మెయిన్ ఫీచర్

పని‘మనిషే’ కాదా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యకాలంలో వచ్చే సీరియల్స్‌ని చూస్తుంటే మనకు చాల హాస్యాస్పదంగా తోస్తుంది. సంభాషణా రచయితలకు కనీస పరిజ్ఞానం లేనట్లుగా తోస్తుంది. ఇంటి కోడళ్ళను లేదా వారి నాశ్రయించుకున్న మనుషులను పనిమనుషులుగా పదే పదే దెప్పిపొడవడం జరుగుతోంది. కొండొకచో తీవ్రంగా అవమానించటం, హింసించడం జరుగుతుంది. పూర్వం సినిమాలలో పనిమనిషికి ఒక ఉన్నత స్థానం ఉండేది. పనిమనుషులను మన మనుషులుగా, బాబాయ్, అమ్మా వంటి పేర్లతో వరుసలతో పిలుస్తూ గౌరవించేవారు. వారు కూడా కష్టసుఖాలలో చేదోడు వాదోడుగా నిలిచేవారు. కన్న తల్లిదండ్రుల ప్రేమను అందించినట్లుగా చూపించేవారు. అపుడు మానవ సంబంధాలు అంత బలీయంగా ఉండేవి. ఒకరిపై ఒకరికి మమతానురాగాలు, గౌరవం ఉండేవి.
పనిమనుషులు నిజానికి ఏ ఇంటిలోనూ అంత హీనంగా ఉంటారా? అంటే లేదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. యజమానులు ఇచ్చే జీతం కంటే వారిచ్చే గౌరవానికి, ప్రేమకీ పనిమనుషులు ఉంటారు. చలనచిత్రాలు, నేటి సీరియల్స్‌లోలాగా కాఫీ మొహన పోస్తే తుడుచుకుని వెళ్ళేంత హీనంగా ఎవరూ లేరు. చాలా ఇళ్ళల్లో పనిమనిషికి నచ్చిన టిపిన్స్ చేసి పెట్టడం, రోజూ ఒకే టిఫిన్ కకుండా చూడడం, చీరలు, మామూళ్ళు, కూరలు వంటివి ఇవ్వడం మనందరికీ తెలిసిందే. మరి ఇంత హృదయవిదారకంగా తక్కువ చేసి చూపించే మీడియాని ఏమనాలి? అగౌరవంగా చూస్తే పనిమనిషేంటి? కొడలేంటి? ఎవరూ ఎక్కువకాలం నిలువరు. ఒకరి క్రింద పనిచేసేవారెవరైనా ఉద్యోగులే గదా! చిన్నా పెద్దా తేడా ఉంటుందంతే. ఎవరైనా పనిచేయనిదే నాలుగు వ్రేళ్ళు నోటిలోకి పోవు.
నిజంగా పనిమనుషులను అంత నీచంగా చూసే క్రూర స్వభావం ఎవరికైనా ఉంటే తప్పనిసరిగా మార్చుకోవాలి. ఎప్పుడైనా ఎవరినీ వారి అసహాయత జూచి బాధించకూడదు. అహంకారంతో ప్రవర్తించకూడదు. సహనంగా వున్నవారిని పదే పదే అసహనం వచ్చే విధంగా రెచ్చగొట్టకూడదు. అవకాశం వస్తే గదిలో పిల్లి అయినా పులిలా మారి గాండ్రిస్తుంది. ఇప్పుడు అసహాయంలో పడినవారు, వారి అధీనంలోకి మనం వచ్చినపుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని దెబ్బకు దెబ్బతీస్తారు. అది పనిమనిషైనా, కోడలైనా. అందుకే అహంకారంతో వేధించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులారా! తస్మాత్ జాగ్రత్త!
..................................................
బ్రతుకుతెరువుకోసం వచ్చినవారిని గౌరవించే సంస్కారం అలవరచుకోవాలి. ‘‘నీ వలెనే నీ పొరుగువారిని ప్రేమించుము’ అంటాడు జీసెస్. మనకు పనికిరానివి, పాడయినవి, పనిమనుషులకు పెట్టి రోగాలపాలు చేయవద్దు. ఎంగిళ్ళు అసలు పెట్టవద్దు. నీవిచ్చే జీతంకోసం తప్పక నీతో మాటలు పడేవారు, అవకాశం వస్తే తప్పుకుంటారు. కొంతమంది ఇంట్లో అజాగ్రత్తగా ఉండి ఎక్కడెక్కడో తమ విలువైన వస్తువులు పారేసుకుని పనిమనుషులను పోలీసు స్టేషన్ దాకా తీసుకెళ్లిన దాఖలాలు ఉన్నా. తరువాత అది వాళ్లింట్లోనే దొరికిన సందర్భాలూ ఉన్నాయి. అక్కడక్కడా ఎవరో ఒకరు అలాంటి తప్పు చేస్తే అందరినీ ఒకే విధంగా అనుమానించడం కరెక్టు కాదు.

-బి.హెచ్.వి.రమాదేవి