జాతీయ వార్తలు

‘మహా’ అప్పీలుపై జవాబివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బొంబాయి హైకోర్టు నిర్దోషిగా పేర్కొనడాన్ని సవాలు చే స్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తన సమాధానాన్ని తెలియజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనను కోరింది. సర్వోన్నత న్యాయస్థానం గనుక నిర్దోషిగా ప్రకటించినట్లయితే అది సల్మాన్‌ను శాశ్వతంగా నిర్దోషిగా ప్రకటించినట్లవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌పై సల్మాన్‌కు నోటీసులు జారీ చేస్తూ న్యాయమూర్తులు జెఎస్ ఖేహర్, సి నాగప్పన్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా సల్మాన్‌ను నిర్దోషిగా విడుదల చేసేటప్పుడు బొంబాయి హైకోర్టు రెండు విషయాల్లో తప్పు చేసిందని రాష్ట్రప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అన్నారు. కొన్ని సాక్ష్యాల విషయంలో కింది కోర్టు ఎవిడెన్స్ చట్టంలోని 30వ సెక్షన్‌ను తప్పుగా వర్తింపజేయడం జరిగిందనేది మొదటి తప్పని ఆయన అన్నారు. ప్రాసిక్యూషన్ సాక్షి అయిన సల్మాన్ అంగరక్షకుడు, ప్రమాదం గురించి ముందుగా పోలీసులకు సమాచారం అందజేసిన పోలీసు కానిస్టేబుల్ రవీంద్ర పాటిల్ పూర్తిగా నమ్మదగ్గ సాక్షి కాదని, ఆయన చెప్పిన కథనం మిగతా సాక్షుల కథనాలతో సరిపోల్చుకోవలసిన అవసరం ఉందని పేర్కొనడం రెండో తప్పని ఆయన అన్నారు. 2002 సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి ముంబయి శివార్లలోని బాంద్రాలో సల్మాన్‌ఖాన్‌కు చెందిన కారు పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న కొంతమంది మీదుగా ఒక షాపులోకి దూసుకు వెళ్లిన సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సల్మాన్ కారు నడుపుతున్నాడని, అత ను మద్యం మత్తులో ఉన్నాడనేది ప్రా సిక్యూషన్ ప్రధాన ఆరోపణ. కాగా, పాటిల్ స్టేట్‌మెంట్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సల్మాన్ మద్యం మత్తు లో ఉన్నట్లు ఎక్కడా లేదని సల్మాన్ తరఫున వాదించిన కపిల్ సిబల్ అన్నారు. పాటిల్ ఒక పోలీసు అధికారి అని, ఒక వేళ సల్మాన్ మద్యం మత్తులో ఉండి ఉంటే ముందుగా చెప్పాల్సింది అదేనని అన్నారు. మరో ప్రత్యక్ష సాక్షి కమల్ ఖాన్‌ను విచారించలేదని కూడా ఆయన అన్నారు.