జాతీయ వార్తలు

మోదీ, హోలాన్‌లే టార్గెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: గణతంత్ర దినోత్సవ వేడుకలకు కనీవినీ ఎరుగని భద్రత కల్పిస్తున్నారు. 67వ రిపబ్లిక్‌డే వేడుకలను భగ్నం చేయడానికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ కుట్రపన్నిందన్న ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో పూర్తి అప్రమత్తత పాటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్‌కొయిస్ హోలాన్‌లను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్‌కొయిస్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సిఎన్‌ఎన్-ఐబిఎన్ వార్తా సంస్థ కథనం ప్రకారం ఇరువురు దేశాధినేతలను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ తెగబడే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సిఐఏ, ఫ్రెంచ్ ఇంటిలిజెన్స్ వర్గాలు భారత భద్రతా సంస్థలకు

సహకరిస్తున్నాయి. రాజ్‌పథ్ పరిసర ప్రాంతాలన్నింటినీ జల్లెడపడుతున్నారు. దేశ రాజధాని ప్రాంతం మొత్తం హై అలెర్ట్ ప్రకటించారు. పదివేల మంది సాయుధ దళాల సిబ్బందికి అదనంగా ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన 80వేల మందిని మోహరిస్తున్నారు. వివిఐపిలకు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. గత ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.