం నిజం కాదనీ నేను భావిస్తున్నాను.

-కె.బి.గోపాలం