క్రీడాభూమి

మరికొన్ని గంటల్లో..భీకర సంగ్రామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్
మీర్పూర్, ఫిబ్రవరి 26: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీకర సంగ్రామానికి మరికొద్ది గంటల్లో తెర లేవబోతోంది. ఆసియా కప్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో భాగంగా శనివారం మీర్పూర్ (బంగ్లాదేశ్)లో జరుగనున్న రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్తాన్ చాలా కాలం తర్వాత మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వచ్చే నెల ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్న భారత్, పాక్ జట్లకు ఈ మ్యాచ్ సన్నాహకంగా కూడా ఉపయోగపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో కళంకిత పాక్ పేస్ బౌలర్ మొహమ్మద్ అమీర్ బరిలోకి దిగుతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. స్పాట్-్ఫక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలి ఐదేళ్ల నిషేధంతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన అమీర్ కొద్ది నెలల క్రితం నుంచి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిభావంతుడైన భారత బ్యాట్స్‌మన్లపై నిప్పులు చెరిగి తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అమీర్ పునరాగమనాన్ని భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే స్వాగతించాడు. అయితే స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలిన అమీర్‌కు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో చోటు కల్పించడంపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మిగిలిన ఆటగాళ్ల అభిప్రాయం ఏమిటన్నది తెలియరాలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఫిక్సింగ్‌కు పాల్పడిన శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా వంటి యువ ఆటగాళ్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అత్యంత కఠినంగా వ్యవహరించి వారిపై జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే అమీర్ విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భారత్‌పై పోరులో అతను చక్కగా రాణించగలిగితే కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లోనే కాకుండా పాక్‌లో క్రికెట్‌ను ఆరాధించే సామాన్య ప్రజల విశ్వాసాన్ని కూడా చూరగొనగలుగుతాడు.
ఇటు ధోనీ సేనతో పాటు అటు పాకిస్తాన్ జట్టు కూడా గత నెల రోజుల నుంచి పలు ట్వంటీ-20 మ్యాచ్‌లు ఆడి ఆసియా కప్‌తో పాటు వచ్చే నెల మన దేశంలో జరిగే ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్‌కు తగిన రీతిలో సిద్ధమయ్యాయి. ఇటీవల ఆడిన ఏడు మ్యాచ్‌లలో భారత జట్టు ఆరు విజయాలు సాధించి ప్రపంచ కప్ టి-20 టోర్నీకి చక్కగా సిద్ధమైంది. అలాగే పిఎస్‌ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్)లో ఆడి నేరుగా ఆసియా కప్‌కు వచ్చిన పాక్ ఆటగాళ్లు కూడా ప్రపంచ కప్ టి-20 టోర్నీకి తగురీతిలో సిద్ధమయ్యారు. ప్రపంచ స్థాయి ఈవెంట్లలో టీమిండియాను పాక్ ఎన్నడూ ఓడించలేకపోయినప్పటికీ ఆసియా ఖండ స్థాయిలో జరిగిన ఈవెంట్లలో షహీద్ అఫ్రిదీ సేన బాగానే రాణిస్తోంది. అయితే ఇప్పటివరకూ వనే్డ ఫార్మాట్‌లో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీని ట్వంటీ-20 ఫార్మాట్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి.
భారత్, పాక్ జట్లు ఇంతకుముందు ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా అడిలైడ్ (ఆస్ట్రేలియా)లో జరిగిన మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. ఇది జరిగి సంవత్సరం 11 రోజులు గడిచిన తర్వాత మళ్లీ ఇరు జట్లు ఇప్పుడు మీర్పూర్‌లో తలపడబోతున్నాయి. ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత తటస్థ వేదికలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలని ప్రతిపాదించినప్పటికీ భారత ప్రభుత్వం నుంచి బిసిసిఐకి అనుమతి లభించకపోవడంతో ఆ సిరీస్ కార్యరూపం దాల్చలేదు. దీంతో భారత్, పాక్ జట్ల మధ్య చాలా కాలం నుంచి మ్యాచ్‌లు జరగలేదు.
ఇక బలాబలాల విషయంలో పాకిస్తాన్ కంటే భారత జట్టు పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. ధోనీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో సమష్ఠిగా రాణిస్తూ సరైన సమయంలో ఫామ్‌ను అందిపుచ్చుకుంది. చాలా కాలం నుంచి ధోనీ కోరుకుంటున్నట్లుగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చక్కగా రాణిస్తూ బౌలింగ్‌లోనూ తనవంతు సేవలు అందిస్తుండటంతో భారత జట్టు పూర్తి సమతూకాన్ని సాధించింది. దీంతో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ పాక్ కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. ధోనీని వెంటాడుతున్న వెన్నునొప్పి సమస్య ఒక్కటే భారత జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ నొప్పిని పట్టించుకోకుండా ధోనీ బంగ్లాదేశ్‌తో ఆరంభ మ్యాచ్‌లో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఒకవేళ నొప్పి ఎక్కువై శనివారం ధోనీ బరిలోకి దిగలేకపోతే అతని స్థానంలో ఆడేందుకు పార్థివ్ పటేల్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ శనివారం బరిలోకి దిగే భారత తుది జట్టు విషయంలో ప్రయోగాలకు అంతగా ఆస్కారం లేదు. పొట్టి ఫార్మాట్లలో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా మ్యాచ్ విన్నర్‌గా ఆవిర్భ వించడం టీమిండియాకు ఎంతో సానుకూల అంశం. ఓపెనర్ శిఖర్ ధావన్ నిలకడగా రాణించలేకపోతున్నప్పటికీ తనదైన రోజు వస్తే అతను ఎటువంటి బౌలింగ్‌నైనా తుత్తునియలు చేయగలడనడంలో సందేహం లేదు.
ఇక పాకిస్తాన్ విషయానికొస్తే, యువ ఆటగాడు షర్జీల్ ఖాన్‌తో కలసి మొహమ్మద్ హఫీజ్ ఆ జట్టు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన పాక్ సూపర్ లీగ్ టోర్నీలో షర్జీల్ ఖాన్ చక్కగా రాణించి 299 పరుగులు సాధించాడు. అయినప్పటికీ శిఖర్ ధావన్-రోహిత్ శర్మ జోడీతో పోలిస్తే షర్జీల్-హఫీజ్ జోడీ దిగదుడుపే.

ఇరు దేశాల జట్లు ఇవీ..
భారత్: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆశిష్ నెహ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, అజింక్యా రహానే, పార్థివ్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్భజన్ సింగ్.
పాకిస్తాన్: షహీద్ అఫ్రిదీ (కెప్టెన్), మొహమ్మద్ హఫీజ్, షర్జీల్ ఖాన్, ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్, ఖుర్రం మంజూర్, మొహమ్మద్ నవాజ్, సర్‌ఫ్రాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ ఇర్ఫాన్, మొహమ్మద్ సమీ, వహాబ్ రియాజ్, అన్వర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వాసిం.