లోకాభిరామం

మనుషులంతా ఒక్కటేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్నియా ఉపరితలం మీద ఒక సన్నని పొర ఉంటుంది. క్రమంగా కణాలు మారినందుకు అది ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి మారిపోతుంది.
రెటీనాలో కణాలు నాశనమయితే కొత్తగా పుట్టవు. అందుకే వయసు పెరిగిన కొద్దీ చూపు లోపాలు వస్తాయి. ఈ మధ్యన స్టెమ్ కణాలతో జరిగే చికిత్స కారణంగా పాడవుతున్న రెటీనాలను బాగు చేయగలుగుతున్నారు. రాడ్ కణాలను తిరిగి పుట్టించగలిగారు. కాంతిని గుర్తించే కణాలను కూడా తిరిగి పుట్టించగలిగారు. అయితే ఈ విషయాలు ప్రయోగశాల వరకే పరిమితమయ్యాయి.
మన చర్మం ప్రతి రెండు వారాలకు ఒకసారి చొప్పున మారిపోతూ ఉంటుంది. ఇది ఒక్కసారిగా జరగదు కనుక ఈ సంగతి మనకు తెలియదు. గాయం తగిలిన తరువాత చర్మంలోని కణాలు మామూలుకు నాలుగింతల వేగంతో తిరిగి పెరుగుతాయి.
నోటిలో మాటలకు అనువుగా రకరకాల నిర్మాణాలు ఉన్నాయి. శ్వాస, తిండి, తాగడం, వాంతులు అన్నీ నోటిద్వారానే జరుగుతున్నాయి. మాటలు అనే ధ్వని కూడా నోటి ద్వారానే వస్తున్నది. ధ్వనికి రూపాన్ని ఇచ్చే గొంతులోని తంత్రులు నిజానికి తిన్న తిండిని సరయిన మార్గంలో పంపడానికి ఉద్దేశించినవి. కానీ వాటివల్ల ధ్వని కూడా పుడుతున్నది. వాటి మధ్యనుంచి రకరకాల ధ్వనులు నోటిలోకి వచ్చిన తరువాత దంతాలు, నాలుక, అంగిలి, పెదవులు అన్నీ కలిసి రకరకాల శబ్దాలకు, అక్షరాలకు రూపం పోస్తాయి. కనుక మనిషికి మాటల వీలు కలిగింది. మనిషి శరీరంలో శబ్దాన్ని పుట్టించే మరొక రంధ్రం వద్ద ఇటువంటి ఏర్పాట్లు ఏవీ లేవు. అయినా కొందరు తమ ఇష్టప్రకారం అడుగు నుంచి వాయు ప్రయోగం చేసి రకరకాల చప్పుళ్లు పుట్టించగలుగుతారట.
మనుషులంతా ఒక్కటే అంటారు. నిజంగానే అందరికీ ఒక తల, రెండు చేతులు, రెండు కాళ్లు, మిగతా భాగాలు ఉంటాయి. కానీ ఏ ఇద్దరు మనుషులు ఒకేలాగ ఉండరు అని తెలుసుకోవడానికి పెద్ద పరిశోధన మాత్రం అవసరం లేదు. కాళ్లు చేతులు ఉండవలసిన చోటే ఉంటాయి. కానీ, వాటితోపాటు శరీరంలో మిగతా అన్ని భాగాలు కూడా ఒక్కో శరీరంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇంతకంటే విచిత్రంగా పరిణామ క్రమంలో వరుసబెట్టి శరీర భాగాల ఏర్పాటు ఎనె్నన్నో మార్పులకు గురవుతూ వచ్చింది. ఆ మార్పులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. పరిణామం ఇంకా జరుగుతున్నదీ అంటే అదే అర్థం. అధునాతన మానవుడు అంటే మీరు, నేను ఎంతెంత తేడాలు కలిగి ఉన్నాము? మన శరీరాలలోని ఏయే భాగాలు నిజంగా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ అంశాలను బాగా పరిశీలించి చూస్తే నోరు వెళ్లబెట్టవలసి వస్తుంది. రానురాను మనుషుల తీరు ఎలా ఉంటుంది అన్నది మరింత ఆశ్చర్యానికి దారితీసే ప్రశ్న. ఏ ఇద్దరు మనుషుల శరీరాలు పూర్తిగా ఒకేలాగ ఉండవు. పరిణామం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నది.
