మహేష్ దర్శకత్వంలో శర్వానంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ నటుడు శర్వానంద్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. రన్‌రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ నటుడు విభిన్నమైన కథా చిత్రాన్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా మరో యంగ్ డైరెక్టర్‌కు ఓకె చెప్పాడట. ఆమధ్య సందీప్ కిషన్‌తో రారా కృష్ణయ్య చిత్రాన్ని రూపొందించిన మహేష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా రెడీ అయిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.