మెగా-నందమూరి హీరోల మల్టీస్టారర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుచిత్రసీమలోఇప్పటివరకూ పోటీగా చెప్పుకున్న రెండు కుటుంబాలకు చెందిన హీరోలు కలిసి
ఓ సినిమాలో నటిస్తున్నారన్న విషయం ఇప్పుడు సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్
సినిమాల హవా బాగానేవుంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు మరో చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నందమూరి ఫ్యామిలీకి చెందిన కల్యాణ్‌రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ కలిసి ఓ చిత్రంలో నటించేందుకు రంగం
సిద్ధమైంది. వీరితో చిత్రాన్ని రూపొందించేందుకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి సన్నాహాలు చేస్తున్నారు. ‘పిల్లానువ్వులేని జీవితం’ సినిమాతో హిట్ అందుకున్న రవికుమార్ తాజాగా గోపీచంద్‌తో తీసిన ‘సౌఖ్యం’ చిత్రం అనుకున్న స్థాయిలో
హిట్టవ్వలేదు. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు రవికుమార్. ఇప్పటికే ఈ హీరోలిద్దరికీ కథ
వినిపించాడు. కథ నచ్చడంతో కల్యాణ్‌రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు తెలిసింది.