మంచి మాట

కలియుగ ధర్మము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో ఆత్మజ్ఞానం ద్వాపర యుగంలో యజ్ఞయాగాలు, కలియుగంలో దానధర్మాలు గొప్పవని పరాశర స్మృతి తెలియజేస్తుంది. దాన ధర్మాలు చేస్తే స్వర్గం సిద్ధిస్తుందని భవిష్యత్ పురాణం చెప్పుతోంది. కలియుగంలో ధర్మవర్తనమే ఉత్తమమని పెద్దలు చెప్తారు. ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుందంటారు. ధర్మానికి హాని చేస్తే ఆ ధర్మమే హాని చేసినవారిని నాశనం చేస్తుందని మనుస్మృతి చెప్పుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ్భగవాన్ చెప్పింది కూడా ఇదే!
దానధర్మాలంటూ భారీ ఎత్తున చేయమని కాదు. శక్తికి మించి ఏది చేయమని ఎక్కడా చెప్పలేదు. వీటిలో కూడా స్వభావాన్ని, గుణాలను బట్టి మూడు విధాలుగా చెప్పబడ్డాయి. దానం చేయటమే కర్తవ్యమను భావముతో తగిన ప్రదేశములయందును దేశ కాల పరిస్థితులను అనుసరించి అవసరమగు వస్తువులను సమకూర్చుట ద్వారా ప్రాణి సేవ కూడా దానమగును. ఆకలి, అనాధ దుఃఖితులు, రోగులు, బలహీనులు, చిక్షువులు మొదలగు వీరందరికి అన్నవస్త్రాలు, ఔషధాలు ఏ రూపంలోనైనా మాట ద్వారా ఓదార్పు చేత, చేయూతగా చేసేవన్నియు సేవారూపాలన్నీ దానధర్మాల కోవకే వస్తాయి.
పూర్వం నోములు, వ్రతాలు, పూజలు ఇవి అన్నియు దానధర్మాలుగా చెప్పబడ్డాయి. నాడు అయినా నేడు అయినా సృష్టిలో ఏ ప్రాణికి ఏ విధంగా తగిన సమయంలో నిజమైన వాని ఆపద దీన స్థితి నుండి మాటగా చేయూతగా సాయపడటం మనిషి కర్తవ్యంగా చేసుకుంటూ పోవాలి. కర్తవ్యం అనుకుకుంటే తప్పనిసరిగా అనిపిస్తుంది. ప్రతిఫలాపేక్షతో గౌరవ ప్రతిష్ఠలకు, స్వర్గాదుల, పుణ్య ఫలాలకై రోగాల నివృత్తికై బలవంతంగా భయంవలన చేసే దానమైనా, సేవయైనా, రాజసం అనిపించుకుంటా. తనకు, ఇతరులకు ఇబ్బందికరమైనది.
ఇతిహాసాల్లో, పురాణాల్లోను దాతలు కర్ణుడు, రంతిదేవుడు, బలిచక్రవర్తి మొదలైన వారి గూర్చి చెప్పబడింది. వారు చేసినవి నిజమైన దానములు, త్యాగనిరతితో కూడియున్నవి. స్వార్థరహితమైనవి. దానం చేయకపవోడం, చేస్తున్నవారిని చెయ్యనివ్వకుండా అడ్డుకోవడం కూడా మహాదోషం. మరుజన్మలవో దారిద్య్రం వస్తుందని ‘ఆత్మారాముని’ కథవలన తెలుస్తుంది.
దానధర్మాలు గూర్చి హేమాంగుడనే రాజు దానశీలుడు, స్కాంద పురాణంలో అతని దాన ధర్మాల గూర్చి వేదవ్యాసులవారే స్వయంగా అపూర్వమని వర్ణిస్తారు. లెక్కలేనన్ని గోదానం, వీటితోపాటు బ్రాహ్మణులకు, పేదలకు, వికలాంగులకు కావాల్సినంత బంగారం, వజ్రాలు, భూములు, ఇళ్లు, విపరీతంగా దానం చేశాడు. అతనిలో ఒక దోషం ఉందని పురాణ కథనం. అది ఎన్ని దానలు చేసినా జలదానం చేయలేదు, అది ఒకటి. హేమంగ మహారాజుకు అంతటి దానధర్మాలు చేసియున్నా నీచ జన్మలు ఎన్నో వచ్చి బల్లి జన్మ వచ్చింది. శృతకీర్తి ఇంటిలో బల్లిగా జన్మించడం.
శృతకీర్తి ఒక రోజు శృతదేవ అనే బ్రాహ్మణుని మహాజ్ఞాని, సాధకుడు, సపర్యలు చేసి పాద పూజలు చేసి ఆ జలం చుక్క (హేమంగ మహారాజు) బల్లిగా ఉండగా, తన పూరజన్మ తెలియడం శృతదేవను అడిగి తన దోషం తెలిసికొనడం. బ్రాహ్మణునివలన దోష నివారణ, పాప ప్రక్షాళన జరిగి తిరిగి సాధనా శరీరం పొందారు.
దానిమిచ్చేటపుడు పాత్రత విషయం పట్టించుకోకపోవడం, పండితులకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, దుష్టులకు అయోగ్యులకు దానమివ్వడం వలన దోషం వచ్చింది. శాస్త్ర ప్రకారం గౌరవం, ఆదరణ, యోగ్య ఉన్నవారికే సత్కారం, సన్మానాలు చేయాలి. -

ఎ.నాగభూషణరావు