ఖమ్మం

మంత్రి తుమ్మల దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, ఫిబ్రవరి 5: కూలీలను కించపర్చే విధంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్యర్యంలో శుక్రవారం మండలం పరిధిలోని పోచారం గ్రామంలో మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మను గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించి గ్రామ నడిబొడ్డున దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పిట్టల రవి మాట్లాడుతూ రోజు వారి కూలీ పనులతో జీవనం సాగిస్తున్న కూలీలకు నిరకరమైన ఉపాధి అవకాశాలు కల్పించాల్సింది పోయి వారిని కించపర్చే విధంగా మాట్లాడటం సహించరానిదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకుడు మెరుగు సత్యనారాయణ,డివిజన్ నాయకులు కె.శ్రీనివాస్,కిరణ్,రమణ,ఉపేందర్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మాచర్ల భారతి, శ్రీను, గిరిప్రసాద్, శివ, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఇక వ్యవసాయం పండగే
* రైతులందరికీ భూసార పరీక్ష కార్డులు
* కేజ్ కల్చర్ విస్తరణలో జిల్లాకు ప్రాధాన్యత
* రాష్ట్ర మంత్రులు పోచారం, తుమ్మల
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఫిబ్రవరి 5: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగగా మార్చాయని, తమ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు ప్రయత్నిస్తుందని, ఇందుకు అధికారుల సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్ అండ్ బి శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావులు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలో వ్యవసాయ అనుబంధ రంగాల అమలు తీరు - ప్రగతిని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో అవసరమైన విత్తనాలు ఇక్కడే ఉత్పత్తి చేసి వినియోగించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల లక్ష్యం, వచ్చే సంవత్సరం ప్రణాళికలపై శాఖల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ మాసంలో జిల్లాలోని జూన్ నెలలో అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పెంపకం కోసం 7.22కోట్ల చేపల విత్తనాలు అవసరం ఉందని మత్స్య శాఖ ఏడి శ్రీనివాస్ మంత్రికి తెలిపారు. జిల్లాలోని నీటి వనరుల్లో పెంచేందుకు అవసరమైన చేప విత్తనాలను జిల్లాలోనే ఉత్పత్తి చేయాలని, బయట జిల్లాలు, రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవద్దని మంత్రి సూచించారు. ఫిష్ సీడ్ ఫాం బలోపేతంతో పాటు కొత్త సీడ్ పాం నిర్మాణం కోసం 35 లక్షలు మంజూరు చేశామన్నారు. ప్రయోగాత్మకంగా జిల్లాలో ప్రవేశపెట్టిన కేజ్ కల్చర్ పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు 30 లక్షలతో జిల్లాలో ఫీడ్ తయారీ మిషన్లను ఏర్పాటు చేశామన్నారు. మండల కేంద్రాల్లో ఉచితంగా స్థలాన్ని సమకూరిస్తే 15 లక్షలతో మత్స్యశాఖ ఔట్‌లెట్‌ను నిర్మిస్తామన్నారు. నట్టల నివారణ కార్యక్రమాన్ని రాష్టమ్రంతటా నిర్వహించామన్నారు. మరోసారి త్వరలో నిర్వహిస్తామన్నారు. 2015-16వ ఆర్థిక సంవత్సరంలో ఎన్‌సిడిపి కింద 10కోట్ల రాయితీతో గొర్రెల కాపరులకు గొర్రెలను అందించాలని మంత్రి ఆదేశించారు. మార్చి నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రైతుల భవిష్యత్తును మార్చే శక్తి ఉద్యానవనానికి ఉందన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల సహకారంతో రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీలతో రైతులకు అండగా నిలుస్తుందన్నారు. జిల్లాలో అధిక విస్తీర్ణం కలిగిన ఆయిల్‌ఫాం పంటకు అవసరమైన ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ నిర్మాణాన్ని జరుపుతున్నామన్నారు. దీని కోసం ముఖ్యమంత్రి 72కోట్లు మంజూరు చేశామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పథకాల కేటాయింపు జరపాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, లోకేష్‌కుమార్, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు
* 9 గంటల విద్యుత్‌పై ప్రధాన చర్చ
* నేడు సిఎండి పర్యటన

ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 5: తెలంగాణ రాష్ట్రంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించటంతో పాటు వ్యవసాయానికి పగటిపూట 9గంటల విద్యుత్ అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనికోసం విద్యుత్ అధికారులకు పలు సూచనలు అందించటంతో పాటు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా శనివారం జిల్లా విద్యుత్ అధికారులతో వరంగల్‌రెంజ్ సిఎండి వెంకటనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మార్చి నుండి ప్రారంభంకానున్న వ్యవసాయానికి పగటిపూట 9గంటల విద్యుత్‌పై ప్రాదనంగా చర్చించనున్నట్లు సమాచారం. జిల్లాలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ప్రణాళిక సిద్దం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. అలాగే జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వయర్‌లలో త్వరలో ప్రారంభంకానున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు కావలసిన విద్యుత్ పనులను పరిశీలించనన్నుట్లు సమాచారం. విద్యుత్ సమస్యలను పరిష్కరించే దిశగా విద్యుత్‌శాఖ కృషి చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఫిడర్‌లు సైతం సరిగా పనిచేయకపోవడంతో అధికారులు సైతం ఎమీ చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనితో పాటు పలు అంశాలపై అధికారులతో చర్చించనున్నారు.

5 కెఎంపి-2: ఎంపికలను పర్యవేక్షిస్తున్న స్వామి రమేష్‌కుమార్

5 కెఎంపి-4: ఎంపికల కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కొబ్బరి బొండాలు

నేటి నుంచి జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు
* ఎంపిక ప్రక్రియ పూర్తి
* వయస్సు వారీగా శారీరక కొలతలు
* నేటి నుంచి జాతీయ స్థాయి పోటీలు ప్రారంభం

ఖమ్మం(స్పోర్ట్స్), ఫిబ్రవరి 5: జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా శుక్రవారం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారుల వయస్సు కేటగిరి వారీగా శారీరక కొలతలను, ఎత్తు, బరువు తదితర అంశాలలో ఎంపికలను పూర్తి చేశారు. జూనియర్ విభాగంలో 55, 60, 65, 70, 75 కేజీలు, మాస్టర్స్ విభాగంలో 40-50 వయస్సు కేటగిరిలో 50,60, 60 వయస్సు పైగా ఉన్న కేటగిరిల్లో ఎంపికలు నిర్వహించారు. ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ విభాగంలో 65 కేజిలు, ఆ పైనా వయస్సు విభాగంలో 65 కేజిల అంశాలలో ఎంపికలు నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు దాదాపు 350 మంది ఎంపికల ప్రక్రియలో పాల్గొన్నారు. వీరికి జాతీయ బాడిబిల్డింగ్ అసోసియేషన్ కోశాధికారి స్వామి రమేష్‌కుమార్ వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు ఫుడ్‌కిట్స్‌లను పంపిణీ చేశారు. దాహం తీర్చుకునేందుకు కొబ్బరి బొండాలను ఎంపికల కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని రమేష్‌కుమార్ తెలిపారు. ముఖ్య అతిధిగా వరంగల్ మాజీ ఎంపి సురేందర్‌రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. ఎంపికలను రావినూతన శ్రీనివాసరావు, టోర్నమెంట్ కన్వీనర్ అప్పారావు తదితరులు పర్యవేక్షించారు.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
గార్ల, ఫిబ్రవరి 5: వైద్య సిబ్బంది స్థానికంగా ఉండాలని, విధులను నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఎ.కొండల్‌రావు హెచ్చరించారు. గార్ల సివిల్ ఆసుపత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ జరిపిన అనంతరం స్థానిక విలేకరుల మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది తాము పని చేస్తున్న స్థానాల్లోనే నివాసం ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. గార్ల సివిల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ ఐదు కోట్ల రుపాయాలను మంజూరు చేసిందని, టెండర్లు ఖరారు కాగానే పనులు జరుగుతాయన్నారు. వైద్య సేవలకై ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది అనుకూవగా ఉండాలని సూచించారు. డిఎండిహెచ్‌ఓ వెంట గార్ల సివిల్ ఆసుపత్రి డాక్టర్ రాణాప్రతాప్ సింగ్ తదితరులున్నారు.

