ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ దీక్షతో ప్రయోజనం శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: ప్రభుత్వం కాపుల పట్ల సానుకూలంగా వున్నా, కాపుల రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా... ముద్రగడ పద్మనాభం దీక్ష ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని మంత్రి నారాయణ అన్నారు. కిర్లంపూడిలో ఆయన చేస్తున్న ఆమరణ దీక్ష వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ వుండదని, అనవసరంగా ప్రభుత్వం మీద బురదజల్లడం, కాపుల్లో గందరగోళం సృష్టించడం మాత్రమే ఆయన అజెండాగా కన్పిస్తోందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, అలాగే జస్టిస్ మంజునాథ నేతృత్వంలో బిసి కమిషన్‌ను పునర్వ్యస్థీకరించి, విధి విధానాలపై కూడా చర్చించడం జరిగిందని అన్నారు. అయినా ప్రభుత్వం సానుకూలంగా లేనందువల్లే దీక్ష చేస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం చేస్తున్న వ్యాఖ్యలు సత్యదూరమైనవని, గతంలో కూడా ఆయన చేసిన విమర్శలు అవాస్తవాలన్న విషయం కాపు సోదరులందరికీ ఇప్పటికే అవగతమైందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు తుని కాపు గర్జన సభకు అనుమతులు తీసుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, సభకు ఎటువంటి ఆటంకాలు కూడా కల్పించని విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రస్తావించారు. ప్రభుత్వం నుండి 81 ఆర్జీసీ బస్సులను వినియోగించుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం ఏదో చేసిందని విమర్శలు చేయడం భావ్యం కాదని ముద్రగడకు మంత్రి నారాయణ హితవు పలికారు. సరిగ్గా అధ్యయనం చేయకుండా ఏదో హడావుడిగా జీవోలు ఇవ్వడం వల్ల కాపులకు అన్యాయం జరుగుతుందన్న విషయం గత అనుభవాలు తెలిసిన వారందరికీ అర్ధమైందని, అన్నీ తెలిసిన ముద్రగడ కాపులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు.