హైదరాబాద్

మేయర్ నేతృత్వంలో నేటి నుంచి మైసూరు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: మహానగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా కొత్తగా ఎన్నికైన మేయర్ నేతృత్వంలో నేటి నుంచి రెండురోజుల పాటు పాలకులు, అధికారుల బృందం బెంగుళూరు, మైసూరు నగరాల్లో పర్యటించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ నగరాల్లో మైసూరు సిటీకి నెంబర్ వన్ స్థానం దక్కటంతో అక్కడ అమలు చేస్తున్న పలు విధానాలను ఈ బృందం అధ్యయనం చేయనుంది. ముఖ్యంగా నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నగరంలోని రద్ధీ జంక్షన్లలో స్కైవేలు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే! ఇతర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని మార్గాలను అనే్వషించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో పాలకులు, అధికారుల బృందం నేడు బెంగుళూరు నగరానికి వెళ్లనుంది.
రెండురోజుల పాటు అక్కడ ట్రాఫిక్ నియంత్రణ, ఆధునిక రవాణా వ్యవస్థతో పాటు ఘన వ్యర్థాల నియంత్రణ, పౌరసేవల నిర్వహణ వంటి ఇతరత్ర అంశాలపై అధ్యయనం చేయనుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోనూ పచ్ఛ్ధనాన్ని పెంపొందించటంలో పేరుగాంచిన బెంగళూరు నగరంలో పర్యావరణ పరిరక్షణ, ఆహ్లాదకరమైన వాతావరణం, పట్టణ నవీకరణ అంశాలపై కూడా బృందం దృష్టి సారించనుంది. ఘన వ్యర్థాల నియంత్రం, చెత్త సేకరణ, తరలింపు, శాస్ర్తియంగా ల్యాండ్ ఫీల్ చేయటం వంటి అంశాలపై రెండురోజల అధ్యయనం చేసినానంతరం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, బృందం మున్సిపల్ మంత్రి కెటిఆర్‌కు నివేదికలు సమర్పించనుంది. అనంతరం బెంగుళూరు పట్టణంలో అమలవుతున్న పలు ట్రాఫిక్ విధానాలు నగరంలో అమలు చేసే అవకాశాలపై అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. అక్కడి విధానాలను నగరంలో అమలు చేసేందుకు అవకాశముంటే ఎస్‌ఆర్‌డిపి స్కీం కింద మరిన్ని ఫ్లైఓవర్లు, స్కైవేలను ప్రకటించటంతో పాటు అమలుకు అవకాశమున్న పలు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.