క్రీడాభూమి

మీ విధానాలను చర్చించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 19: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లో కేవలం మూడు దేశాల పెత్తనం కొనసాగరాదని, అన్ని సభ్య దేశాలకు సమాన ప్రాతినిథ్యం, వాటా లభించాలని శశాంక్ మనోహర్ చేసిన ప్రకటనపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)లోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, మనోహర్‌కు తిరుగులేని బలమున్న కారణంగా అతను అనుసరిస్తున్న విధానాలపై చర్య అవసరమని అభిప్రాయపడింది. ఐసిసికి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న బిసిసిఐ అధ్యక్షుడు మనోహర్ ఇటీవల దుబాయ్ సమావేశంలో పాల్గొన్నప్పుడు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులకు ఉన్న విశేషాధికారాలను ప్రస్తావించాడు. కొన్ని బోర్డులకే ఐసిసిలో ప్రాధాన్యం లభించడం, మిగతా బోర్డులు నామమాత్రంగా మారడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డాడు. ఐసిసికి వస్తున్న ఆదాయంలో 80 శాతాన్ని ఆర్జించి పెడుతున్న భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులకు ఐసిసి ఆర్థిక వ్యవహారాలపై పూర్తి ఆధిపత్యం ఉండాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నది. ఇటీవలే ఐసిసి నిబంధనావళిని మారుస్తూ, ఐసిసికి సంబంధించిన అన్ని ఆర్థిక అంశాలపై అధికారాన్ని ఈ మూడు దేశాలు హస్తగతం చేసుకున్నాయి. అయితే, ఇటీవలే ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ ఈ విధానాన్ని మార్చేయాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ఐసిసి సభ్యదేశాలన్నిటికీ సమాన వాటా లభించాలని సూచించాడు. త్వరలోనే నిబంధనావళిని సవరించే అవకాశం ఉందని చెప్పాడు.
బిసిసిఐ కార్యవర్గం అసంతృప్తి!
ఐసిసి ఆదాయంలో 80 శాతం మొత్తం భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల నుంచి అందుతున్నది. అందులో 70 శాతం కేవలం భారత్ నుంచే వెళుతున్నది. అసలు క్రికెట్‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా, అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోకుండా, ఐసిసి నుంచి భారీ మొత్తాలను మిగతా క్రికెట్ బోర్డులు అన్యాయంగా తీసుకుంటున్నాయని బిసిసిఐ ఎంతోకాలంగా వాపోతున్నది. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న ఒక అవకాశాన్ని చేజేతులా వదులుకోవడానికి బోర్డులోని ఒక వర్గం సుముఖంగా లేదు. పైగా ఎవరినీ సంప్రదించకుండా, బోర్డు కార్యవర్గ సమావేశాల్లో చర్చించకుండా మనోహర్ ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటాడంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగిన బోర్డు కార్యవర్గ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు తక్కువ కావడంతో, మనోహర్‌ను ఎవరూ ఈ విషయంలో నిలదీయలేదు. ఐసిసి ఆర్థిక అంశాలపై మూడు దేశాలకు మాత్రమే అధికారం ఉండకుండా, అందరికీ సమ వాటా లభించాలన్న మనోహర్ ప్రతిపాదనపై చర్చ జరగాలని కొంత మంది సభ్యులు సూచించారు. అనంతరం ఈ విషయంపై బిసిసిఐ అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మనోహర్‌కు, బోర్డు ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌కు అప్పగించిన బోర్డు పాలక మండలి సమావేశం త్వరలోనే ఒక స్పష్టత వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, మెజారిటీ తమకు లేదన్న కారణంగా ప్రస్తుతానికి నిరసన వ్యక్తం చేయని మనోహర్ వ్యతిరేక వర్గం త్వరలోనే అతని ఏకపక్ష నిర్ణయాలను ఎండగడుతూ ప్రచారం చేపట్టే అవకాశం ఉంది.