రాష్ట్రీయం

మీరే న్యాయ ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: ప్రస్తుత న్యాయ విచారణ పద్ధతుల్లో వేగవంతమైన మార్పు తెచ్చి, వినియోగదార్లకు న్యాయవ్యవస్థను మరింత చేరువ చేసేందుకు కోర్టులు, పోలీసు విధానాలు, ప్రజల ఆకాంక్షలకు మధ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వారధిగా పనిచెయ్యాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల తొలి సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలో 2014 లెక్కల ప్రకారం వివిధ న్యాయస్థానాల్లో నమోదైన కేసుల్లో 25.7 శాతం మాత్రమే నేర నిర్ధారణ జరిగి శిక్షలు పడ్డాయన్నారు. వేగవంతమైన న్యాయ విచారణ ప్రాథమిక హక్కుగా గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడిన సంగతిని గుర్తుచేశారు. విచారణ సమయంలో యాంత్రికంగా హాజరై కేసు వివరాలు వెల్లడిస్తే, ఆ కేసు విషయంలో పిపిలు విఫలమైనట్టే భావించాలని, అటువంటి కేసులు కోర్టుల్లో వీగిపోతాయన్నారు. ఏ వ్యవస్థలోనైనా వృత్తిపరమైన నైపుణ్యం లేకపోవడం సహించరానిదని, ప్రాసిక్యూషన్ కూడా ఇందుకు మినహాయింపు కాదన్నారు. ప్రాసిక్యూటర్లకు వృత్తిపరమైన శిక్షణ లోపించడం, లైబ్రరీ సౌకర్యం కల్పించకపోవడం, సంబంధిత కేసుల పోలీసు అధికారులను జవాబుదార్లుగా చేసి ప్రాసిక్యూషన్‌లో సమన్వయం సాధించలేకపోవడం, ప్రాసిక్యూటర్ చేపట్టగలిగిన కేసుల సంఖ్యపై స్పష్టమైన అధ్యయనం జరగకపోవడం వంటివి ప్రాసిక్యూటర్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణాలని ఎన్‌వి రమణ పేర్కొన్నారు. నేర అభియోగం వేధింపుగా మారకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. నేరస్తులకు శిక్ష పడటం అవసరమేగాని దీన్ని సాధించడంలో పరిధులు అతిక్రమించకూడదని ఉద్భోదించారు. పిపి న్యాయానికి ఏజెంటుగా భావించాలని, పోలీసు వ్యవస్థకు ప్రతినిధిగా నిర్భయంగా వ్యవహరించాలని సూచించారు. విశాఖలో న్యాయవాద వృత్తిలో రాణించిన రచయిత రాచకొండ విశ్వనాధశాస్ర్తీ (రావి శాస్ర్తీ) రచనల్లో న్యాయ వ్యవస్థ పనితీరును నిశితంగా, పరశీలనాత్మకంగా విశే్లషించిన తీరు ప్రశంసనీయమన్నారు. ఆ రచనల్ని ప్రతి న్యాయాధికారి, న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తప్పనిసరిగా చదవాలని సూచించారు. ఆయన రచనల్లో పేర్కొన్న విధంగా న్యాయమూర్తులు హెడ్ కానిస్టేబుల్ వైపు చూడొద్దని రమణ చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరి కమిషన్ (ఎపిఇఆర్‌సి) అధ్యక్షులు జస్టిస్ జి భవానిప్రసాద్ మాట్లాడుతూ, ప్రాసిక్యూషన్ డైరక్టరేట్, ప్రాసిక్యూటర్ల సర్వీసు నిబంధనల ఏర్పాటులో జస్టిస్ ఎన్‌వి రమణ పాత్ర మరువలేనిదన్నారు. ఇందకు అందరూ జస్టిస్ రమణకు కృతజ్ఞులై ఉండాలన్నారు. ఇప్పటికీ ప్రాసిక్యూటర్లకు సరైన వసతులు, సిబ్బందిని సమకూర్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కేసుకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని విచారణ సమయంలో కోర్టుకు సమర్పించడం ద్వారా కేసు పురోగతికి దోహదపడాలన్నారు. న్యాయానికి నిలువుటద్దంలా పిపిలు పని చేయాలన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు, పిల్లలపట్ల నేరాలు అధికం అవుతున్నాయని, అటువంటి వారిపట్ల ప్రాసిక్యూటర్లు మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలన్నారు. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులందరితో బాటు ప్రాసిక్యూటర్లు కూడా ప్రజా సేవకులుగానే పనిచెయ్యాలని సూచించారు. సమావేశంలో కృష్ణాజిల్లా ప్రిన్సిపాల్ సెషన్స్ జడ్జి పి రవీంద్రబాబు, రాష్ట్ర న్యాయ కార్యదర్శి సిఎన్‌ఎన్‌వి దుర్గాప్రసాద్, ప్రాసిక్యూషన్స్ డైరక్టర్ సిసి సుబ్రమణ్యం, డెప్యూటీ డైరక్టర్ అజయ్‌ప్రేమ్‌కుమార్, కేడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి శ్రీనివాసులరెడ్డి, కృష్ణాజిల్లా న్యాయాధికారులు, వివిధ జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.