జాతీయ వార్తలు

మధ్యవర్తిత్వం సిమ్లా ఒప్పందానికి వ్యతిరేకం:రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కశ్మీర్‌పై అంశంపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ప్రధాన మోదీ తనను కోరినట్లు, ఇరు దేశాలు అంగీకరిస్తే తాను సిద్ధమని, తాను ఏదైనా సాయం చేయగలను అంటే చేస్తాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు లోకసభలో ఆందోళనకు దిగారు. మోదీ స్వయంగా సమాధానం చెప్పాలంటూ వెల్‌లోకి దూసుకువచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ దీనిపై సమాధానం చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. మోదీ ట్రంప్‌తో ఏం మాట్లాడారో వెల్లడించాలని పట్టుబట్టాయి. అనంతరం కేంద్రం తీరును నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం సిమ్లా ఒప్పందానికి వ్యతిరేకం అని, సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లవుతుందని అన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అడగలేదని, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పింది వాస్తవమని, ఒసాకాలో మోదీ-ట్రంప్‌ భేటీ జరిగినప్పుడు ఆయన కూడా ఉన్నారన్నారు. పాక్‌తో ఉన్న అన్ని సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరిస్తామని అన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలు సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేస్తేనే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. ‘భారత ఆత్మగౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని , కశ్మీర్‌ విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోం. ఇది మన గౌరవానికి సంబంధించిన విషయం. అని రాజ్‌నాథ్ తెలిపారు.