క్రీడాభూమి

ముంచేసిన బ్యాట్స్‌మెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్, ఫిబ్రవరి 14: దారుణంగా విఫలమైన బ్యాట్స్‌మెన్ నిలువునా ముంచేయడంతో అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ పరాజయాన్ని ఎదుర్కోగా, వెస్టిండీస్ మొట్టమొదటిసారి విజేతగా నిలిచింది. సర్ఫ్‌రాజ్ ఖాన్ (89 బంతుల్లో 51 పరుగులు) హాఫ్ సెంచరీ మినహా భారత బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు. ఫలితంగా 45.1 ఓవర్లలో 145 పరుగులకే ఇండియా కుప్పకూలింది. అనంతరం వెస్టిండీస్ మరో మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించి, 5 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం మూడు పరుగుల స్కోరువద్ద రిషబ్ పంత్ (1) వికెట్‌ను చేజార్చుకుంది. అల్జరీ జోసెఫ్ వేసిన బంతిని క్రీజ్ బయటకు వచ్చి కొట్టేందుకు ప్రయత్నించి విఫలమైన అతనిని వికెట్‌కీపర్ టెవిన్ ఇమ్లాచ్ స్టంప్ చేయడంతో అవుటయ్యాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (4), అన్మోల్‌ప్రీత్ సింగ్ (3), వాషింగ్టన్ సుందర్ (7), అర్మాన్ జాఫర్ (5) సింగిల్ డిజిట్స్‌కే పరిమితం కావడం భారత్‌ను దారుణంగా దెబ్బతీసింది. మహిపాల్ లొమ్రోర్‌తో కలిసి జట్టును ఆదుకునేందుకు సర్ఫ్‌రాజ్ విపరీతంగా శ్రమించాడు. కానీ అతని శ్రమ ఫలించలేదు. 19 పరుగులు చేసిన మహిపాల్‌ను ఇమ్లాచ్ క్యాచ్ అందుకోగా కెమెర్ హోల్డర్ పెవిలియన్‌కు పంపాడు. మాయాంక్ డాగర్ ఎనిమిది పరుగులు చేసి ర్యాన్ జాన్ బౌలింగ్‌లో కార్టీకి చిక్కి వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు కూలుతున్నా క్రీజ్‌లో నిలదొక్కుకొని, వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన సర్ఫ్‌రాజ్ మొత్తం 89 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేసి జాన్ బౌలింగ్‌లోనే ఎల్‌బిగా వెనుదిరిగడంతో భారత్ పోరాటానికి దాదాపు తెరపడింది. రాహుల్ బాథమ్ (21), ఆవేష్ ఖాన్ (1) వెంటవెంటనే అవుట్‌కాగా, భారత్ 145 పరుగులకు ఆలౌటయ్యే సమయానికి ఖలీల్ ఖాన్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో జోసెఫ్ 39 పరుగులకు మూడు, ర్యాన్ జాన్ 38 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. కీమోపాల్ 17 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
భారత బ్యాట్స్‌మెన్ విఫలంకాగా, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి బౌలర్లు విపరీతంగా శ్రమించారు. వెస్టిండీస్ లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకోవడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. అయితే, సాదాసీదా చివరి ఓవర్ మూడో బంతిలో విండీస్ లక్ష్యాన్ని ఛేదించింది. గిడ్రాన్ పోప్ (3), టెవిన్ ఇమ్లాచ్ (15), కెప్టెన్ షిమ్రోన్ హెట్మేయర్ (23) పరుగులు చేసి వెనుదిరిగారు. షారమ్ స్ప్రింగర్ (3), జేడ్ గూలీ (3) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. అయితే, కీసి కార్టీ (52 నాటౌట్), కీమో పాల్ (40 నాటౌట్) చక్కటి భాగస్వామ్యం విండీస్‌ను గెలిపించింది. ఆ జట్టు 49.3 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి, ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఫైనల్ వరకూ వరుస విజయాలతో అదరగొట్టిన భారత్ అనూహ్యంగా తుది పోరులో గట్టిపోటీనివ్వలేక చతికిలబడింది. కార్టీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా మెహెదీ హసన్ మిరాజ్ ఎంపికయ్యాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 45.1 ఓవర్లలో 145 ఆలౌట్ (సర్ఫ్‌రాజ్ ఖాన్ 51, రాహుల్ బాథమ్ 21, మహిపాల్ లొమ్రోర్ 19, అల్జరీ జోసెఫ్ 3/39, ర్యాన్ జాన్ 3/38, కీమో పాల్ 1/17).
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 49.3 ఓవర్లలో 5 వికెట్లకు 146 (టెవిన్ ఇమ్లాచ్ 15, షిమ్రోన్ హెట్మేయర్ 23, కీసి కార్టీ 52 నాటౌట్, కీమో పాల్ 40 నాటౌట్, మయాంక్ డగర్ 3.25).