క్రీడాభూమి

మహిళల వనే్డ క్రికెట్ సిరీస్ రెండో మ్యాచ్‌లోనూ ఓడిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్, ఫిబ్రవరి 5: భారత మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వనే్డ (డే/నైట్) సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు కాన్‌బెర్రాలో జరిగిన వనే్డలో భారత్‌ను 101 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా జట్టు తాజాగా శుక్రవారం హోబర్ట్‌లోని బెల్లిరీవ్ ఓవల్ మైదానంలో జరిగిన రెండో వనే్డలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్ తిరుష్కామినీ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ మరో ఓపెనర్ స్మృతి మందన (102) క్రీజ్‌లో నిలదొక్కుకుని సెంచరీతో సత్తా చాటుకుంది. ఫస్ట్‌డౌన్‌గా దిగిన కెప్టెన్ మిథాలీ రాజ్ (58)తో కలసి రెండో వికెట్‌కు 150 పరుగులు జోడించిన మందన మూడో వికెట్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ (21)తో కలసి మరో 34 పరుగులు జోడించింది. వీరి నిష్క్రమణ తర్వాత శిఖా పాండే (33-నాటౌట్), ఏక్తా బిస్త్ మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు సాధించింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టులో మిడిలార్డర్ క్రీడాకారిణి ఎజె.బ్లాక్‌వెల్ (19) మినహా మిగిలిన వారంతా చక్కగా రాణించారు. ఓపెనర్ ఎన్‌ఇ.బోల్టన్ (77), కెప్టెన్ ఎంఎం.లానింగ్ (61) తొలి వికెట్‌కు 138 పరుగుల భారీ భాస్వామ్యాన్ని అందించి నిష్క్రమించగా, ఫస్ట్‌డౌన్ క్రీడాకారిణి ఇఎ.పెర్రీ 33 పరుగులు సాధించి వైదొలిగింది. ఆ తర్వాత జెఎల్.జొనాస్సెన్ (29), వికెట్ కీపర్ ఎజె.హాలే (29) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తిచేశారు. దీంతో 46.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్మృతి మందనను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.