జాతీయ వార్తలు

గోరఖ్‌పూర్‌లో భాజపా, ఫుల్‌పూర్‌లో ఎస్పీ ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా ఆధిక్యంలో ఉండగా, ఫుల్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. గతంలో ఈ రెండు స్థానాల్లోనూ భాజపానే విజయం సాధించింది. గోరఖ్‌పూర్‌ నియోజకవర్గంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయిదు సార్లు విజయం సాధించారు. గత ఏడాది యోగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. అలాగే కేశవ్‌‌ ప్రసాద్‌ మౌర్య ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ఫుల్‌పూర్‌ నియోజకవర్గం ఖాళీ అయ్యింది. బిహార్‌లోని ఒక లోక్‌సభ స్థానానికి, రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఈరోజు కౌంటింగ్‌ జరుగుతోంది. అరారియా లోక్‌సభ స్థానం, జహానాబాద్‌ అసెంబ్లీ స్థానాల్లో తొలి రౌండ్ల ఫలితాల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ ఆధిక్యంలో ఉంది.