జాతీయ వార్తలు

మోదీ విధానాలను ఎండగట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇకనైనా దేశ పాలనపై దృష్టి సారించాలని, సాకులతో కాలం వెళ్లదీయటం మానివేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హితవు పలికారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమావేశమయ్యారు.
యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా పథకం, తదితర సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం ఎలా అమలు చేస్తోంది? ఎలా వక్రీకరిస్తోంది అన్న అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన పిసిసి అధ్యక్షులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ దేశ పాలనపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టి రెండేళ్లు కావస్తున్నా దేశానికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధ్వజమెత్తారు. ‘మోదీ దేశ పాలనపై దృష్టి కేంద్రీకరించటం లేదు. నిత్యం ఏవో సాకులతో కాలం వెళ్లబుచ్చుతున్నారు’ అని ఆయన ఆరోపించారు. దేశాన్ని పాలించవలసిన బాధ్యత ప్రధానమంత్రిది, కానీ నరేంద్ర మోదీ ఈ బాధ్యతలను నిర్వహించటం లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్‌డిఏది పేద ప్రజలు, రైతులు, కార్మికులు, శ్రామికుల వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విరుచుకుపడ్డారు. దేశంలోని పేదలు, కార్మికులు, రైతులు, శ్రామికుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునేంత వరకు మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఒత్తిడి కొనసాగుతుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘మీరూ మీమీ రాష్ట్రాల్లో ఎన్‌డిఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అని పిసిసి అధ్యక్షులకు ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం దేశంలోని ముగ్గురు లేదా నలుగురు బడా పారిశ్రామికవేత్తల కోసం పని చేస్తోందని, దీన్ని కాంగ్రెస్ కొనసాగనివ్వదని ఆయన హెచ్చరించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటు న్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. చిన్న వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. ‘ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు యుపిఏ ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై దాడి చేస్తున్నాయి.
ఈ దాడిని తిప్పికొట్టేందుకు పిసిసి అధ్యక్షులు సిద్ధం కావాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టం, గిరిజనుల హక్కుల పరిరక్షణ తదితర పథకాలను బిజెపి ప్రభుత్వం దెబ్బ తీస్తోందని ఆయన విమర్శించారు.