శరీరంలోని లక్షణాలు ఒక్కొక్క దాన్ని చూచేకంటే మొదలు మనిషి మొత్తం తీరులో ఉండే వైవిధ్యం చాలా గొప్పది. అందులో ఎత్తులకు మరింత ప్రాముఖ్యత ఉంది. సగటు మనిషికన్నా ఈ ప్రపంచంలో అందరికన్నా పొట్టి మనిషి అర మీటరు తక్కువ ఎత్తు ఉన్నాడంటే ఆశ్చర్యం కాక మరేమిటి? కాంగో దేశంలోని ఒక తెగ వారిలో ఈ రకం పొట్టి మనుషులు ఉంటారు. ఇక నెదర్లాండ్స్ లేదా డచ్ దేశం వారు అందరికంటే పొడగరి మనుషులు. ఈ రెండు రకాల మనుషుల ఎత్తులు 1.37 నుంచి 1.84 మీటర్ల మధ్యన ఉంటాయి. ఇక మీరు, మేము ఆ మధ్యలో ఉంటాము. యూరోపు దేశాలలో వారు ఆడవాళ్లే సగటున 1.65 మీటర్ల ఎత్తు ఉంటారు. మగవారు 1.78 మీటర్ల ఎత్తు ఉంటారు.
ఎత్తులలోని ఈ తేడాలు మన వంశ క్రమాల ద్వారా జన్యుపరంగా సంక్రమిస్తున్నాయి. ఇక మరీ పిన్న వయస్సులో అంటే పుట్టిన మొదటి రెండు సంవత్సరాలలో పెట్టిన తిండి ప్రకారం కూడా ఎత్తులలో తేడాలు పుట్టుకువస్తాయి. జన్యు ప్రభావాలను మనం గమనించి చూడవచ్చు. మానవులలోని పూర్వీకులు సుమారు రెండు మిలియన్ సంవత్సరాల నాడు ఆఫ్రికాలోని మైదానాలలో బతికేవారు. వారు చాలా పొడగరి రకం మనుషులు. కనీసం 1.83 మీటర్ల ఎత్తు ఉండేవారు. కాళ్లు పొడుగ్గా ఉండి శరీరాలు నిటారుగా ఉండి చలాకీగా కదలడానికి వారి శరీరం అనువుగా వుండేది. నిరంతరం తిండి కొరకు వేటాడుతూ పరుగులు పెట్టే మనుషులకు ఆ కదలిక ఎంతో అవసరం. కొందరు మానవులు ధృవ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆ చల్లని దేశాలలో పరుగులు వీలు కావు. కనుక ఆ మనుషులంతా పొట్టివాళ్లు అయ్యారు. శరీరాలు బొద్దుగా మారాయి. ఎదలోని ఎముకలు, తుంటి ఎముకలు వెడల్పుగా వచ్చాయి. వేడి శరీరంలో నుండి బయటకు వెళ్లే వీలు కొరకు శరీరాలు వెడల్పుగా మారాయి. ఇక ఉష్ణ మండలంలోని మనలాంటి వారంతా చిన్న శరీరాలు గల వారు అయ్యారు. ఇక్కడ వేడిని ఉత్పత్తి చేసి దాచుకోవలసిన అవసరం తక్కువగా వుంటుంది.
ఈ రకం తేడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక మనిషి ఉండే ఎత్తును గురించి తెలుసుకోవాలంటే ముందు వారి కుటుంబంలోని మిగతా సభ్యులను గమనించడం సులభమయిన పద్ధతి. వైవిధ్యంలో 80 శాతానికి జన్యుపరమయిన కారణాలే ఉన్నాయి. మనిషి శరీరంలో బరువును ప్రభావితం చేసే జన్యువులు 50 దాకా ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. ఇక తినే తిండి వలన 20 శాతం తేడాలు కనిపిస్తున్నాయి. బిడ్డ పుట్టిన మొదటి రెండు సంవత్సరాలలో తిన్న తిండి రోగాలను అడ్డుకోవడానికే ఖర్చయ్యే పక్షంలో ఎత్తు పెరగజాలదు. ఆరోగ్యంగా ఉంటే మంచి తిండి దొరికిన బిడ్డ బాగా ఎదుగుతుంది. ఈ రకంగా చూస్తే ఒక్కో జాతిలో ఎత్తుల తేడా గురించి తెలుస్తుంది. డచ్ దేశస్థులు 1860 ప్రాంతంలో అంత ఎత్తు ఉండేవారు కాదు. ఆ తరువాత దేశంలో పాడి పరిశ్రమ, తిండి పరిస్థితులు బాగా పెరిగాయి. కనుక 1990 నాటికి వారి సగటు ఎత్తు 16 సెం.మీ. పెరిగింది. నిజానికి ఆరోగ్యంగా ఉండి హాయిగా తింటున్న పడమటి దేశాల వారిలో కూడా గడచిన కొన్ని దశాబ్దాలలో ఎదుగుదల రేటు తగ్గుతున్నది అని గమనించారు. జన్యువుల ప్రభావం ఎంత ఉన్నా ఒక మనిషి ఎదగగలిగిన ఎత్తుకు ఒక అంతు కూడా ఉండాలి మరి.
