జాతీయ వార్తలు

మళ్లీ మావోల కదలిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: గత కొన్ని సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న మావోయిస్టు సమస్య ఒడిశా, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ తలెత్తే అవకాశం ఉందని సిఆర్‌పిఎఫ్ నక్సల్ నిరోధక ఆపరేషన్ల డిజిపి ప్రకాశ్ మిశ్రా స్పష్టం చేశారు. వామపక్ష ఉగ్రవాద పీడిత రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు ఇందుకు సంబంధించి బలమైన సంకేతాలు అందిస్తున్నాయని తెలిపారు. ఏవోబీ,జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లపైనే నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను ప్రధానంగా సాగిస్తున్నామని, తాజా పరిణామాల నేపథ్యంలో ఒడిశాపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ఒడిశాలో నక్సల్ సమస్యను దాదాపుగా తొలగించినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దును ఆనుకుని ఉన్న కోరాపుట్ జిల్లాలోని నారాయణ్ పట్నలో మళ్లీ తలెత్తుతోందని డిజిపి తెలిపారు. ఇందుకు పోలీసుల ఉదాసీనత సహా అనేక కారణాలున్నాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ, చివరికి తెలంగాణలో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువేనన్నారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగితే మాత్రం పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడం సాధ్యమేనని తెలిపారు. నక్సల్ పీడిత రాష్ట్రాల్లో ఈ సమస్య పూర్తిగా అదుపులోకి రావాలంటే ప్రస్తుత చర్యల వేగాన్ని, పటుత్వాన్ని ఇదే స్థాయిలో కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదాసీనతకు ఆస్కారం ఉండకూడదని ప్రకాశ్ మిశ్రా ఉద్ఘాటించారు. నక్సల్ నిరోధక చర్యలతో పాటు అభివృద్ధి కార్యకలాపాలు కూడా అంతే నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఇందుకోసం వెయ్యి మంది బిఎస్‌ఎఫ్ దళాలను ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర హోం శాఖ కేటాయించిందని మిశ్రా తెలిపారు. అనేక రాష్ట్రాల్లో భద్రతా దళాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, నక్సల్స్ బలంగా ఉన్న ప్రాంతాల్లోకీ చొచ్చుకెళ్లగలిగాయని తెలిపారు. అయితే నక్సల్ చేతుల్లో ఉన్న ప్రాంతాలను పూర్తిగా స్వాధీనం చేసుకుంటే తప్ప ఈ సమస్యను అధిగమించినట్టు కాదన్నారు. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి మండలాలను ఏర్పాటు చేయాలని, ఆ విధంగా మళ్లీ నక్సల్ చొచ్చుకు రావడానికి ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితుల్ని కల్పించాలని బిఎస్‌ఎఫ్ డిజిపి ఉద్ఘాటించారు.