జాతీయ వార్తలు

హత్య కేసులో కేరళ వ్యాపారికి 39 ఏళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిసూర్, జనవరి 21: సెక్యురిటీ గార్డు హత్యకేసులో కేరళకు చెందిన బీడీ వ్యాపారి మహ్మద్ నషామ్‌కు కోర్టు 39 ఏళ్ల జైలుశిక్ష విధించింది. బీడీ బరాన్‌గా పిలిచే నషామ్ తన లగ్జరీకారుతో వాచ్‌మెన్‌ను ఢీకొట్టి మృతికి కారణమయ్యాడు. కేసుసు విచారించిన మొదటి అదనపుజిల్లా, సెషన్స్ న్యాయమూర్తి కెపి సుధీర్ 40 ఏళ్ల బీడీ బరాన్‌కు ఏకంగా 39 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. అలాగే 80.30 లక్షల జరిమానా విధించారు. నషీమ్‌కు యావజ్జీవ శిక్షతో కలుపుకొని అదనంగా 24 ఏళ్లు మొత్తం 39 ఏళ్లు జైలుశిక్ష వేశారు. బీడీ వ్యాపార దిగ్గజం మహ్మద్ నషామ్ 39 ఏళ్లు జైలు ఊచలు లెక్కించాల్సిందేనని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్‌పిపి) సిపి ఉదయభాను స్పష్టం చేశారు. 5000 కోట్లకు అధిపతి అయిన నషామ్ గేటు తీయలేదన్న ఆగ్రహంతో సెక్యూరిటీ గార్డును కారుతో ఢీకొట్టాడు. దీన్ని అరుదైన కేసుగా పరిగణించి ముద్దాయికి ఉరిశిక్ష వేయాలని ప్రాసిక్యూషన్ డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి ఐదు కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలన్న ప్రాసిక్యూషన్ సూచనను కోర్టు తోసిపుచ్చింది. 51 ఏళ్ల సెక్యురిటీగార్డు చంద్రబోస్‌ను గత జనవరి 29న నషీమ్ హత్య చేశారు. ఈ కేసులో బీడీ వ్యాపారిని బుధవారం కోర్టు దోషిగా నిర్ధారించింది.