బిజినెస్

మూడు వారాల్లో రూ. 10 వేల కోట్లు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: విదేశీ మదుపరులు భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులంటేనే పరుగందు కుంటున్నారు. తమ పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ల కంటే రుణ మార్కెట్లు పదిలమని భావిస్తున్నారు. అవును మరి. ఈ నెల (1-22)లో ఇప్పటిదాకా రుణ మార్కెట్లలోకి 2,353 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)లు.. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా 9,963 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. స్టాక్ మార్కెట్లలోకి 53,296 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినప్పటికీ, తిరిగి 63,259 కోట్ల రూపాయల పెట్టబడులను ఉపసంహరించుకున్నారు. గడచిన మూడు వారాల ట్రేడింగ్‌ను గమనిస్తే.. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న ఆందోళనలు, ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం, గ్లోబల్ మార్కెట్‌లో రికార్డు స్థాయలో పడిపోయన ముడి చమురు ధరలు వంటివి అటు విదేశీ స్టాక్ మార్కెట్లను, ఇటు దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలకు గురిచేశాయ. ముఖ్యంగా ఎగుమతుల మందగమనంతో పెరిగిన వాణిజ్య లోటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించిన నిరాశాజనక ఆర్థిక ఫలితాలు భారతీయ స్టాక్ మార్కెట్ల లాభాలకు అడ్డుకట్ట వేశాయ. అయతే చైనా, ఐరోపా సమాజం ఉద్దీపన ప్యాకేజీల అంచనాలపై ప్రకటనలు స్టాక్ మార్కెట్లను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాయ. ఇకపోతే గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ స్వల్పంగా 19.38 పాయింట్లు పడిపోయి 24,435.66 వద్ద ముగియగా, నిఫ్టీ 15.35 పాయింట్లు కోల్పోయి 7,422.45 వద్ద నిలిచింది. కాగా, భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు గత ఏడాది (2015) భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది. మొత్తం స్టాక్, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 63,662 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది 2014లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. 2012, 2013 సంవత్సరాల్లోనూ లక్ష కోట్ల రూపాయల చొప్పున విదేశీ పెట్టుబడులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి.
ఇక రుణ మార్కెట్లలోకి 2014లో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.6 లక్షల కోట్ల రూపాయలు (26 బిలియన్ డాలర్లు)గా ఉంది. 2014లో మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి తరలివచ్చాయ. అయతే 2013లో రుణ మార్కెట్ల నుంచి 51,000 కోట్ల రూపాయల (8 బిలియన్ డాల ర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ 2012లో 35,000 కోట్ల రూపాయలు, 2011లో 42,000 కోట్ల రూపాయలు, 2010లో 46,408 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు.