మేలో చైనా బాహుబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవౌళి రూపొందించిన ‘బాహుబలి’ ప్రభంజనం చైనా దాకా వెళ్లింది. ఈ సినిమా అంతర్జాతీయ సాంకేతిక విలువలతో రూపొందడంతో పలు హాలీవుడ్ పత్రికల మన్ననలు కూడా పొందింది. విదేశాల్లోని ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. పలు అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ‘బాహుబలి’కి చైనా, జపాన్, జర్మనీ, లాటిన్ అమెరికాలలో విడుదల చేసేంత రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ముందుకు వచ్చాయి. సినిమా నిడివిని సుమారు 20 నిమిషాలపాటు తగ్గించి, ఇంటర్నేషనల్ కాపీని సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే చైనాలో ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేస్తున్నట్లుగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రకటించింది. సుమారు 6వేల స్క్రీన్‌లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.