లోకాభిరామం

పల్లీల కథ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేము న్యాల శెనిగె బుడ్డలు అని పిలిచే వస్తు పదార్థాన్ని మీరేమంటారు మీకు అర్థమైందా. మేము వాటిని వేరుశెనగలు అని కూడా అంటాము. నేలలో కాస్తాయి కనుక నేల శనిగలు. వీళ్లకు కాస్తాయి కనుక వేరుశనగలు. తమిళనాడులో వాటిని వేర్ కడల్ అంటారు. మన దగ్గర కొంతమంద చెనిక్కాయలు అంటారు. హైదరాబాద్ ప్రాంతంలో పల్లీలు అంటారు. అన్ని అంటే అది ఒక్కటే కాదు. చిక్కులు కూడా పల్లీలే. వీళ్ల సంగతి పక్కనపెట్టి, పల్లీల కథ చెప్పుకుందాం.
నాకు చిన్నప్పటి నుంచి అలీలు చాలా ఇష్టం. నాకు ఒక్కడికే కాదు మా ఇంట్లో వాళ్లు అందరికీ ఇష్టం. చివరకు చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా వాటి మీద ఆధారపడేవారు అని నాకు ఒక ఆధారం దొరికింది. మా అన్నయ్య, అక్కయ్య నాకంటే బాగా పెద్దవాళ్లు, వాళ్లు చెప్పారు కనుక నాకు ఇప్పుడు నేను చెప్పబోయే సంగతి తెలిసింది. పక్కింటి మరొక అక్కయ్యతోపాటు, ముగ్గురూ కలిసి ఆటకు ఒకచోట చేరారు. వంటింటి ఆట అప్పట్లో అందరికీ అలవాటు. వంట పేరు నా వేపిన వేరుశెనగలను వాళ్లు సేకరించుకున్నారు. మావి బాగా ఆచార వ్యవహారాలు గల కుటుంబాలు కదా. మరి ఆటలో అయినా భోజనానికి ముందు దేవుడికి నైవేద్యం చేయాలి కదా. నైవేద్యం చేసేటప్పుడు పెద్దలు గంట వాయిస్తారు. ఆ చప్పుడుకు మా ఇళ్లల్లో, వణ్ణం గణ్ణం అని పేరు. ఆ రెండు మాటలు అంటే నైవేద్యం అని అర్థం. ఆడుతున్న వాళ్లు ముగ్గురిలోకి మా అన్నయ్య పెద్దవాడు. నేను ఇప్పుడు ఆరాధన చేస్తాను. అని కాసేపు ఏమో చదివాడు. ఇప్పుడు నైవేద్యం జరుగుతుంది. మరి మీరు ఇక్కడ ఉండకూడదు. కనీసం కళ్లు మూసుకోండి అని చెల్లెళ్లకు ఆదేశం ఇచ్చాడు. అవును అనుకుని వెంట్రుకలు గట్టిగా మూసుకున్నారు. అన్నయ్య చదువుతున్న మంత్రాలు ఆగిపోయింది. ఏమైందో అర్థం కాని అక్కయ్యలు కళ్లు తెరిచారు. నైవేద్యం పెట్టవలసిన వేరుశనగ గింజలు అన్నింటిని, ఆయన నోట్లో పోసుకుని నములుతున్నాడు. అన్నయ్య పాపం పెద్ద వయసులో ఈ మధ్యనే పోయాడు. కానీ చివరి రోజుల వరకూ చాలా సరదా మనిషి. అతను అప్పుడప్పుడు ఈ సంఘటన చెప్పి ఆయన నమ్మేవారు.
అన్నయ్యకు వేరుశెనగలు అంటే మహా ఇష్టం. అంతకంటే దుండగం పనులు చేయడం మరింత ఇష్టం. ఒకనాడు, శిష్యుడు మిత్రుడు అయిన ఒక మనిషిని వెంటబెట్టుకుని వేరుశనగ పంట మీదకు దొంగతనానికి బయలుదేరాడు. వెళ్లే ముందు ఈ సంగతి మాకు తెలియదు. మధ్య రాత్రి సమయానికి పెద్ద మూటతో ఇంటికి వచ్చాడు. నిండా వేరుశెనక్కాయలు ఉన్నాయి. ఎక్కడివి అని అడిగితే చెప్పడు. అది వేరు సంగతి కానీ, ఆయన తొడ మీద ఒక పెద్ద బొబ్బ లేచింది. చేను మధ్యలో తిరుగుతూ ఉంటే, ఏ పురుగో తాకినట్టు ఉంది. దాని కారణంగా బొగ్గ పుట్టింది. అదే, బొబ్బ పుట్టింది. వరంగల్‌లో, బొబ్బ అంటే అల్లరి అని అర్థం. సరే పక్కకు వెళ్లకుండా కథ ముందుకు చెప్పుకుందాం.
