ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఎన్ని అవరోధాలున్నా పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. విమర్శలు పట్టించుకోకండి. అపజయం నుండి జయాన్ని అందుకుంటారు. బకాయిలు వసూలవుతాయి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, పరిశ్రమ, శ్రమ జీవన రంగాల వారు వృద్ధిని పొందుతారు. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. చైన్ స్నాచింగ్ పట్ల జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు ఉపాథి అవకాశాలు. ఐకమత్యమే బలం అని గుర్తిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఆదాయ ప్రయత్నాలు మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

అదృష్టాన్ని పరీక్షించుకుని కాకతాళీయంగా లాభపడతారు. ఫలితాలను నిర్దేశించుకొని లాభాల లక్ష్యాలను పూర్తి చేస్తారు. కుటుంబానికై ముఖ్యమైనవి ఏర్పాటు చేసుకుంటారు. విదేశీ ప్రయాణ, ఉద్యోగ ప్రయత్నాల ఫలితాలు సంతోషాన్నిస్తాయి. ప్రయాణాలందు ఆరోగ్యం జాగ్రత్త. ఆస్తి విలువలు అధికమవుతాయి. కోర్టు విషయాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకోని ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బదిలీలకు అవకాశం. విలువైన వస్తువులతో ప్రయాణాదులందు జాగ్రత్త వహించండి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

కార్యసిద్ధి. నిర్ణయాలు మంచికే దోహదపడతాయి. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో, నచ్చిన రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. హితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం చూసుకోండి. కొత్త పరిచయాలు ప్రయోజనకారిగా ఉంటాయి. వాతావరణానికి అనుకూలంగా ప్రవర్తించండి. స్ర్తిలు, దంపతులు వాదనకు దిగవద్దు. మాట్లాడటంలో, మాటల్లో ఇబ్బంది లేకుండా చూసుకోండి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అనుకున్నవి నెరవేరుతాయి. మిత్రులు అవసరానికి సహాయపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అనుకోకుండా కుటుంబ అవసరాలకై పెద్ద మొత్తంలో వ్యయం చేయాల్సి వస్తుంది. కృషితోనే పైకి వస్తారు. ఒక ముఖ్య సంఘటన ఆనందాన్ని, మానసిక తృప్తినిస్తుంది. మీ ఆలోచనలు మేలు చేస్తాయి. వృత్తి, వ్యాపార, మెటీరియల్స్, చేతి వృత్తుల రంగాల వారు అనుకోని లాభాలు పొందుతారు. ఉద్యోగావకాశాలు. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు, బదిలీలు, స్థల మార్పులుంటాయి. స్ర్తిలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

ముఖ్య విషయాలను ఆకళింపు చేసుకుంటారు. ఎదురుచూస్తున్న వారు వస్తారు. చేయవలసిన సాయమందిస్తారు. వృత్తి, వ్యాపార, విద్య, వైద్య రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల మన్ననలు అందుకుంటారు. కాలుజారి కిందపడే అవకాశముంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి, వ్యాపారాలు కొంచెం మెరుగవుతాయి. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చవలసిన బాధ్యతలుంటాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలపై ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. నిపుణుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

శుభకార్యాలు కలసి వస్తాయి. ముఖ్యమైన సంఘ, కుటుంబ కార్యాలందు పాల్గొంటారు. తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. పెద్దల సలహాలతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తి చేస్తారు. సంతాన సౌఖ్యం. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు వాతావరణానుకూలంగా మలచుకోవాలి. ఈర్ష్యాద్వేషాలకు తావివ్వకండి. మీ పనులను ఇతరులకు అప్పగించకండి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో అప్రమత్తంగా మెలగాలి. సుఖ సంతోషాలుంటాయి. చంచల స్వభావాన్ని విడనాడండి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

