జాతీయ వార్తలు

మహాత్మునికి అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జనవరి 25: జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని రాజస్థాన్‌లోని దూదు జిల్లాలో కొందరు సంఘవిద్రోహ శక్తులు అపవిత్రం చేశారు. ఈ విగ్రహాలపై ముందూ వెనక ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ ‘ఐసిస్’ సందేశాలను రాశారు. ఈ విషయం సోమవారం తెల్లవారుజామున బయటపడింది. ఇవన్నీ హెచ్చరిక సందేశాలుగానే ఉన్నాయని, ఇందుకు పాల్పడ్డవారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జైపూర్ ఐజి డి.సి.జైన్ తెలిపారు. మహాత్ముడి విగ్రహాలపై ఈ రాతలను గుర్తించి స్థానిక ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ‘ఐసిస్ జిందాబాద్’, ‘జనవరి 26న విధ్వంసం సృష్టిస్తాం’ అన్న హెచ్చరిక సందేశాలు గాంధీ విగ్రహంపై రాసివున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పేరును కూడా దుండగులు రాసినట్టుగా చెబుతున్నారు. ఈ సంఘటనతో స్థానికంగా అలజడి చెలరేగింది. ఉద్దేశపూర్వకంగా గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేశారని, మరికొన్ని గంటల్లో గణతంత్ర వేడుకలు జరగనున్న తరుణంలో ఉద్రిక్తతలు రేకెత్తించడానికి ఈ చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.