మాకు పొలం ఉంది కానీ వేరుశెనగ పండించే పద్ధతి లేదు. కనుక ఎక్కడ వీలైతే అక్కడ వాటిని సంపాదించుకుని తినేవాళ్లం. మామూలుగానైతే, కంప అనే ఎండిన ముళ్ల చెట్లను, ఒకచోట వేసి తగలబెడతారు. అవి బాగా మండుతున్నప్పుడు పల్లీలు వాటి మీద పోస్తారు. కర్ర తీసుకుని ఆ నిపుణులను కిందకు పైకి కదిలిస్తారు. ఆ వేడిలో పల్లీలు బాగా కాలుతాయి. అప్పుడు చుట్టూ కూర్చుని ఎవరికి వీలైనట్టు వాళ్లు తీసుకుని తినడం ఒక పద్ధతి. మా ఇంట్లో ప్రతి సంవత్సరం, ఒక సీతాఫలాల ఉత్సవం ఉండేది. నాన్న మిత్రులు నలుగురైదుగురు వస్తారు. నా వంటి చిన్న పిల్లలు మరో నలుగురు తోడు వస్తారు. పొద్దున ఏద కొంచెం తిని, అడవి మీద పడతాము. సాయంత్రం దాకా హాయిగా సీతాఫలాలు తింటాం. తిరుగుదారిలో ఒక చిత్రం ఉంటుంది. నాన్న మిత్రుడు లంబడి రాములు వాళ్ల గుడిసెలు దారిలోనే ఉంటాయి. వెళ్లేప్పుడు అతనికి విషయం తెలుస్తుంది కనుక, మేము తిరిగి వచ్చే సమయానికి అతను నేను చెప్పిన పద్ధతిలో పల్లీలు కాల్చి ఎదురుచూస్తుంటాడు. అందరు ఆ కుప్ప చుట్టూ కూర్చుని కొంతసేపు పల్లీలు తింటూ గడుపుతాం. నాలాంటి తెలివి గలవాళ్లం, తినేది ఒకటే అయితే, రెండు జేబులో వేసుకుంటాం. మొత్తానికి ఉత్సవం ముగుస్తుంది. అలా ప్రతి సంవత్సరం జరుగుతుంది.
చిత్రం చెప్పాలి కానీ, అమెరికాలో, పీనట్స్ బాగా తింటారు. ఒకానొక అధ్యక్షుడికి, పీ నట్ వ్యవసాయదారుడు అని పేరుంది కూడా. అది పక్కన పెడితే నేను ఒక విచిత్రం గమనించాను. అమెరికాలో ఉన్న కొద్దిరోజులపాటు, మా అబ్బాయి మమ్మల్ని రకరకాల తిండి తినడానికి తీసుకువెళ్లాడు. వేర్వేరు దేశా తిన్నాము. కానీ ఒక పద్ధతి మాత్రం అమెరికా తిండితోనే సాగింది. అక్కడ మిగతా ఏం తిన్నాము నాకు నిజంగా గుర్తు లేదు. కానీ ఆ అంగట్లో, మిగతా పదార్థాలన్నీ డబ్బులు ఇచ్చి కొనాలి. అక్కడ కొన్ని అట్టపెట్టెల నిండా, వేపిన వేరుశెనగ కాయలు పోసి ఉంటాయి. ఎవరికి కావలసిన నివాళులు, తెచ్చుకుని ఉన్నంతసేపు తినవచ్చు. బయటకు తీసుకువెళ్లడం మాత్రం కుదరదు. లోపల డబ్బులు ఎన్ని తిన్నా అభ్యంతరం లేదు. వాటికి డబ్బులు అడగరు. నాకు నిజంగా ఆశ్చర్యంగా కనిపించింది. అయితే అక్కడి పల్లీలు వేరుగా ఉండడం కూడా నేను గమనించాను. అవి బాగా లావుగా ఉన్నాయి. పొడుగ్గా ఉన్నాయి కూడా. రుచి కూడా తేడాగా ఉంది.
పీ నట్ బట్టర్, అన్నది అమెరికాలో బాగా ఎక్కువగా తినే రకం వెన్న. అది నిజానికి వెన్న కాదు. వేరుశెనగ నూనె బాగా రుబ్బి, అందులో మరికొన్ని కలిపి, పదార్థం ఒకటి తయారుచేసి పెడతారు. దాన్ని పొట్టకు పూసుకుని తినవచ్చు. మన దేశంలో కూడా ఇది దొరుకుతుంది. నేను చాలా కాలం తెచ్చుకుని తినేవాడిని. ఈ నాలుగు ముక్కలు రాసిన తరువాత అందరిలోకి వెళ్తే మళ్లీ కూడా తెచ్చుకుంటాను. ఏదో ఒక రూపంలో వేరుశనగను తినడం చాలా బాగుంటుంది. అది ఆరోగ్యం కూడా. కాల్చడం గురించి చెప్పాను. బాణలిలో వేయడం గురించి అందరికీ తెలుసు. కానీ మేము వేరుశనగలు ఉడకబెట్టి తింటాము. ఇది కూడా చాలామందికి తెలుసు. తంపట కాయలు అన్న మాట విన్నాను. సరిగ్గా చెబుతున్నానో లేదో గుర్తు లేదు. విషయం తెలిసిన వాళ్లు వివరించి చెబితే బాగుంటుంది.
మా అమ్మాయి చిన్న పాపగా ఉన్నప్పుడు, దేవుడు కనిపిస్తే ఏమి అడుగుతావు అని ప్రశ్నించారు. చిప్స్, అని ఆమె జవాబు చెప్పింది. నన్ను చిన్నప్పుడు ఎవరు ఏమి అడిగారో నాకు ఎవరు చెప్పినట్లు లేదు. చాలా విషయాలు చెప్పారు కానీ ఈ సంగతి చెప్పలేదు. నాకు అధికారం ఇస్తే, వేరుశనగలకు, దేశాన్ని కూడా అమ్మడానికి నేను సిద్ధం. ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్లినా, ఏదో రూపంలో దొరికిన వేరుశనగను తెచ్చుకోవడం నాకు బలహీనత.
నేను ఉద్యోగంలో ఉండగా, ఒక అమ్మాయి, నా రహస్యం తెలిసిపోయింది అని ఒకరోజు అన్నది. ఆఫీసర్‌కి లంచం ఇవ్వాలంటే, ఎవరికి ఏమి ఇవ్వాలి తెలుసుకోవడం కష్టం. ఈయనకు మాత్రం వేరుశెనక్కాయలు ఇస్తే సరిపోతుంది, అని అమ్మాయి ప్రకటించింది. పెద్ద ఉద్యోగంలో ఉన్నాము కనుక, కొంచెం గంభీరంగా ఉండడం అవసరం. కానీ ఎక్కడో ఏ బస్టాప్‌లోనూ, నేను వేరుశెనక్కాయలు తింటూ ఉండటం ఆ అమ్మాయి చూసినట్టుంది. నా రహస్యం పట్టేసింది.
మనం ఒకసారి అహ్మదాబాద్ వెళ్లాను. అక్కడి విశేషాలు రాసినట్టు కూడా ఉన్నాను. ఊరంతా తిరుగుతున్నాము. రకరకాల తిండి తిన్నాము. చివరకు నాకు ఒక విషయం తెలిసింది. ఆ ఊళ్లో వేరుశెనక్కాయలు చాలా చవకగా అమ్ముతారు. సర్దార్ పటేల్ విగ్రహం దగ్గర, అంటే సర్దార్ సరోవర్ దగ్గర, పది రూపాయలకే బోలెడన్ని పల్లీలు ఇచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఊళ్లో పల్లీల ధర గురించి వాకబు చేశారు. మిత్రుడు జోషి ఆ సాయంత్రం మమ్మల్ని ఒక బజారుకు తీసుకువెళ్లాడు. అక్కడ వేపిన, ఉప్పు పట్టించిన, వేరుశెనగ కాయలను ఆమె అంగళ్లు బోలెడున్నాయి. వాళ్లకు అదొక ఒక పెద్ద పరిశ్రమ. ధర మాత్రం కారుచౌకగా ఉంది. వచ్చేది విమానంలో కనుక సరిపోయింది. లేకుంటే ఒక పది కిలోలు తెచ్చి ఉండేవాడిని. కేవలం రెండు కిలోలతో సరిపెట్టుకున్నాను. ఆ తర్వాత కూడా ఆ వేరే ఊరి నుంచి వేరుశెనగలు తప్పించుకున్నాను. ఓపిక ఉన్నవాళ్లు ఎవరైనా, అహ్మదాబాద్ నుంచి వేరుశనగలు తెప్పించి, ఇక్కడ అమ్మితే బోలెడు లాభాలు సంపాదించవచ్చు. ధరలో అంతటి తేడాలు ఉన్నాయి మరి. వేరుశెనగలు మనకు విదేశాల నుంచి వచ్చినట్లు నాకు అనుమానం. షాద్‌నగర్ ప్రాంతంలో, వాటిని ఇలాతి కాయలు అనడం విన్నాను. అంటే విలాయతీ కాయలు అని అర్థం. వేరే దేశానికి సంబంధించినవి అన్నమాట. ఈ సంగతి గురించి కొంచెం పరిశోధించాలి.
వెనక ఒకసారి ఒక పెళ్లికి ఒక పల్లెకి వెళ్లాము. అక్కడ ఒక మామగారు ఉండేవారు. బహుశా ఆయనకు కూడా నాలాగే కన్నీళ్లు మీద ప్రేమ ఎక్కువ అనుకుంటాను. నా సరదా చూచి, ఇంట్లోనే కంపలో కాయలు కాల్చే ఏర్పాటు చేశాడాయన. ఇనే్నళ్లయినా నాకు ఆ సంగతి గుర్తుండిపోయింది. ఎంతమంది నాకు ఎన్ని పదార్థాలు ఇచ్చి ఉండవచ్చు. అన్ని గుర్తున్నాయా. ఇష్టమైన విషయం కనుక ఇది మాత్రం గుర్తుంది.
బియ్యం చెట్టు, పప్పు చెట్టు అంటూ మాట్లాడిన పిల్లలకు పంటల గురించి అసలు తెలియదు. ఆలు యంత్రంలో నుంచి వస్తాయి అనుకునే వాళ్లు చాలామంది మన మధ్యన ఉన్నారు. అటువంటి వారికి వేరుశెనగ కాయలను గురించి చెబితే ఆశ్చర్యపోతారు. అవి నేను లోపల పండుతాయి. అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఆ కుటుంబానికి చెందిన మిగతా ముక్కలన్నీ మామూలుగానే పెరుగుతాయి. ఇవి మాత్రమే పైన ఒక మామూలుగా కనిపిస్తుంది. కాయలు మాత్రం నెలలు ఉంటాయి. పై నుంచి చూచిన వారికి పంట గురించి ఏ మాత్రం తెలియదు. నీళ్లు పెట్టి, నేలను మెత్తపరిచి, వేరుశనగ కాయలను సేకరించాలి. ఆ సంగతి విషయం తెలియని వాళ్లకు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది.
మన దగ్గర కూడా వేరుశనగలో రకాలు ఉన్నాయని ఎంతమంది గమనించారో తెలియదు. మా పాలమూరు ప్రాంతంలో వేరుశెనగ గింజలు ఎరుపు రంగులో ఉంటాయి. ఒక పల్లిలో రెండు కంటే ఎక్కువ గింజలు ఉండవు గాక ఉండవు. ఇక నల్లగొండకు వస్తే గింజలు ఎరుపు రంగులో ఉంటాయి. మూడు గింజల కాయలు కూడా ఉంటాయి. నా మట్టుకు నాకు వాటిలో కొంచెం రుచి తక్కువగా కనిపిస్తుంది. నూనె మాత్రం ఎక్కువగా ఉంటుంది అంటారు. దేశం మొత్తం మీద చూస్తే, గుజరాత్, మహారాష్టల్రో వేరుశెనగ పంట ఎక్కువగా ఉంటుంది అని నా అభిప్రాయం. సీంగ్ దాణా లేదంటే దానా అంటే శనగ గింజ. మహారాష్టల్రో, జొన్న రొట్టెలతో పాటు, వేరుశనగ పొడి ఉంటుంది. దాన్ని చట్నీ అంటారు. కానీ అది పొడిగానే ఉంటుంది. కారం బాగా చేర్చుతారు. అందులో పెరుగు కలుపుకుని రొట్టెలతోబాటు తింటారు. ఒకసారి నేను నాందేడ్‌లో ఒక కాన్ఫరెన్స్‌కు వెళ్లారు. ఇంటి మీద ఆసక్తి ఎక్కువ కనుక అక్కడ వంట చేస్తున్న కాంట్రాక్టర్‌తో దోస్తీ చేశాను. ఉన్నన్ని రోజులు అతను నాకు ప్రత్యేకంగా తిండి పెట్టారు. తిరిగి వచ్చే రోజూ బోలెడంత చట్నీ పొట్లం కట్టి ఇచ్చాడు. అంత తినలేను కాబట్టి దాన్ని చాలామందికి పంచాను. ఇట్లా నేను పల్లీలు, అనే వేరుశనగలు, అనే న్యాల శెనిగె బుడ్డలు, సీంగ్ గురించి ఎంతసేపైనా చెబుతూ పోగలను. ఇంట్లో ఏ రూపంలోనూ వేరుశనగలు ఉన్నట్టు గుర్తు లేదు. వెంటనే ఏర్పాటు ఎదురు చూడాలి. కనుక ఈ రోజు ఇక్కడ ఆపుతాను.

-కె.బి.గోపాలం