క్రీడాభూమి

మహిళల క్రికెట్ లంకపై భారత్ క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, ఫిబ్రవరి 19: మహిళల క్రికెట్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం నాటి చివరి, మూడో వనే్డలో ఈ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. మీడియం పేసర్ దీప్తీ శర్మ ఆరు వికెట్లు పడగొట్టగా, వేదా కృష్ణమూర్తి అర్ధ శతకాన్ని సాధించి, భారత్‌కు విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మహిళల జట్టు 38.2 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. దిలానీ మనోదరా 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్ దీప్తీ శర్మ కేవలం 20 పరుగులకే ఆరు వికెట్లు సాధించింది. అనంతరం భారత్ 29.3 ఓవర్లలో, కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వేదా కృష్ణమూర్తి 61 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, దీప్తీ శర్మ 28 పరుగులు సాధించింది.