ఎత్తులో ఇంతటి తేడాలు కనిపిస్తుంటే ఇక బరువు, శరీరం తీరులో కూడా ఆ తేడాలు కనిపించక తప్పదు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ తక్కువ బరువు ఉన్నవారి మధ్య తేడా 50 శాతం వరకు ఉంటున్నది. ఇందులోకి మరీ పొట్టివారయిన పిగ్నీ జాతులను లెక్కించకుండానే ఇంత తేడా కనిపిస్తున్నది. ఈ మధ్యన ప్రపంచంలో ఎక్కడి వారిని చూచినా రూపంలో మాత్రం ఒకే రకంగా కనిపించే పరిస్థితి ఎదురవుతున్నది. ఇదేమంత ఆరోగ్యకరమయిన పరిస్థితి కాదు. ఎక్కడ చూచినా పొట్టలు పెరిగిపోతున్నాయి. ఆశ్చర్యకరంగా బీదదేశాలయిన బంగ్లాదేశ్, గ్వాటిమాలాలలో కూడా ఈ పరిస్థితి ఎదురవుతున్నది. భారతదేశం బీదది అని చెప్పడానికి లేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. కానీ ఇక్కడ కూడా బొజ్జ విషయంలో మాత్రం ఏపాటి కొరత కూడా కనిపించడంలేదు. ధనవంతులయిన వారు ఊబకాయులుగా పెరిగి బీదవారు రానురాను చిక్కిపోతున్నారు అన్న మాట కూడా అంత నమ్మదగినదిగా కనిపించడంలేదు.
బాడీ మాస్ ఇండెక్స్ అన్నది ఎత్తు బరువుల మధ్యన సంబంధాన్ని సూచిస్తూ వేసే ఒక లెక్క. వాటి ప్రకారం మన నడుములు ఉండవలసిన దానికన్నా అంతో ఇంతో ఎక్కువై ఉంటున్నాయి. ’90వ దశకం వరకు చిన్నపిల్లలు అందరికీ ఎత్తునుబట్టి ఆహారం కూడా ఉండేది. నిజానికి శరీరంలో 23 శాతం కొవ్వు వుండేది. కండరాలు ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉండేవని చెప్పవలసిన అవసరం లేదు. రానురాను ఈ తేడాలు తగ్గుతున్నాయి. సగటున చూస్తే మనుషులు సన్నబడుతున్నారు. పొట్టలు మాత్రమే పెరుగుతున్నాయి. అయితే అమెరికా, ఇంగ్లండ్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో మాత్రం ఊబకాయాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అంటున్నారు. రానురాను అందరూ సన్నబడిపోతారు అన్న మాట కూడా ఏమంత మంచిది కాదు.
ఇవన్నీ ఎన్ని రకాలుగా ఉన్నా మొత్తానికి మన శరీరంలోని వైవిధ్యం మాత్రం చెప్పుకోదగినదిగానే ఉంది. కవలల మీద జరిగిన పరిశోధనల ద్వారా కనుగొన్న కొన్ని విషయాలను ఇంతకు ముందే మనం గమనించాము. ఇద్దరు బిడ్డల మధ్యన తేడా అమ్మ కడుపులోనే మొదలవుతుంది. ఎవరిలో వారికి జన్యువులలో తమంత తాముగా జరిగే మ్యూటేషన్‌లు అక్కడే మొదలవుతాయి గనుక తేడాలు జన్యుపరంగా కూడా కనిపిస్తాయి. ఇక తల్లి గర్భంలో ఇద్దరి శిశువుల మీద పడే ఒత్తిడి, ఇతర పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. కనుక వారిలోని కణజాలాలు పెరిగి ముందుకు సాగే తీరు కూడా వేరుగా ఉంటుంది. ఇక శరీర భాగాలు దేనికవిగా పెరిగే తీరు మరొకటి ఉంది కనుక వైవిధ్యానికి ఏ మాత్రం లోటు లేకుండా కొనసాగుతున్నది.

-కె.బి.గోపాలం