ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే చెవిరెడ్డికి బెయల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 23: చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని శనివారం పోలీసులు అరెస్టు చేసి, ఇక్కడ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది వైఎస్సార్ సిపి ఇచ్చిన బంద్ సందర్భంగా వైఎస్సార్ సిపి కార్యకర్తలు ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్‌పై దాడి చేసి, ఎస్‌ఐని గాయపరిచారు. ఈ కేసులో అరెస్టు అయిన జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ తదితరులను అరెస్టు చేసి సెంట్రల్‌జైలుకు తరలించారు. సెప్టెంబర్ 7న వారు బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో నగరంలో పోలీసు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పోలీసు ఆంక్షలను ఉల్లంఘించి కంబాలచెరువు వద్ద వైఎస్సార్‌సిపి నాయకులు సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో చెవిరెడ్డితో పాటు, జక్కంపూడి విజయలక్ష్మి, రాజా, గణేష్‌లు ఎఎస్పీ సిద్ధారెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించడంతో పాటు పోలీసులను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. దీనిపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి జక్కంపూడి కుటుంబం కోర్టుకు హాజరుకాగా, చెవిరెడ్డి సమన్లు అందుకోకపోవడంతో న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒక కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నెల్లూరు సెంట్రల్‌జైలులో ఉన్నట్లు తెలుసుకున్న త్రీటౌన్ సిఐ, ఆయన సిబ్బంది ఆయనను పిటి వారెంట్‌పై శనివారం రాజమహేంద్రవరం తీసుకుని వచ్చి మూడో జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏడుగురు డిఎస్పీలతో పాటు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో తిరిగి ఆయనను పోలీసు వాహనంలో నెల్లూరుకు తరలించారు.
టిడిపి కక్ష సాధింపు: చెవిరెడ్డి
కోర్టుకు హాజరై, తిరిగి వెళుతున్న చెవిరెడ్డి విలేఖర్లతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కక్ష సాధింపు ధోరణితో అక్రమ కేసులను బనాయిస్తోందని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు అనైతికమన్నారు.