రాష్ట్రీయం

నష్టాన్ని నివేదిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నదాతలకు కేంద్ర బృందం హామీ

నల్లగొండ, డిసెంబర్ 7: నల్లగొండ జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులతో జరిగిన పంట నష్టం, తాగునీటి ఎద్దడి సమస్యలను కేంద్ర కరవు పరిశీలన బృందం సోమవారం క్షేత్ర స్థాయి పర్యటనతో పరిశీలించింది. రైతులు వర్షాభావ పరిస్థితులతో తాము ఎదుర్కొంటున్న కరవు కష్టనష్టాలను కేంద్ర బృందానికి ఏకరవు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుధ్య విభాగం సలహాదారు బ్రిజేష్ శ్రీ వాత్సవ, మత్స్యశాఖ సహాయ కమిషనర్ వెంకటేశ్వర్‌రావు, కృష్ణా గోదావరి బేస్ సర్కిల్ ఎస్‌ఇ ఎస్.శ్రీనివాస్, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్‌లతో కూడిన కేంద్ర బృందం జిల్లాలోని బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల్లో పర్యటించి కరవు పరిస్థితులను పరిశీలించింది. గ్రామాలలో పర్యటించి వర్షాభావంతో దెబ్బతిన్న పత్తి, కంది పంటలను, ఎండిపోయిన చెరువులను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. జిల్లాలో కరవు కారణంగా పంటలు ఎండిపోవడంతో పాటు తాగునీటికి, పశుగ్రాసానికి కొరత ఏర్పడినట్లుగా గమనించామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన కరవు అంచనాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సహాయం కోసం కేంద్రానికి నివేదిక అందిస్తామన్నారు. కేంద్ర బృందం బొమ్మలరామారం మండలం మిర్యాల గ్రామంలో రైతు రాములమ్మ,మందడి చంద్రారెడ్డిలకు చెందిన ఎండిపోయిన పత్తి, కంది పంటలను, స్థానిక చెరువును, ఉపాధి హామీ పనులను పరిశీలించింది. గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడి నివారణకు నెలకు 8వేల చొప్పున తీసుకున్న అద్దె బోరును వారు పరిశీలించారు. పశుగ్రాసం, మంచినీటి కొరత సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, 100 కిలోమీటర్ల నుండి ట్రాక్టర్ల ద్వారా గడ్డిని కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటున్నామని రైతులు వెల్లడించారు. గ్రామాలలో వ్యవసాయం దెబ్బతిని, ఉపాధికి వలసలు పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారం ఇప్పించి, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి, పనిముట్లు సరఫరా చేయాలని కోరారు. తుర్కపల్లి మండలం, రుస్తాపూర్ గ్రామంలో ఎండిన పత్తి, జొన్న, సజ్జ, వరి పంటలను పరిశీలించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి, పెట్టుబడులు నష్టపోయామని గిరిజన ప్రాంతమైన తమకు సబ్సిడీ బియ్యం, పశుగ్రాసం అందించి, ఆదుకోవాలని కోరారు. మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యులు బ్రిజేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ కరువు పరిస్థితులను అదిగమించేందుకు మిషన్ కాకతీయ, ఉపాధి హామీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు, కూలీలకు సూచించారు. పంట మార్పిడి, ఆరుతడి పంటల సాగుతో రైతులు నష్టాలు తగ్గించుకోవాలన్నారు. పిదప యాదగిరిగుట్ట మండలం, మల్లాపురంలో ఎండిన పంటలను, చెరువును పరిశీలించారు. ఎండిన చెరువుల ఫొటోల ప్రదర్శనను పరిశీలించారు. పంటలు ఎండిపోయి నష్టపోయామని ఆదుకోవాలని స్థానిక రైతులు తమ గోడు వినిపించారు. కరవు మండలంగా ప్రకటించారని పెద్ద ఎత్తున పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. అనంతరం ఆలేరు ప్రభుత్వ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన జిల్లా కరవు పరిస్థితుల ఫొటో ప్రదర్శనను కరవు బృందం పరిశీలించింది. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి జిల్లా కరవు పరిస్థితులను, అందించాల్సిన సహాయాన్ని కేంద్ర బృందానికి నివేదించారు.