అవమానిస్తే సహించేది లేదు
ఖమ్మం(కల్చరల్), ఫిబ్రవరి 5: వ్యవసాయకూలీలు, పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్, దాన్ని అడ్డంపెట్టుకొని మంత్రిగా కొనసాగుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేబర్‌తో వ్యవసాయం చేయించొద్దంటూ, అలాగే వారికి వ్యవసాయ పనులు ఇవ్వదంటూ మాట్లాడటాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శుక్రవారం స్ధానిక సరిత క్లినిక్ సెంటర్ జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంత్రి తమ్మల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు బట్టారు. దమ్మపేట మండలంలో మంత్రి మాట్లాడుతూ శ్రామికులు, కూలీలు అనే పదాలు పలకడానికే చిరాకుగా ఉందని, రైతులకు లాభాలు రావాలంటే యంత్రాలతోనే పనులు చేయించాలని, కూలీలతో పనులు చేయించవద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. పొగాకు పంట వేయవద్దని, కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు, కూలీలకు మద్య అగాధాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. రైతులను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలకు నిరసనగా నేడు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంత్రిదిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. తమ మాటలను ఉపసంహరించుకోవాలని, అలాగే వ్యవసాయ కూలీలకు మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి శ్రీనివాసరావు, పాలేరు డివిజన్ కార్యదర్శి పి. సంగయ్య, కెవిపియస్ నాయకులు నందిపాటి మనోహర్, ఐ జోసఫ్, సిఐటియు నాయకులు బత్తుల గణపతి, పిఆర్ దేవి, సిహెచ్ కుమారి, ఎం గోపాల్, గోగుల నాగరాజు, రవి, జియంఫిఎస్ నాయకులు మేకల నాగేశ్వరరావు, విధ్యార్ధి సంఘం నాయకులు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
ఖానాపురం హవేలి, ఫిబ్రవరి 5: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 32పరీక్షా కేంద్రాల్లో ఉదయం పరీక్ష నిర్వహించగా, జనరల్ విభాగంలో 1637మంది అభ్యర్థులకు గాను 1555మంది అభ్యర్థులు హాజరు కాగా, 82మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదే విధంగా ఓకేషనల్ విభాగంలో మొత్తం 756మందికి 680మంది హాజరు కాగా, 76మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా సాయంత్రం జరిగిన 30పరీక్షా కేంద్రాల్లో జనరల్ విభాగంలో 1220మందికి 1121 హాజరు కాగా 89మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 689మంది విద్యార్థులకు 576మంది హాజరుకాగా 113మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వివిధ సబ్జెక్ట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను ఆర్‌ఐఓ నెల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు 19పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు.

