రాష్ట్రీయం

మీకోసం నేనున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 15: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఖమ్మం ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఖమ్మం నగరంలోని మురికివాడల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఖమ్మం నూతన బస్టాండ్ నిర్మాణ స్థలం, డంపింగ్ యార్డు, రమణగుట్ట ప్రాంతం, సుందరయ్యనగర్, శ్రీనివాసనగర్, హర్కార బావి సెంటర్, ఖిల్లా, మోమినాన్ స్కూల్ సెంటర్, తుమ్మలగడ్డ, తదితర ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఇళ్లు, తాగునీటి సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ఆయన వెంటనే పరిష్కరించి, మంగళవారంలోగా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. సుందరయ్యనగర్, హర్కార బావి సెంటర్, శ్రీనివాసనగర్‌లలో మహిళలతో ముచ్చటించారు. ఖిల్లాలో ముస్లిం పెద్దలతో 20 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని, రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనే విషయాన్ని రుజువు చేస్తామని కెసిఆర్ చెప్పారు. కాగా లకారం చెరువు ద్వారా ఖమ్మం నగరంలో తాగునీటిని అందించేందుకు రూ.13.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. లకారం చెరువు ఆక్రమణలను తొలగించి సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ప్రజలు హారతులిస్తూ తమ సమస్యలు చెప్పుకుంటూ ఆయనతో కలిసి ముందుకు సాగారు.