ఐడియా

మొండి మరకలు వదిలిద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో ఫ్లోరింగ్‌పై పడ్డ మరకలు ఓ పట్టాన వదలవు. ముఖ్యంగా వంటిట్లో జిడ్డు మరకలు మనల్ని వెక్కిరిస్తుంటాయి. వీటిని వదిలించాలంటే గృహిణులకు తలకుమించిన భారం అవుతుంది. అలాగే ఎన్నిసార్లు ఉతికినా దుస్తులపై పడ్డ మరకలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి మొండి మరకలు పోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే మాయం అవుతాయి.
జిడ్డు మరకలు పడిన వెంటనే దుస్తులపై మొక్కజొన్న పిండి చల్లితే.. ఆ పిండి మరకల జిడ్డును పీల్చేసుకుంటుంది.
నిమ్మరసం, వెనిగర్ సమపాళ్లలో కలిపి.. ఓ గినె్నలోకి తీసుకోవాలి. మరక ఉన్న ప్రాంతాన్ని ఈ మిశ్రమంలో నానాబెట్టి ఉతకాలి. ఇలా చేయడం వల్ల మరకలే కాదు దుస్తుల నుంచి వచ్చే దుర్వాసనలూ దూరమవుతాయి.
జిడ్డు పడ్డ చోట దుస్తులను అదేపనిగా ఉతకటం వల్ల అక్కడ తెల్లగా పాలిపోయి పోగులు విడివడినట్లుగా తయారవుతాయి. అందుకే నీళ్లకు బదులు టాల్కం పౌడర్ లేదా బేబీ పౌడర్ మరక మీద చల్లి కాసేపు ఉంచితే, పౌడర్‌లోని తేమ మరక మీద జిడ్డును పీల్చేసుకుంటుంది. ఆ తరువాత ఉతికితే మరక మటుమాయం అవుతుంది.
వంటసోడాలో నీళ్లు కలిపి మిశ్రమంలా చేయాలి. దాన్ని మరక ఉన్నచోట రాసి పక్కనుంచాలి. అరగంటయ్యాక డిటర్జెంట్ పొడి కలిపిన నీళ్లలో ఆ దుస్తుల్ని నానబెట్టి ఉతికితే సరిపోతుంది. ఒకేసారి మరక పోనట్లయితే రెండు మూడుసార్లు ఈ విధంగా చేస్తే సరిపోతుంది.