ఆకతాయిల ఆగడాలు

గార్ల, ఫిబ్రవరి 5: గార్ల రైల్వే స్టేషన్ సమీపంలోని పాకాల ఏరు వంతెన దిగువ రైల్వే లైనుపై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప చర్రాలను(గుండ్లు) పెట్టి అధికారులను హైరానాకు గురి చేసిన సంఘటన శుక్రవారం గార్లలో వెలుగులోకి వచ్చింది. ఖాజీపేట నుంచి విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్ రైలు గార్ల పాకాల ఏరు వంతెన పైకి రాగానే రైలు పట్టాలపై శబ్దం రావడంతో రైలును నిలిపిన గూడ్స్ డ్రైవర్ పరిశీలించి రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు డోర్నకల్ జంక్షన్‌లో గూడ్స్ రైలు నిలిపి వేశారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే డివిజన్ ఎడిఅర్‌ఎం టాంటాతో పాటు పలువురు రైల్వే ఉన్నతాధికారులు, ఖమ్మం, వరంగల్ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరీక్షించారు. పాకాల ఏరు వంతెన దాటిన తరువాత రైలు పట్టాపై రంధ్రం ఏర్పడింది. ఇది ఆకతాయిల పనై ఉండ వచ్చునని రైల్వే అధికారులు, పొలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామన్నారు. ఈ పరిశీలనలో సికింద్రాబాద్ రైల్వే డివిజన్ ఎడిఅర్‌ఎం టాంటా, సీనియర్ డిఇఎం మనోహార్,సౌత్ జోన్ ఎడిఇఎం కె.శ్రీనివాస్, సెక్షన్ ఇంజనీర్ మేఘనాథ్, ఖమ్మం జిఅర్‌పి సిఐ పి.స్వామి,వరంగల్, డోర్నకల్ ఎస్‌ఐలు భవాని శంకర్ సరస్వతి, దేవెందర్,ఎఎస్‌ఐ ధారాసింగ్ పాల్గొన్నారు.

రక్తికట్టిస్తున్న నాటికలు
* హోరెత్తుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు
* భద్రాద్రి కళాభారతి నాటకోత్సవాలు
భద్రాచలం, ఫిబ్రవరి 5: భద్రాద్రి కళాభారతి 14వ రాష్టస్థ్రాయి తెలుగు నాటకోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ప్రదర్శించిన నాటికలు ఎవరిని ఎవరు క్షమించాలి?, ఆశ్రయం రక్తికట్టించాయి. అన్ని మతాలకంటే గొప్పది మానవత్వం అనే మతం, ఈ మతంలో క్షమించడాన్ని మించిన గొప్పతనం లేదు అని సందేశంతో ఎవరిని ఎవరు క్షమించాలి? అనే నాటిక సాగింది. రచన, దర్శకత్వం వహించిన ఉదయభాగవతుల చక్కని సన్నివేశాలతో నాటికకు ప్రాణం పోశారు. బిడ్డలొకచోట, వృద్ధ తల్లిదండ్రులు ఒక చోట మారుతున్న కాలం, వేగం, ఉద్యోగ రీత్యా విదేశాల్లో పిల్లలు ఉంటుండగా, వారిని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఆశ్రమాల్లో ఉంటున్న తీరుపై ఆశ్రమం అనే నాటిక సాగింది. కులం కన్నా గుణం గొప్పది, మతం కన్నా మానవత్వం గొప్పది..అని చక్కగా నాటిక ద్వారా చెప్పారు. అంతకు ముందు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్‌ను భద్రాద్రి కళాభారతి సత్కరించింది.
మధుకాన్ గ్రానైట్‌కు అవార్డు

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 5: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో శుక్రవారం జరిగిన 12వ అంతర్జాతీయ గ్రానైట్ స్టోనా(2016)ప్రదర్శనలో మధుకాన్ గ్రానైట్‌కు అత్యుత్తమ అవార్డు లభించింది. అక్కడ జరిగిన స్టోనా 2016లో వివిధ ప్రాంతాలకు చెందిన గ్రానైట్ పరిశ్రమలు తమ ప్రదర్శనలు ఉంచగా అందులో మధుకాన్ కూడా ఉంచింది. వీటిలో మధుకాన్ గ్రానైట్స్, క్వారీలు వాటి పద్ధతులు, ఉపయోగించే విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖామంత్రి పీతల సుజాత, రవాణాశాఖామంత్రి మంత్రి సిద్ధారాఘవరావులు పాల్గొని మధుకాన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నామ కృష్ణయ్యను అభినందించారు. మధుకాన్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సంస్థ సీనియర్ అసిస్టెంట్, జనరల్ మేనేజర్ సుధాకర్, అసిస్టెంట్ మేనేజర్ మల్లిఖార్జున్, కె.జయంత్ తదితరులు పాల్గొన్నారు.