క్రీడాభూమి

మలేసియా మాస్టర్స్ టోర్నీలో సత్తా చాటిన సింధు, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనాంగ్ (మలేసియా), జనవరి 22: మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లు పివి.సింధు, కిదాంబి శ్రీకాంత్ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. శుక్రవారం వీరు ఇక్కడ తమతమ ఈవెంట్లలో ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ‘తెలుగు తేజం’ పివి.సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో ఇండోనేసియా క్రీడాకారిణి లిండావేణి ఫనెత్రిపై 21-10, 21-10 గేముల తేడాతో అలవోకగా విజయం సాధించింది. గత ఏడాది మకావూ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సింధు ఈ మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి తొలి గేమ్‌లో 5-1 ఆధిక్యత సాధించింది. ఆ తర్వాత ఫనెత్రి పుంజుకుని 7-7తో స్కోరును సమం చేసినప్పటికీ సింధు విజృంభించి 21-10 తేడాతో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ ఇదేవిధమైన పరిస్థితి పునరావృతమైనప్పటికీ దూకుడు పెంచి పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చిన సింధు మరోసారి 21-10 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఫనెత్రితో ఇప్పటివరకూ తొమ్మిదిసార్లు తలపడిన సింధుకు ఇది ఏడో విజయం. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన సింధు ఫైనల్‌లో స్థానం కోసం కొరియాకు చెందిన టాప్ సీడ్ క్రీడాకారిణి సంగ్ జీ హ్యున్‌తో గానీ జపాన్‌కు చెందిన ఐదో సీడ్ క్రీడాకారిణి సయాకా సాటోతో గానీ తలపడుతుంది.
కాగా, ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన హువాంగ్ యుక్సియాంగ్‌పై సునాయాసంగా విజయం సాధించాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-15, 21-14 తేడాతో గెలుపొంది కేవలం 33 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతున్న శ్రీకాంత్ శనివారం ఫైనల్ బెర్తు కోసం మలేషియాకు చెందిన ఇస్కందర్ జుల్కర్‌నైన్ జైనుద్దీన్‌తో తలపడతాడు. శ్రీకాంత్ గత ఏడాది సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రీ గోల్డ్ టోర్నమెంట్‌లో జుల్కర్‌నైన్‌ను చిత్తు చేశాడు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరు మూడు గేముల పాటు సాగింది.