రాష్ట్రీయం

మంచి నీరు ఫ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రతి ఇంటికీ తాగు నీరు ఉచితంగా అందిస్తామని, బిల్లు వసూలు చేసేదిలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. సీమాంధ్ర నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచీ వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారి రక్షణ బాధ్యత తమదేనని, సెటిలర్లు అనే పదాన్ని నిషేధిస్తామని పేర్కొంది. గ్రేటర్ ఓటర్లకు మొత్తం 28 హామీలతో టిపిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం విలేఖరుల సమావేశంలో ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను తెరాస చెడగొట్టిందని దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెటిలర్లను ఉద్దేశించి జాగో-బాగో అని పిలుపునిచ్చి వారిలో అభద్రతా భావం సృష్టించిందని విమర్శించారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సెటిలర్ల రక్షణ తమదేనని మాట్లాడుతోందని విమర్శించారు. హైదరాబాద్ గురించి మాట్లాడే అర్హత తెరాసకు లేదన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం తమ ప్రభుత్వ హయాంలో జరిగితే ఇప్పుడు తెరాస నేతలు ఫ్లెక్సీ, బ్యానర్లపై మెట్రో రైలు ఫొటోలు పెట్టుకుంటున్నారని ఉత్తమ్ విమర్శించారు. మైట్రో రైలు రూట్ విషయంలో సర్కారు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలే జాప్యానికి కారణమన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం, పివి ఎక్స్‌ప్రెస్ హైవే, విద్యుత్ ప్రాజెక్టులు, కృష్ణా నదీ జలాలు తీసుకురావడం, కృష్ణా రెండో దశ పనుల ప్రారంభం తమ ప్రభుత్వ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలను పూర్తి చేయిస్తూ, ఆ ఫొటోలను తెరాస వాడుకుంటోందే తప్ప కొత్తగా ఏ ఒక్క పథకం చేపట్టలేదన్నారు.
స్కై-వేలు సాధ్యం కాదు
నగరంలో స్కై-వేలు, మల్టీ లెవల్ రోడ్లు ఆచరణ సాధ్యం కాదన్నారు. మంత్రి కెటిఆర్ వైఫై గురించి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఇలాగే హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రతి ఇంటికీ పైపు లైన్ ద్వారా వంట గ్యాస్ అందిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మార్చి వేసి అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక పద్ధతిలో నిర్మిస్తాం. నగరంలో రోడ్లను విస్తరిస్తాం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తాం, చెత్తతో విద్యుత్తుత్పకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతాం, రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం, సోలార్ విద్యుత్తుత్పికి చర్యలు తీసుకుంటాం, గృహా నిర్మాణం చేపడతాం, విద్య, వైద్యం, పరిశుభ్రత, సోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, హైదరాబాద్ చరిత్ర-సంస్కృతిని కాపాడుతాం, వీధుల్లో బిక్షాటన చేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపిస్తాం, శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తాం, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను పారిశ్రామిక వాడలకు తరలిస్తాం, ఆటో రిక్షా, టాక్సీ డ్రైవర్లు మీటర్ల ప్రకారమే నడిపించేలా చర్యలు తీసుకుంటాం, మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తాం, ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తాం అని ఇంకా పలు వరాలతో టి.పిసిసి ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ‘అప్నా షహర్, సబ్‌కా-షహర్, హమ్ సబ్‌కా షహర్ హైదరాబాద్’ అనే నినాదాన్ని మ్యానిఫెస్టోపై పేర్కొంది. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాం (2004-14) గోల్డెన్ డికేడ్‌గా పేర్కొంటూ మరో డాక్యుమెంట్‌నూ ఉత్తమ్ ఆవిష్కరించారు.