ఆంధ్రప్రదేశ్‌

మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్ కోసం రైతుల ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 19: రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోని రైతులు ఫైనల్ మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో ఎక్స్‌ప్రెస్ హైవేలు, అంతర్గత రహదారుల మార్పునకు అవకాశం లేదని సిఆర్‌డిఎ అధికారులు, ముఖ్యమంత్రి స్పష్టం చేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను 29 గ్రామాల్లో ప్రదర్శించిన సమయంలో సుమారు 4 వేలకు పైగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గ్రామాల మధ్యగా ఎక్స్‌ప్రెస్ హైవేలు మాస్టర్‌ప్లాన్‌లో చోటుచేసుకోవటం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తంచేశారు. అంతేకాకుండా గ్రామాల్లో మాస్టర్‌ప్లాన్ ముసాయిదాపై అవగాహన సదస్సులు నిర్వహించినఆందోళనలు చేపట్టారు. రాజధానిలోని 29 గ్రామాలు ఉండగా, 16 గ్రామాల్లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఎక్స్‌ప్రెస్ హైవేలు, అంతర్గత రహదారుల కారణంగా సుమారు 4 వేల ఇళ్లను కోల్పోవాల్సిన పరిస్థితులు ఉండటంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఎట్టిపరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్ హైవేలకు అంగీకరించేది లేదని రైతులు స్పష్టం చేశారు.