ఐడియా

మనమూ స్నేహితులమైతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య పిల్లలంతా వాట్స్‌అప్‌ల్లోనో, లేక ఫేస్‌బుక్‌ల్లోనో కూరుకుపోతున్నారు. చిరునవ్వైనా, పగలబడి నవ్వైనా అది వాళ్లఒక్కరికే సొంతం అన్నట్టు వారిలో వారే చేస్తుంటారు. కాకపోతే వారిచేతిలో ఫోను అంత తప్పితే మరొకటి ఉండదు.
ఎదురుగా ఎవ్వరున్నా పట్టించుకోరు. కొందరు వీటితో ముందుకెళ్లుతుంటే మరికొందరు వెనక్కు మళ్లుతున్నారు. ఎవరో ఏదో మోసం చేశారనో లేక ఇంకేదో కారణాలతో తమ జీవితాలకు అంతిమ గీతం కూడా పలుకుతున్నారు.
ఇలాంటి వాటి బారిన పడకుండా మన పిల్లలను మనం కాపాడుకోవాలి అంటే ముందునుంచే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. అట్లా అని వారితో హద్దుల గురించి చెప్పితే అసలుకు మోసం వస్తుంది. వారు ఏమీ చెప్పకుండా దాయడమో లేక ఎవరితోను మాట్లాడకుండా ఉండిపోవడం చేస్తారో దీనివల్ల వారికే కాదు పెద్దలకూ నష్టమే. అందుకే వారిని సున్నితమైన మనసుతో వారిని అర్థం చేసుకోవడమే మేలు. ఎదిగే వయసు పిల్లల్లో మాటకారితనం వారి కెరీర్‌కి దోహదపడుతుంది. ఎదుటివారిని గేలి చేసినా అది గేలిచేయంచుకుంటున్నవారి మనసు నొప్పించకుండా ఉంటే మంచిది అన్న విషయం వారికి మెల్లగా తెలియపర్చాలి. నలుగురితో కలసి తిరగడం వల్లే చతురతగా మాట్లాడ్డం, జోక్స్ వేయడం భవిష్యత్‌లో కొత్త చోట్లకి వెళ్లినా అక్కడివారితో త్వరగా కలిసిపోయే గుణం, చొరవగా దూసుకుపోయే తత్వం అలవడతాయి. అందరినీ ఆకట్టుకునే తత్వం తమదే అవుతుంది.
వారికి ఇరుగుపొరుగులతో మాట్లాడడం, స్నేహితుల ఇళ్లకు వెళ్లి మాట్లాడడం ఏదైనా కలసి కూర్చుని మాట్లాడుకొంటే వచ్చే ఆనందం ముందు ఏ అంతర్జాల మహిమా పని చేయదు అన్న నిజాన్ని వారికి తెలియచెప్పాలి. ఒత్తిళ్లని పోగొట్టే సరదా నవ్వులు, ఒంటరితనం, ఆత్మన్యూనతల్ని దరిచేరనివ్వని స్నేహాలను వారికి ఉండేందుకు మనమూ తోడ్పడాలి. అట్లాంటపుడే వాళ్ల స్నేహితులు కలసినప్పుడు వారు చేసే అల్లరికి హద్దులుండవు. అది చూసి పెద్దవారు ఏమిటా వెకిలి చేష్టలు అనడమో, లేక గట్టిగా మందలించడమో చేస్తే వారు ఆత్మనూన్యతకు గురవుతారు. తమ స్నేహితులల్లో తప్పు చేసినవారిగా వారిని వారు భావించుకుంటారు. ఇట్లాలేకుండా వాళ్ల స్నేహితులను కూడా అప్యాయంగా పిలవడం వారు చేసే అన్నీ పనుల పైన ఒక కన్నువేసినా అది ఏదో కనిపెట్టాలన్న ధ్యాసతో కాకుండా మనమూ వాటిని తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నామని తెలియచెప్పడం కావాలి. వాళ్లకు ఏ బాధ కలగకుండానే సమాజిక స్పృహను కలిగించాలి. అపుడే వాళ్లు ఆత్మనూన్యతకు గురికారు. ఏది చెప్పినా అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఒక స్నేహితుల్లాగే వారికి సలహాలివ్వాలి. పైగా ఆ సలహాలు వారికి నచ్చేవిధంగాను నష్టం కలగని విధంగా ఉండాలి. ఎవరితో ను వారిని పోల్చి చూపి తక్కువ చేసి మాట్లాడకూడదు. వారిని వారిలో ఉన్న చైతన్యాన్నో లేక నేర్పరితనాన్నో గుర్తించి వారిని ప్రోత్సహించాలి. అపుడు తల్లిదండ్రులు వారు ఎక్కడికెళ్లినా ఏ అంతర్జాలాన్ని ఎంత సేపు చూసినా భయలేకుండా ఉండగలుగుతారు.
.....................................................................................................

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- శ్రీలత