బిజినెస్

మూడేళ్ళలో 6 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, జనవరి 24: రానున్న మూడేళ్ళలో 6 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధించి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ నిలిచేందుకు, తద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం, బంగారు తెలంగాణ సాధనకు టిఎస్‌జెన్‌కో కృషి చేస్తోందని టిఎన్‌జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా పాల్వంచలో కొత్తగా నిర్మిస్తున్న కెటిపిఎస్ 7వ దశ యూనిట్‌లో ఇఎస్‌పి కంట్రోల్ కేంద్రం, బాయిలర్ కాలమ్స్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఐదవ దశలో కొత్తగా నిర్మించిన సర్వీసు బిల్డింగ్‌నూ ప్రారంభించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిఎండి మాట్లాడుతూ భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో 1,080 మెగావాట్లు, కెటిపిఎస్‌లో 800 మెగావాట్లు, దామరచర్లలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు అధికారులు, ఇంజనీర్లు శ్రమించాలని కోరారు. కాగా, ట్రాన్స్‌మిషన్ లైన్ల శక్తిసామర్థ్యం పెంపు కోసం బృహత్తర ప్రణాళికను తయారుచేసినట్లు తెలిపారు. వచ్చే వేసవి నుండి రైతాంగానికి 9 గంటలు విద్యుత్ సరఫరా అయ్యేవిధంగా జెన్‌కో పని చేస్తోందన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు.