తెలంగాణ

ముందస్తు మొక్కులు.. తరలివస్తున్న భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, ఫిబ్రవరి 12: వన దేవతలైన మేడారం సమ్మక్క - సారలమ్మ గద్దెల వద్ద ముందస్తు మొక్కులు కొనసాగుతున్నాయి. సారలమ్మ గద్దెపై కొలువుదీరే ఫిబ్రవరి 17 నుండి వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేసే 20వ తేదీ వరకు జరగనున్న మేడారం మహా జాతరకు ఈ సంవత్సరం కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో లక్షలాది మంది జాతరకు ముందే ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
దీంతో ఏ దారి చూసినా భక్తులతో మేడారం వచ్చే వాహనాలే కనబడుతున్నాయి. ఈ నెల 10వ తేదీ (బుధవారం) మండ మెలిగే పండుగ కాగా ఆ రోజు నుండి తల్లులను దర్శించుకునేందుకు మేడారం వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. మొదట జంపన్నవాగులో పవిత్ర స్నానాలు ఆచరించి అటు పిమ్మట తల్లుల దర్శనం, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న భక్తులతో జంపన్న వాగుతో పాటు గద్దెల ప్రాంగణం కిటకిటలాడుతోంది. జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు.
అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించిన అనంతరం మేడారం పరిసర ప్రాంతాలలో విడిది చేసుకుని భక్తులు కోళ్ళను, యాటపోతులను అమ్మవార్లకు బలిచ్చి బంధుమిత్రులతో విందులు చేసుకుంటున్నారు. మేడారం, రెడ్డిగూడెం, కొత్తూరు గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా తమ వ్యాపారాల కోసం వ్యాపారస్థులు ఏర్పాటు చేసుకున్న గుడారాలతో నిండిపోయాయి.
జంపన్నవాగుకు జలకళ
ట్రయల్ రన్ పేరిట గత వారం రోజుల క్రితమే అధికారులు జంపన్నవాగులోకి లక్నవరం నీటిని విడుదల చేయడంతో జంపన్నవాగుకు జలకళ వచ్చింది. జంపన్నవాగులో నీటి ప్రవాహానికి పలు చోట్ల ఇసుక నింపిన బస్తాలతో అడ్డుకట్టలు వేయడంతో జంపన్నవాగులో స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగడంలేదు. వారం రోజుల వరకూ బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ క్రింద మాత్రమే భక్తులు స్నానాలు ఆచరించేవారు కానీ గత వారం రోజుల నుండి జంపన్నవాగులో నీరు ప్రవాహంలా పరుగులెడుతుండడంతో భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరిస్తున్నారు.