పరిస్థితులకు అనుకూలంగా కార్యాలు పూర్తి చేస్తారు. మనోబలం మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగులకు శుభ ఫలితాలు. విద్యార్థులకు కృషి తగిన మంచి ఫలితాలుంటాయి. దూర ప్రయాణాలుంటాయి. మిత్రులతో కలసి ఇతరులకు సాయం చేస్తారు. మీ సాయం పొందినవారే మిమ్మల్ని విమర్శిస్తారు. గమనించండి. కుటుంబ సభ్యులతో చర్చలు మీకు నూతన శక్తినీ బలాన్నీ చేకూరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అన్న మాటలు వెనుకకు తీసుకోవద్దు. అంతిమ విజయం మీదే అవుతుంది. అవసరాలకు తగ్గట్టు ఆలోచించి సత్ఫలితాలు పొందుతారు. బంధువులతో కలసి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పదిలంగా చూసుకోవాలి. వీలు చేసుకుని కుటుంబానికై సమయం కేటాయించండి. సంతోషాన్ని పొందుతారు. యాదృచ్ఛికంగా అనుకోని మంచి సంఘటనలుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆభరణాలతో ప్రయాణాదులందు జాగ్రత్త. స్పెక్యులేషన్ లాభిస్తుంది. శ్రమకు తగిన లాభాలుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

విజయం మీదే. మీ లౌక్యంతో పరాజయంలో సైతం జయాన్ని అందుకుంటారు. వ్యయాలు తగ్గించుకుంటే ధనార్జనకు లోటుండదు. ఆహార, వ్యవహారాదులందు నిర్లక్ష్యం కూడదు. ఆనందకరమైన ప్రయాణాలుంటాయి. తొందరపాటు తగదు. ప్రతి విషయంలోనూ ముందడుగు వేయండి. వృత్తి, ఉద్యోగాదులందు స్వల్ప మార్పులు గోచరిస్తున్నాయి. అన్ని పనులు మీరనుకున్నట్లుండక, మార్పులకు లోనవుతాయి. ఏకాగ్రత మిమ్మల్ని అగ్రస్థానంలో ఉంచుతుంది. నిరుద్యోగులకు, విద్యార్థులకు మంచి సమయం. కృషికి తగ్గ ఫలితాలుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

కష్టపడే మీ మనస్తత్వం అన్నింటిలోనూ జయాన్ని అందిస్తుంది. ముఖ్యమై పనులు ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. సంతృప్తిని అందుకుంటారు. మీ మార్గదర్శకత్వం ఇతరులకు మేలు చేస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో నష్టం రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ నిమిత్తం సమయాన్ని కేటాయించండి. వ్యాపార విస్తరణ వాయిదా వేయండి. చేసే పనులందు జాగ్రత్త అవసరం. అత్యుత్సాహం అన్నింటా పనికిరాదు. శత్రువులపై జయం. పెద్దల అండదండలు, ఆశీస్సులు అందుకుంటారు. శ్రద్ధ పెట్టండి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆర్థిక సౌలభ్యముంటుంది. ఖర్చులున్నా అవసరానికి పైకం సర్దుబాటు అవుతుంది. ఇతరుల అప్పుల కోసం సంతకాలు చేయకండి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. శక్తికి మించి సేవలు వద్దు. విద్య, వైద్య, వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాల వారు ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. స్ర్తిలు వైషమ్యాలను పెంచుకోకుండా ఉంటే ఉత్తమం. ఇష్టమైన రీతిలో ముందుకు వెళ్లి జయాన్ని పొందండి. స్పెక్యులేషన్ మేలు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

అన్నింటా శ్రమానుకూలంగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఒక పనిని పదేపదే చేయవలసి వస్తుంది. పస్తులుండవద్దు. సాలోచనలతో సమయానికి నిర్ణయాలు తీసుకోండి. చేసే పనులందు అపశృతులు లేకుండా చూసుకోండి. వాతావరణానికి అనుకూలంగా మెసలండి. మోసం చేసేవారిని గుర్తించండి. అప్రమత్తంగా ఉండండి. ఆధ్యాత్మిక, సంఘ కార్యాలందు పాల్గొని పేరుప్రతిష్టలు పొందే అవకాశముంది. లక్ష్య సాధనకై పథకాలు రచించండి. బహుమతులు పొందే అవకాశముంది.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855