రాష్ట్రీయం

మరిన్ని ఫిరాయంపులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపుల ప్రమాదం పొంచి ఉంది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీ మారిన సంగతి తెలిసిందే. జగన్‌కు బంధువైన భూమానే పార్టీ వీడటంతో, పార్టీ ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించనున్నారన్న ప్రచారం జరుగుతుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారెవ్వరిపైనా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడదు కనుక, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ప్రచారం నేపథ్యంలో జగన్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలతో మంతనాలు ఆరంభించారు. అయితే శుక్రవారం ఆయన సిబిఐ కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. అక్కడ కొంత సమయం ఉండటంతో గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో చర్చించారు. అనంతరం ఆయన బంజారాహిల్స్ లోటస్ పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా సాయంత్రం మళ్లీ గుంటూరు, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు సాగించారు.
మనమే అధికారంలోకి వస్తాం: జగన్
‘ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనమే అధికారంలోకి వస్తాం. నేను ఒక్కడినే అధికారాన్ని అనుభవించను. మీలో చాలా మంది మంత్రులవుతారు’ అని వారితో అన్నట్లు సమాచారం. ఎవరూ అధైర్యపడవద్దని, చంద్రబాబు చేసే జిమ్మిక్కులకు, ప్రలోభాలకు లోనుకావద్దని హితవు చెప్పినట్లు తెలిసింది. అధికారం చేపట్టిన రెండేళ్ళలోనే ప్రభుత్వం వ్యతిరేకతను మూట కట్టుకున్నదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. గతంలో ఏ ప్రభుత్వానికీ ఇలా జరగలేదని వివరించారని అంటున్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అందరూ సన్నద్ధం కావాలని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రజలకు చేరువ అవుదామని సూచించినట్టు తెలిసింది. పార్టీని వీడినవారే దురదృష్టవంతులవుతారని అన్నారు. అందుకు ఎమ్మెల్యేలు ప్రతిస్పందిస్తూ ‘మీ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉందని, పార్టీ వీడే ఆలోచన ఎవరికీ లేదు’ అని హామీ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధంగా ఉన్నామని, తమ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉన్నదని వారు జగన్‌కు చెప్పారు.