Others

ఆప్యాయతలుంటేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకు ముందుకాలంలో స్ర్తిలకు తగినన్ని సదుపాయాలు ఉండేవికావు. నీళ్లు ఎంతో దూరంనుంచి బిందెలతో మోసుకొని వచ్చేవారు. ఇడ్లీలు, దోసెలుకావాలంటే పనికట్టుకుని మధ్యాహ్నంపూట రుబ్బుకునేవారు. ఇక పొడుల్లు, పచ్చళ్లు అంటే అవీ రోటి దగ్గర కూర్చుని చేసుకొనేవారు. అపుడు స్ర్తిలు ఇంటి వ్యవహారాలన్నీ ఒంటిచేత్తో చేసేవారు.బయట పనులు చేసేవారు కాదు అని వారికి పేరుండేది. కాని వారు పిల్లలకు ఫీజు కట్టాలన్నావారే, కూరగాయలు, పప్పులు ఉప్పులు ఏవి ఇంట్లో వంటకు ఉపయోగించేవి కావాలన్నా వారే. గినె్నలు, చెంబులు కూడా వారే కొనేవారు. ఇంట్లో కనిపించే వస్తువులన్నీ వారే కొనేవారు. పైగా ఇవి ఎప్పుడు కొన్నారో కూడ కొంతమంది మగవాళ్లు పట్టించుకొనేవారుకారు. వారికి ఎంతసేపు ఆఫీసు లేదా పొలం బయట పనులు భలే సంపాదించేస్తున్నాం అనే చెప్పుకునేవారు.
కాని కొందరిళ్లు పొందికగా దారిద్య్రమున్నా అది బయటకు కనిపించకుండా ఉండేవి. మరికొందరిళ్లు ఆర్భాటాలు అట్టహాసాలకు నెలువుగా ఉండేది. ఇంట్లో ఏమున్నాయని పట్టించుకోని మగరాయుళ్లు ఇంటికి అతిథులను కూడా పిల్చుకుని వచ్చేవారు. వారి కడుపు నింపాల్సిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిదే అయ్యేది. అపుడు ఇపుడు అనే తేడా లేకుండా ఎవరో ఒకరు చుట్టాలు కూడా ఉంటూ ఉండేవారు. పైగా ఇంటి యజమాని ఎవరితో నైనా ఒకరు పక్కన లేకుండా భోజనం చేసే అలవాటు లేనివారు కూడా అయి ఉండేవారు అప్పుడు. అందుకేఅపుడు ఇల్లాలిని చూసి ఇంటి వైభోగం చెప్పవచ్చు అనేవారు.
ఇప్పుడు కాలం మారింది. ఆడమగ భేదం లేకుండా సంపాదనా పరులు అయ్యారు. కొన్ని కుటుంబాల్లో అయితే పిల్లలు ఒకటో క్లాసు నుంచే నువీ చదువు చదివితే ఈ ఉద్యోగం వస్తుంది. అపుడు నీ జీతం ఇంత వుంటుంది. కనుక నీ జీవితాన్ని నీవీలాగా ప్లాను చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు పోయి భార్యాభర్త పిల్లలు వారు మాత్రమే ఇల్లు అనే స్థాయికి వచ్చేసి ఉన్నారు. కాని ఇపుడు ఇల్లాలికి బోలెడన్నీ సదుపాయాలు అన్నీ స్విచ్ వేస్తే అయిపోయేవి. రెడ్‌మేడ్ పుడ్ కూడా దొరుకుతుంది. ఏ మాత్రం కాలు కదపకుండా పనులుచేసే వీలున్న సమయం ఇది. కాని ఇపుడు స్ర్తిలు ఇంటా బయట పనులు చేస్తున్నారు. మేమూ సంపాదనా పరులమే అని చెప్పుకుంటున్నారు. కాని వారి ల్లు ఆధునిక సదుపాయాలతో ఉన్నా ఆ ఇంటిలో ఆనందం మాత్రం అంతంత మాత్రమే. ఇంటికి చుట్టాల రాక తగ్గిపోయింది. అత్తమామలే చుట్టాలు. అన్నదమ్ములు బంధువుల కింద మారిపోయారు. ఇక పిల్లలకైతే ఇంటికి వచ్చిన వారు ఎవరో కూడా వారు పట్టించుకోరు. వారి రూమ్‌లోంచి బయటకు వచ్చి ఒక్క హాయ్ చెప్పివెళ్లిపోతారు. ఇది నేటి ఇల్లాలి పరిస్థితి. ఇపుడూ ఇల్లాలిని చూసి ఇంటి ని చూస్తే ఏం జరుగుతుంది. ఇక్కడ ఎవరి సంపాదన వారిదే. ఎవరి ఖర్చులు వారివే. ఇల్లు అన్నది ఒక్కటే కాని అనుబంధాలు అప్యాయతలూ బంధాలు, అనుబంధాలు పలుచబడిపోయాయి. దీనికి కారణమేమిటో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అనుబంధాలు అప్యాయతలు లేని ఇల్లు ఎంత బాగుంటాయి? ఎన్ని ఆధునిక సదుపాయాలున్నా మనుష్యుల మధ్య అనురాగ బంధం లేకపోతే ఆ ఇల్లు హోటల్‌ను తలపిస్తుందే కాని ఇల్లు అనిపించదు. మరి మనిషి సంఘజీవి కదా. ఇట్లా ఎన్నాళ్లు ఉండగలడు. మన వాళ్లతో కలసి ఉండే ఇల్లు చూడండి. వారి మధ్య ఉండే అనురాగం అప్యాయతలు చవిచూడండి. చూడనివ్వండి. అపుడు ఆ ఇల్లు సంగతిని మీరే అంచనావేసుకోండి. మీరే మీ భావి జీవితానికి అధినేతలు. ఇల్లాలే ఇంటి మహారాణి కనుక ఆ ఇంటిని నందనవనం చేయాల్సిందే ఆ మహారాణినే.

-ఎన్.లక్ష్మి