జాతీయ వార్తలు

లోక్‌సభలో టిడిపి, వైకాపా ఎంపీల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వరసగా రెండోరోజు మంగళవారం కూడా లోక్‌సభలో టిడిపి, వైకాపా ఎంపీలు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వారి నినాదాల హోరు మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడవద్దని, ప్లకార్డులు ప్రదర్శించరాదని ఆమె పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. ప్రత్యేక హోదాపై చర్చించాలని టిడిపి ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో వారు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ప్రత్యేకహక్కు ఆంధ్రుల హక్కు అని వారు పేర్కొన్నారు. అంతకుముందు పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం వద్ద టిడిపి, వైకాపా ఎంపీలు వేర్వేరుగా ధర్నా చేశారు. టిడిపి ఎంపీ శివప్రసాద్ స్వామి వివేకానంద వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు.