ఫలించని లవ్ ఫార్ములా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడడానికి ఒక కారణం అంటూ వుండాలా? అసలేం అవసరం లేదు. ఒక్క తెలుగు సినిమా చూస్తే చాలు. ఇటువంటి నిర్ణయానికి వచ్చేస్తాం. ప్రేమకథా చిత్రాలు అపూర్వమైన విజయాలు పొంది, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాస్టర్ పీసెస్ అనేకం తెలుగులో ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులు ప్రేమించిన చిత్రాలు. ఆయా కథలలో ఓ కొత్తదనం, అనుభూతి, ప్రేమికుల నిస్వార్థత ఉంటాయి. అందుకే ఆ చిత్రాలు అజరామరంగా నిలిచాయి. ఇప్పుడు కూడా ప్రేమకథా చిత్రాలు వస్తున్నాయి. కానీ ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది టాలీవుడ్‌లో. ముఖ్యం గా 2015 సంవత్సరంలో సింహభాగం చిత్రాలు లవ్ సబ్జెక్ట్‌పైనే రూపొందాయి. కానీ విజయవంతమైనవి మాత్రం వేళ్లమీద లెక్కపెట్టడానికి కూడా దొరకడంలేదు. ప్రేమకథా చిత్రాలను సులభంగా రూపొందించవచ్చు అన్న నిశ్చయానికి దర్శక, నిర్మాతలు వచ్చేశారు. అమ్మాయి, అబ్బాయి ఒక్కసారి చూసుకొని మొదట తగవుతో మొదలైన ప్రేమ, ఆ తర్వాత శారీరక ప్రేమతోనే అంతమవుతుంది అన్న ఆలోచనలతోనే మనవాళ్లు కథలు రాసుకుంటున్నారు. ముఖ్యంగా కాలేజీ యువత అనుకునే ఆలోచనలన్నీ తమ చిత్రాల్లో ఉన్నాయని, చెబుతూ జుగుప్సాకరమైన సన్నివేశాలను పెద్దలకు మాత్రమే అనే రీతిలో తయారయ్యే చిత్రాల్లా నిర్మిస్తున్నారు. ప్రేమికులిద్దరి పాత్రలు ఓ పట్టాన ప్రేక్షకులకు అర్ధంకావు. ఒక చిత్రంలో అబ్బాయి ఆధిక్యతతో సన్నివేశాలను నడిపిస్తే, మరో చిత్రంలో అమ్మాయి అబ్బాయిని వెర్రివెంగళప్పని చేసి ఆడిస్తుంది. వీలైతే తన స్నేహితురాళ్లతో కూడా ర్యాగింగ్ పద్ధతిలో కథానాయకుణ్ణి వెర్రిపప్పని చేసి ఆడిస్తుంది. ఇవన్నీ ఒకటైతే పరిస్థితులు అనుకూలించక విడిపోయిన ప్రేమికులు, పెద్దలు ఒప్పుకోక విడిపోయిన ప్రేమికులు, చిన్న అవగాహనా లోపంతో ఎడమొహం పెడమొహం అయిన కథనాలు బోలెడు ఈ సంవత్సరం వచ్చాయి.
అన్నీ ఒకటే పద్ధతిలో రూపొందిన చిత్రాలే. అన్నీ మొనాటనీతో ప్రేక్షకుడు థియేటర్ బయటకు వచ్చేసేలా చేసే సన్నివేశాలే! కథ ఎలా ఉన్నా కథనం ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడం ప్రేమకథా చిత్రాలకు పెద్ద మైనస్‌లా మారింది. ఏవో కొన్ని చిత్రాలు చూసి తాము కూడా చిత్రాలను తీసే మొనగాళ్లమని దర్శకులు ఆయా నిర్మాతలను ఎలా ఒప్పిస్తున్నారో కానీ, పేలవమైన కథనాలు తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇది చెప్పుకోడానికి అందంగానే వున్నా చూడడానికి మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంటోంది. లేడీస్ అండ్ జెంట్లిమెన్ అని నువ్వూనేనూ ఒక్కటవుదామంటూ, ఆనందం మళ్లీ మొదలైంది అంటూ ప్రేమికులిద్దరూ ఓ వారధి కట్టుకుంటూ అది రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో తేలింది. ‘కొరియర్‌బాయ్’ కళ్యాణ్ తానే ‘కొలంబస్’నంటూ ‘తనూ నేనూ’ ‘కృష్ణమ్మకలిపింది ఇద్దరినీ’ అనుకుంటూ ‘జాదూగాడి’లా తెరపైకి వస్తే ప్రేక్షకులు పెసరట్టును మాడ్చేశారు. మాడినా సరే నాకైతే నచ్చింది అంటూ తెలుగు నిర్మాతలు, దర్శకులు తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. ‘ఆంధ్రాపోరి’,‘రామ్‌లీల, ‘లవకుశ’,‘టిప్పు’ లాంటి వాళ్లంతా ‘వేరీజ్ విద్యాబాలన్’ అనుకుంటూ మంచి చిత్రాలకోసం వేట ప్రారంభించారు. చివరికి ‘కుమారి 21ఎఫ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ లాంటివి చూసి ప్రేక్షకులు ‘్భలే భలే మగాడివోయ్’ అని మెచ్చుకున్నారు. ఇలా ప్రేమకథా చిత్రాల విజయాలు కేవలం నాలుగు మాత్రమే ఈ సంవత్సరం దక్కాయి.
మిగతా చిత్రాలన్నీ నిర్మాతలకు నష్టాలు మిగిలిస్తే, ప్రేక్షకులకు టికెట్ డబ్బులతోపాటుగా విలువైన సమయాన్ని మింగేశాయి. ఇటువంటి చిత్రాలు ఎందుకు తీస్తారు అంటూ అనేకమంది అడుగుతున్నా, వారి ప్రశ్నలు అరణ్యరోదనలుగానే మిగులుతున్నాయి. గొప్ప క్లాసిక్స్ తియ్కక్కర్లేదు, కనీసం మంచి ఫీల్ వున్న కథతో ప్రేమ చిత్రాల వస్తే అదే పెద్దరిలీఫ్. వచ్చే సంవత్సరం అయినా అలాంటి ప్రయత్నం జరగాలని కోరుకుందాం.